News


మిడ్‌క్యాప్‌లో ఐసీఐసీఐ డైరెక్ట్‌ సిఫారసులు

Thursday 26th December 2019
Markets_main1577299671.png-30435

నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ దిద్దుబాటు చానల్‌ను అధిగమించే దశలో ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ విశ్లేషించింది. గత రెండేళ్ల ధరల క్షీణత చానల్‌ను బ్రేకవుట్‌ చేసే విధంగా బుల్‌ మార్కెట్‌ సంకేతాన్ని ఇచ్చినట్టు తెలిపింది. లార్జ్‌క్యాప్‌ కంపెనీలు 2019లో మంచి పనితీరు చూపించగా, సాంకేతింగా చూస్తే మిడ్‌క్యాప్‌ నూతన బుల్‌ ట్రెండ్‌కు సమీపంలో ఉందని అభిప్రాయపడింది.

 

‘‘దేశీయ బెంచ్‌మార్క్‌లు నూతన జీవితకాల గరిష్టాలను చేరాయి. ఈ ప్రక్రియలో దేశీయ, అంతర్జాతీయ అనిశ్చితులను అధిగమించాయి. చాలా మంది ఇన్వెస్టర్లకు ఫలితం మాత్రం మిశ్రమమే. ఎందుకంటే బ్రోడర్‌ మార్కెట్‌ (మార్కెట్‌వ్యాప్తంగా) ర్యాలీలో లేదు. సంప్రదాయ బుల్‌ మార్కెట్‌ ముందున్నదని సాంకేతిక అంశాలు, ధోరణుల ఆధారంగా తెలుస్తోంది. మిడ్‌క్యాప్‌ నూతన అప్‌ట్రెండ్‌కు ముందస్తు దశలో ఉంది’’ అని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తన నివేదికలో వివరించింది. మారుతున్న మార్కెట్‌ ధోరణులకు అనుగుణంగా.. నాణ్యమైన మిడ్‌క్యాప్‌ కంపెనీలకు పెరిగే వెయిటేజీని పరిణనలోకి తీసుకుని, ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియోను ఇప్పుడే ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

 

ఏడు స్టాక్స్‌ వచ్చే 12 నెలల కాలంలో 19-38 శాతం మధ్య రాబడులు ఇచ్చే అవకాశాలున్నాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంటూ ఆ వివరాలను వెల్లడించింది. అవి ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హిందాల్కో, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌, ఆర్‌పీజీ లైఫ్‌సైన్సెస్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌. నిఫ్టీకి 14,000 టార్గెట్‌ను ఇచ్చింది. ‘‘నిఫ్టీ స్టాక్స్‌లో మంచి పనితీరు చూపించేవి, మంచి కొనుగోలుకు ఆకర్షణీయంగా ఉన్న స్టాక్స్‌ వెయిటేజీ 73 శాతం. ఇవి 20 శాతానికి పైగా రిటర్నులు ఇస్తాయని అంచనా వేస్తున్నాం’’అని తెలిపింది. అమెరికా, యూరోపియన్‌ మిడ్‌క్యాప్‌ సూచీలు రెండేళ్ల నిశ్చలదశ తర్వాత నూతన జీవిత కాల గరిష్టాలను తాకుతున్నాయని, భారత మిడ్‌క్యాప్‌లు కూడా ఇదే బాటలో పయనించే అవవకాశాలున్నాయని అంచనా వేసింది. You may be interested

‘మెటల్స్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌.. హాట్‌’

Thursday 26th December 2019

మెటల్స్‌, హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్స్‌ 2020లో బ్రహ్మాండమైన రాబడులు ఇచ్చే అవకాశాలున్నాయని ప్రముఖ మార్కెట్‌ నిపుణులు, శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో మన మార్కెట్లు ఏ విధంగా ఉంటాయన్న విషయమైన ఆయన తన అభిప్రాయాలను ఓ ప్రముఖ వార్తా సంస్థతో పంచుకున్నారు.   2020లో మార్కెట్ల గమనం.. 12-15 శాతం ర్యాలీని అంచనా వేస్తున్నాం. అయితే అన్ని నెలల్లోనూ రాబడులు ఒకే విధంగా ఉండకపోవచ్చు. కొన్ని నెలల్లో

2019: ఈ షేర్లు జీరోలు

Wednesday 25th December 2019

కుప్పకూలిన అడాగ్‌ కౌంటర్లు యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌ బోర్లా జాబితాలో జెట్‌ ఎయిర్‌వేస్‌, మన్‌పసంద్‌ నిజానికి ఈ ఏడాది దేశీయంగా ఓవైపు పలు సానుకూల వార్తలు వెలువడగా.. మరోపక్క అంతర్జాతీయ స్థాయిలో ప్రతికూల పవనాలూ వీచాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు పలుమార్లు హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతూ వచ్చాయి. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం నెలకొనడం, ప్రభుత్వ సంస్కరణలు, రిజర్వ్‌ బ్యాంక్‌ రేట్ల కోతలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు తదితర సానుకూల

Most from this category