News


మిడ్‌క్యాప్‌లో రాబడుల అవకాశాలు మెండు...

Sunday 30th June 2019
Markets_main1561916865.png-26694

ఈక్విటీ మార్కెట్‌ అంటేనే ఇతర సాధనాలతో పోలిస్తే అధిక రిస్క్‌ ఉంటుంది. దీంతో సహజంగా రిస్క్‌ తీసుకునే సామర్థ్యం ఉన్నవారే ఈక్విటీలవైపు చూస్తారు. కనుక రిస్క్‌ తీసుకునే వారికి అధిక రాబడుల కోసం లార్జ్‌క్యాప్‌ కంటే మిడ్‌క్యాప్‌, ‍స్మాల్‌క్యాప్‌ దీర్ఘకాలానికి మంచి ఎంపికలుగా యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ అరుణ్‌ తుక్రాల్‌ సూచించారు. 

 

‘‘స్టాక్స్‌ను వాటి మార్కెట్‌ విలువ ఆధారంగా లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ అని వర్గీకరించిన విషయం తెలిసిందే. సెబీ నిర్వచనం ప్రకారం... లార్జ్‌క్యాప్‌ అంటే మార్కెట్‌ విలువ పరంగా అగ్ర స్థాయి 100 కంపెనీలు లార్జ్‌క్యాప్‌ కిందకు వస్తాయి. ఆ తర్వాత 150 కంపెనీలు మిడ్‌క్యాప్‌గాను, మిగిలినవి స్మాల్‌క్యాప్‌గాను పరిగణించడం జరుగుతోంది. లార్జ్‌క్యాప్‌ కంపెనీలు బలమైన వ్యాపార నమూనాలతో స్థిరమైన ఆదాయం, లాభాలను ఆర్జించే విధంగా ఉంటాయి. మార్కెట్‌కు అనుగుణంగా వీటి కదలిక ఉంటుంది. మిడ్‌క్యాప్‌ కంపెనీలు మోస్తరు స్థిరత్వంతో, మార్కెట్‌ వాటా, లాభాలు, ఉత్పత్తి పెంపు ద్వారా లార్జ్‌క్యాప్‌గా అవతరిస్తాయి. అంటే లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ కంపెనీలకు వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో మూడు నుంచి ఐదేళ్ల కాలంలో మెరుగైన రాబడులను ఇవ్వగలుగుతాయి. సాధారణ ఎన్నికలు ముగిసిపోవడం, రానున్న ఐదేళ్లలో స్థూల ఆర్థిక పరిస్థితులు మరింత నిలకడగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు మెరుగుపడుతున్న వ్యాపార వాతావరణం మిడ్‌క్యాప్‌ కంపెనీలు మరింత వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణాన్ని ఏర్పరిచినట్టే. 

 

2009 నుంచి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కాంపౌండెడ్‌గా 14 శాతం వార్షిక రాబడులను ఇవ్వగా, మిడ్‌క్యాప్‌ 15 శాతం, స్మాల్‌క్యాప్‌ 13 శాతం చొప్పున ప్రతిఫలాన్ని ఇచ్చాయి. 2009-17 మధ్య సెన్సెక్స్‌ ఏటా 15 శాతం సగటు రాబడులు ఇస్తే, మిడ్‌క్యాప్‌ 21 శాతం, స్మాల్‌క్యాప్‌ 20 శాతం చొప్పున రాబడులను ఇచ్చాయి. అయితే, 2018 ఆరంభం ఉంచి ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో లిక్విడిటీ సంక్షోభం, అధిక చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాల వల్ల మిడ్‌క్యాప్‌ 13 శాతం, స్మాల్‌ క్యాప్‌ 19 శాతం నస్టాలను మిగిల్చాయి. లార్జ్‌క్యాప్‌ మాత్రం 10 శాతం రాబడులను ఇచ్చాయి. అయినప్పటికీ, 2009 నుంచి చూసుకుంటే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ రాబడులు లార్జ్‌క్యాప్‌ స్థాయిల్లోనే ఉన్నాయి. ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో మెరుగైన రాబడుల కోసం మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులకు ఇది అవకాశం. 

 

లార్జ్‌క్యాప్స్‌ సహజంగా తక్కువ రాబడులను ఇస్తాయి. రిస్క్‌ కూడా తక్కువ. భారీ కంపెనీల స్థిరమైన వ్యాపారం వల్లే ఇది. రిస్క్‌ను తట్టుకునే వారు అధిక రాబడుల కోసం మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ వైపు చూడొచ్చు. మిడ్‌క్యాప్‌ కంపెనీలు మోస్తరు రిస్క్‌ ఆధారిత రాబడులను ఆఫర్‌ చేస్తాయి. ఆరోగ్యకరమైన రాబడులు ఆశించేవారికి ఇవి అనుకూలం. దీర్ఘకాలంలో మార్కెట్ల ఆటుపోట్ల తాలుకూ రిస్క్‌ కూడా తగ్గుతుంది. కేవలం స్థూల ఆర్థిక పరిస్థితులనే కాకుండా, పరిశ్రమలో ధోరణలు, కంపెనీల మూలాలను ఇన్వెస్టర్లు అర్థం చేసుకోగలిగితే మంచి అవకాశాలను గుర్తించగలరు. నిలకడైన వృద్ధి అవకాశాలు, మెరుగైన నిర్వహణ సామర్థ్యాలు, స్థిరమైన క్యాష్‌ఫ్లో సామర్థ్యాలు, మూలధనంపై మెరుగైన రాబడులు ఇవన్నీ చూడాలి. మిడ్‌క్యాప్‌లో తగినంత వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. తాము మెరుగ్గా అర్థం చేసుకోతగిన 2-3 రంగాల స్టాక్స్‌పై దృష్టి పెట్టాలి’’ అని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ అరుణ్‌ తుక్రాల్‌ సూచించారు. You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Monday 1st July 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం భారత్‌ సూచీలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 205 పాయింట్ల లాభంతో 39,600 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్లు జంప్‌చేసి 11,849 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, వేదాంత, యస్‌బ్యాంక్‌ షేర్లు 1-2 శాతం గ్యాప్‌అప్‌తో ట్రేడింగ్‌ను ఆరంభించగా, గెయిల్‌, ఐఓసీ, బీపీసీఎల్‌, టైటాన్‌ షేర్లు స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. 

స్మాల్‌క్యాప్‌లో రేసు గుర్రాలు!

Sunday 30th June 2019

దీర్ఘకాలానికి మన మార్కెట్లు ఈ స్థాయిల నుంచి మంచి రాబడులను ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని, నాణ్యమైన స్టాక్స్‌ను వెతికి పట్టుకుని క్రమంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఆ విధంగా చూసినప్పుడు అధిక రాబడులు కోరుకునే వారు, స్మాల్‌క్యాప్‌ విభాగంలో నాణ్యమైన స్టాక్స్‌ కోసం వీటిని పరిశీలించొచ్చన్నది వ్యాల్యూ రీసెర్చ్‌ సూచన.   భారత్‌ రసాయన్‌ 1989లో ఏర్పాటైన ఈ కంపెనీ టెక్నికల్‌ గ్రేడ్‌ రకం పురుగుమందుల ఫార్ములేషన్స్‌ను తయారు చేస్తోంది. బీ2బీ విభాగంలో

Most from this category