మధ్య స్థాయి వినియోగ స్టాక్స్ ర్యాలీ!
By Sakshi

పండుగల డిమాండ్ నేపథ్యంలో మధ్య స్థాయి వినియోగ కంపెనీల షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. గత నెల రోజుల కాలంలో 11 మిడ్‌క్యాప్ స్టాక్స్ నూతన గరిష్టాలను నమోదు చేయగా, ఇందులో ఆరు స్టాక్స్ వినియోగ రంగాలకు చెందినవే కావడం గమనార్హం. అవి వర్ల్‌పూల్ ఇండియా, బెర్జర్ పెయింట్స్, వోల్టాస్, పీఅండ్‌జీ హైజీన్, కోల్గేట్ పామోలివ్, గ్లాక్సోస్మిత్ క్లెయిన్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్. ఈ ఏడాది వర్ల్‌పూల్ ఇండియా షేరు ఇప్పటి వరకు 47 శాతం మేర పెరిగింది. బెర్జర్ పెయింట్స్ షేరు 36 శాతం, వోల్టాస్ షేరు 23.31 శాతం, పీఅండ్‌జీ హైజీన్ 15 శాతం, కోల్గేట్ పామోలివ్ ఇండియా షేరు 12 శాతం, గ్లాక్సోస్మిత్‌క్లెయిన్ కన్జ్యూమర్ షేరు 10 శాతం వరకు పెరిగాయి. ‘‘ఈ కంపెనీల్లో చాలా వరకు అధిక పన్నులు చెల్లించేవే. కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల వాటి లాభాలు కూడా 15-20 శాతం వరకు పెరగగలవు’’అని కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ రస్మిక్ ఓజా తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు 30 శాతంగా ఉన్న పన్నును 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసే తయారీ రంగ కంపెనీలపై కార్పొరేట్ పన్నును 15 శాతానికి తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై నమోదైన భారీ అమ్మకాలు వినియోగం పుంజుకుంటుందన్న అంచనాలను పెంచాయి. ఇటీవలే ముగిసిన భారీ అమ్మకాల ఉత్సవంలో ఈ ప్లాట్‌ఫామ్‌లు మొత్తం మీద రూ.19,000 కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించాయి. భారతీయులు తాము పెట్టే డబ్బుకు సరిపడా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తుంటారని, ఈ కామర్స్ వేదికలపై భారీ డిస్కౌంట్‌తో వస్తున్న ఉత్పత్తులను కొనుగోలు చేసినట్టు తెలుస్తోందన్నారు సుందరం మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో సునీల్ సుబ్రమణ్యం. ఆటో రంగంలో ఉన్నంత మందగమనం ఇతర వినియోగ ఆధారిత రంగాల్లో లేదన్నారు. ‘‘కన్జ్యూమర్ స్టాపుల్స్ విక్రయ గణాంకాలు అంత ప్రతికూలంగా ఏమీ లేవు. పెయింట్ కంపెనీల అమ్మకాలు బాగున్నాయి. మందగమనం ఆటోలోనే ఎక్కువగా ఉంది’’ అని అవెండస్ క్యాపిటల్ కో సీఈవో వైభవ్ సంఘవి సైతం పేర్కొన్నారు.
You may be interested
వ్యాపార విస్తరణపై భారీ ప్రణాళికలు
Saturday 12th October 2019వ్యాపార విస్తరణపై మూలధ వ్యయానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. కొన్ని కంపెనీలు తమ వ్యాపార విస్తరణ ప్రణాళికల వివరాలను వార్షిక నివేదికల్లో పేర్కొన్నాయి. వాటిల్లో ఏసీసీ, అంబుజా, ఏషియన్ పెయింట్స్, ఆస్ట్రల్ పాలీ, భారత్ ఫోర్జ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డీఎల్ఎఫ్, ఐచర్ మోటార్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, హీరో మోటోకార్ప్, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్ఎం, హావెల్స్, సుప్రీమ్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, అల్ట్రాటెక్, వోల్టాస్ ఇండియా ఉన్నాయి. వీటిని
అంచనాల్ని అందుకున్న ఇన్ఫోసిస్
Friday 11th October 2019ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ క్యూ2 ఫలితాలు మార్కెట్ అంచనాల్ని అందుకున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్లో ఇన్ఫోసిస్ కన్సాలిడేటెడ్ నికరలాభం గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 2.2 శాతం క్షీణించి రూ. 4,019 కోట్లకు తగ్గింది. నికరలాభం తగ్గినప్పటికీ, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 5 శాతం పెరగడం విశేషం. మార్కెట్ అంచనా రూ. 4008 కోట్లుగా వుంది. కంపెనీ ఆదాయం మాత్రం రూ. 23,255 కోట్లకు పెరిగింది. ఆదాయం