News


మిడ్‌క్యాప్స్‌లో చక్కని అవకాశాలు

Monday 30th September 2019
Markets_main1569786574.png-28606

గత 13 ఏళ్లలో మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ అన్నది ఒక ఏడాదికి మించి ఎక్కువ కాలం పాటు లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కంటే పనితీరులో వెనుకబడిన సందర్భం లేదు. ఒకప్పుడు నిఫ్టీకి 50 శాతం ప్రీమియంగా నడిచిన మిడ్‌క్యాప్‌ 100 సూచీ ఇప్పుడు 20 శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. 2011 నాటి పరిస్థితులకు దగ్గరగా ఉంది. ఇది డౌన్‌సైడ్‌ విషయంలో​సౌకర్యవంతమైన పరిస్థితి అని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100లోని స్టాక్స్‌లో మూడింట ఒక వంతు మాత్రమే 2018 జనవరి నాటి స్థాయిలకు పైన ట్రేడ్‌ అవుతున్నట్టు ఏస్‌ ఈక్విటీ డేటా తెలియజేస్తోంది. కేవలం 15 లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ అద్భుత పనితీరు త్వరలోనే పూర్తికావచ్చని, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు బాగా పడిపోయిన మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ పట్ల విశ్వాసాన్ని పెంచిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘చారిత్రకంగా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీని ఆరంభించినప్పుడు... కనీసం మొదటి ఏడాది మిడ్‌క్యాప్స్‌ ముందుండి నడిపిస్తాయని తెలుస్తోంది. కనుక సానుకూల క్యాష్‌ ఫ్లో, ఎర్నింగ్స్‌లో వృద్ధి 15 శాతానికి పైగా ఉన్నవి, క్రితం 12 నెలల్లో కనీసం 15 శాతం పడిపోయినవి తదనంతర మార్కెట్‌ ర్యాలీలో పాల్గొంటాయని చారిత్రక గణాంకాల ఆధారంగా తెలుస్తోంది’’ అని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. 

 

లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ మంచి పనితీరు చూపిస్తాయని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేస్తోంది. ఇండియన్‌ హోటల్స్‌, జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎంసీఎక్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, అశోక్‌లేలాండ్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ పట్ల సానుకూలంగా ఉంది. యాంటిక్యూ స్టాక్‌ బ్రోకింగ్‌ అయితే.. హనీవెల్‌ ఆటోమేషన్‌, టీవీఎస్‌ మోటార్‌, ఫెడరల్‌ బ్యాంకు, గుజరాత్‌ గ్యాస్‌, ఫోనిక్స్‌ మిల్‌, నాట్కో ఫార్మా, కజారియా సిరామిక్స్‌, నాల్కో, టింకెన్‌ ఇండియా, ఎంవోఐఎల్‌, ధనుకా అగ్రిటెక్‌ను సిఫారసు చేసింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ అయితే.. ఇండియన్‌ హోటల్స్‌, ఫెడరల్‌ బ్యాంకు, ఎంఎంఎఫ్‌ఎస్‌, అశోక్‌లేలాండ్‌, పీఐ ఇండస్ట్రీస్‌, ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌, జేకే సిమెంట్‌, ఒబెరాయ్‌ రియాలిటీ, కోల్గేట్‌ పామోలివ్‌, ఆల్కెమ్‌ ల్యాబ్స్‌ పట్ల సానుకూలంగా ఉంది. ఎడెల్‌వీజ్‌ 22 మిడ్‌క్యాప్స్‌ పట్ల సానుకూలంగా ఉంది. వాటిల్లో ఇన్ఫోఎడ్జ్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఉన్నాయి. 



You may be interested

మార్కెట్లపై అనలిస్టులు ఎంతో బుల్లిష్‌!

Monday 30th September 2019

కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మన మార్కెట్లను బేరిష్‌ దశ నుంచి బుల్లిష్‌ దిశగా పరుగులు పెట్టించింది. దీనికి అదనంగా పలు చర్యలను కూడా ప్రకటించింది. దీంతో మన మార్కెట్లు మెరుగైన స్థాయిలో ఉన్నాయని అనలిస్టులు భావిస్తున్నారు. ఆసియాలోని ఇతర మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు అధిక పెట్టుబడులను ఆకర్షించగలవని నమ్ముతున్నారు. ఇంతకుముందెన్నడూ లేనంత

డాలర్‌ ఎఫెక్ట్‌ : 8డాలర్లు నష్టపోయి పసిడి

Saturday 28th September 2019

ప్రపంచ మార్కెట్లో పసిడి 8డాలర్లు నష్టపోయి 1,506.40 డాలర్ల వద్ద స్థిరపడింది. ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ రెండున్నరేళ్ల గరిష్టాన్ని అందుకోవడం ఇందుకు కారణమైంది. అమెరికా సెప్టెంబర్‌ ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో డాలర్‌ ఇండెక్స్‌ పుంజుకుని 0.60శాతం పెరిగింది. నిన్నరాత్రి ట్రేడింగ్‌లో డాలర్‌ ఇండెక్స్‌ అధిక స్థాయిలో ట్రేడ్‌ అవుతుండంతో పసిడి ధర క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఒక దశలో 1500 డాలర్ల

Most from this category