News


రెండేళ్లలో లార్జ్‌క్యాప్స్‌ను మించి మిడ్‌క్యాప్స్‌ లాభాలు!

Monday 11th November 2019
Markets_main1573457813.png-29504

 ‘మిడ్‌క్యాప్స్‌ సెక్టార్‌ యూ ఆకారపు రికవరికి సిద్ధంగా ఉందని అంచనావేస్తున్నాం. జీడీపీ వృద్ధి చెందితే ఈ స్టాకులు కూడా మంచి ప్రధర్శన  చేయడం గమనించవచ్చు. ముందుకెళ్లే కొద్ది జీడీపీ రికవరి అవుతుందనే అంచనాలున్నాయి. ఈ రికవరి విస్తృతంగా ఉంటే, ఇంకో రెండుమూడేళ్లలో మిడ్‌క్యాప్స్‌, లార్జ్‌ క్యాప్‌లను మించి ప్రదర్శన చేస్తాయి’ అని యాక్సిస్‌ క్యాపిటల్‌, రీసెర్చ్‌ హెడ్‌, కశ్యప్‌ పుజారా ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..
ఆర్థిక వ్యవస్థ రికవరికి సిద్ధం..
ప్రస్తుతం మార్కెట్లు ‘ఏడాది ముందస్తు ఆదాయాలకు’ 17-18 రెట్లు వద్ద ట్రేడవుతున్నాయి. ఇది వాల్యుషన్‌ల సగటు కంటే స్వల్ప మొత్తంలో అధికం కావడం గమనార్హం. ప్రస్తుతం వ్యవస్థలో మందగమనం కొనసాగుతున్నప్పటికి, ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణల వలన యూ-ఆకారపు రికవరి ప్రారంభమైనట్టు అనిపిస్తోంది. ప్రభుత్వం కార్పోరేట్‌ పన్ను రేటును తగ్గించడం వలన వ్యవస్థలో పెట్టుబడులు పెరుగుతాయి. ఫలితంగా ఒకటి లేదా రెండేళ్లలో దేశ జీడీపీ వృద్ధి రేటు మెరుగువుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4 నాటికి ప్రస్తుతం ఉన్న స్థాయిల కంటే అధికంగా ఉంటుందని అం‍చనా వేస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ రికవరి అవుతుందనే ఆలోచనతో మార్కెట్లు కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. దీనిపై ఇన్వెస్టర్లు విచారణ చేసి, వచ్చే మూడు లేదా నాలుగేళ్ల కోసం పెట్టుబడులు పెడుతున్నారు. 

బ్యాంకింగ్‌ సెక్టార్‌ ఈ రెండు ధోరణులు..
బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ఆధిపత్య ధోరణి కీలకంగా ఉంది. ప్రైవేట్‌  బ్యాంకులు లేదా అతి పెద్ద ప్రభుత్వం రంగ బ్యాంకుల ఆధిపత్యం పోటీ ప్రయోజనానికి కీలకంగా ఉంది. ఎన్‌బీఎఫ్‌సీ సమస్యల వలన ఇప్పట్లో ఈ ఆధిపత్యం మారే అవకాశాలు తక్కువ. దీనితోపాటు చాల వరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రోవిజన్లు పెరుగుతున్నాయి. ఫలితంగా ఈ బ్యాంకుల మార్కెట్‌ వాటా ప్రైవేట్‌ బ్యాంకులకు మారుతోంది. అంతేకాకుండా  ఇక ముందు కూడా అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంకులు లేదా ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిమాణం పెరుగుతుందని అంచనావేస్తున్నాం. 
   బ్యాంకింగ్‌ సెక్టార్లో ఏకీకరించటం(కన్వర్జన్స్‌) ధోరణి కూడా ఊపందుకుంది. గతంలో బ్యాంకు రిటైల్‌ ఆధారిత రుణాలను ఒక వైపు, కార్పోరేట్‌ ఆధారిత రుణాలను మరోవైపుగా విభజించేవారు. ప్రస్తుతం అతి పెద్ద  కార్పోరేట్‌ రుణాల నమూనా, అతి పెద్ద రిటైల్‌ ఆధారిత బ్యాంకుల నమూనాతో సరిపోలుతోంది. ఈ కన్వర్జన్స్‌ ఇంకా వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకుల రుణాలిచ్చే పద్ధతిని గమనిస్తే, ఏకికరించిన వ్యాపార నమూనాను పోలివుంటాయి. వాల్యుషన్లు కన్వర్జ్‌ అవ్వడం ఇక ఎంతో దూరంలో లేదని మా నమ్మకం.

జీడీపీ మెరుగయితే..మిడ్‌క్యాప్సే టాప్‌
ప్రస్తుతం మార్కెట్లో మిడ్‌క్యాప్‌ వాల్యుషన్లు సౌకర్యంగా ఉన్నాయి. అంతేకాకుండా మిడ్‌క్యాప్స్‌లో పెట్టుబడులు పెట్టే సంస్థాగత ఇన్వెస్టర్లు 600 బీపీఎస్‌ మేర తగ్గడం చూశాం. మిడ్‌క్యాప్స్‌ సెక్టార్‌ యూ ఆకారపు రికవరికి సిద్ధంగా ఉందని అంచనావేస్తున్నాం. జీడీపీ వృద్ధి చెందితే ఈ స్టాకులు కూడా మంచి ప్రధర్శన  చేయడం గమనించవచ్చు. ముందుకెళ్లే కొద్ది జీడీపీ రికవరి అవుతుందనే అంచనాలున్నాయి. ఈ రికవరి విస్తృతంగా ఉంటే, ఇంకో రెండుమూడేళ్లలో మిడ్‌క్యాప్స్‌, లార్జ్‌ క్యాప్‌లను దాటి ప్రదర్శన చేస్తాయి. రంగాల వారిగా చూస్తే బ్యాంకింగ్‌ సెక్టార్‌పై  సానుకూలంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ విభాగంలో ఆదిపత్యం చలాయించే పేరున్న బ్యాంకులు బాగా రాణిస్తాయి. ఇతర విభాగాలలో ఫార్మా కంపెనీలను పరిశీలించవచ్చు. గత రెండుమూడేళ్లలో ఈ రంగంలోని మంచి కంపెనీలు డీరేటింగ్‌కు గురయ్యాయి. ప్రస్తుతం ఈ రంగంలో అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరి అయితే  ఇంజనీరింగ్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలలో మంచి అవకాశాలున్నాయి. క్యాప్‌గూడ్స్‌, ఇంజనీరింగ్‌, యుటిలిటీ రంగంలో నిర్ధిష్ట స్టాకులు, ఫార్మా రంగాన్ని పరిశీలించమని సలహాయిస్తున్నాం. 

కార్పోరేట్‌ ఫలితాలు బాగున్నాయి..
ప్రస్తుత సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను గమనిస్తే, కంపెనీల లాభాలు ఏవిధంగా వృద్ధి చెందాయో అర్థమవుతుంది. చాల వరకు కంపెనీల ఆదాయాలు తగ్గినప్పటికి, వాటి లాభాలు పెరిగాయి. ఇది కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం వలన జరిగిందని అర్థం చేసుకోవచ్చు. దీని వలన కంపెనీల కార్యచరణ నగదు ప్రవాహం, లిక్విడిటీ లభ్యత పెరుగుతుంది. అంతేకాకుండా గత సైకిల్‌లలో లేని ధర ఆధారిత వృద్ధి, ఈ చర్య వలన ప్రభావితమవుతుంది. నా ఉద్దేశం ప్రకారం అధికంగా ఉన్న ద్రవ్యోల్బణం, పన్ను తగ్గింపు చర్య వలన తగ్గుతుంది. మార్కెట్లు అధికంగా కంపెనీల లాభాలు, ఆర్‌ఓఈ(రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ)పై ఆధారపడతాయి. ఈ రెండు అంశాలు కూడా పన్ను రేట్లను తగ్గించడంతో మెరుగయ్యాయి. మార్కెట్లు ర్యాలీ చేయడం సబబే.



You may be interested

మిడ్‌క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడులకు ఇది సమయమేనా...?

Monday 11th November 2019

గత రెండేళ్లలో ఇన్వెస్టర్లకు అంతంత మాత్రంగా ఆదాయాల్ని సమకూర్చిన మిడ్‌క్యాప్‌ ఫండ్లల్లో ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చని ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాదారులు సిఫార్సు చేస్తున్నారు. 2018 జనవరి నాటి నుంచి షేరు ధరల్లో భారీ పతనాన్ని చవిచూసిన తరుణంలో వ్యాల్యుయేషన్స్‌ ‍కనిష్టస్థాయిని తాకాయి. అయితే మందగమనం కారణంగా మార్కెట్‌ పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ అవుతున్నందున మూడేళ్ల కాల పరిమితితో మిడ్‌క్యాప్‌ పథకం యూనిట్లను కొనుగోలు చేయవచ్చని అనలిస్టులు సలహానిస్తున్నారు. ఫ్రాంక్టిన్‌ ఇండియా ప్రిమ ఫండ్‌, కోటక్‌

మార్కెట్‌పై మూడీస్‌ ప్రభావం తాత్కాలికమే!

Monday 11th November 2019

బుల్‌ రన్‌ కొనసాగుతుంది  నిపుణుల అంచనా భారత ఎకానమీ అవుట్‌లుక్‌ను మూడీస్‌ రేటింగ్‌ ఏజన్సీ డౌన్‌గ్రేడ్‌ చేసిన ప్రభావం మార్కెట్‌పై స్వల్పకాలమే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిస్కులు పెరిగాయని చెబుతూ గతవారం మూడీస్‌ సంస్థ భారత క్రెడిట్‌ అవుట్‌లుక్‌ను నెగిటివ్‌కి డౌన్‌గ్రేడ్‌ చేసిన సంగతి తెలిసిందే! దీంతో మార్కెట్లు నెగిటివ్‌గా రియాక్టయ్యాయి. కానీ త్వరలో ఈ ప్రభావం సమసి పోతుందని, ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణాత్మక చర్యలు మార్కెట్లో జోష్‌ తెస్తాయని అనలిస్టులు

Most from this category