News


దుమ్మురేపుతున్న మిడ్‌క్యాప్స్‌!

Wednesday 30th October 2019
Markets_main1572412632.png-29229

-280 స్టాకులు వాటి 200 డీఎంఏకి పైనే   
విస్తృత మార్కెట్‌లో చాలా వరకు స్టాకులు ప్రతికూల సెంటిమెంట్‌నే ఎదుర్కొంటున్నప్పటికి, అక్టోబర్‌ 18 నుంచి ఇప్పటి వరకు బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో 70కి పైగా స్టాకులు వాటి 200 డీఎంఏ(డైలీ మూవింగ్‌ యావరేజ్‌) కంటే పైకి  ఎగిశాయి. ఈ సమయంలో సెన్సెక్స్‌ ఏకంగా 3 శాతం పైగా లాభపడింది. దీర్ఘకాలానికి గాను ఈ స్టాకులు బాగున్నాయనే సంకేతాలను ఈ ఇండికేటర్‌ ఇస్తుందన్నది విశ్లేషకుల భావన. ప్రస్తుతం  280 స్టాకులు వాటి 200 డీఎంఏ కంటే ఎగువన ట్రేడవుతున్నాయి. కాగా అక్టోబర్‌ 18న 212 స్టాకులు ఈ స్థాయి కంటే పైన ట్రేడయ్యాయని బ్లూమ్‌బర్గ్‌ డేటా విశ్లేషించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్కెట్‌లో విస్తృత భాగం ప్రతికూల సెంటిమెంట్‌ను ఎదుర్కొంటోంది. మిడ్‌ క్యాప్‌ స్టాకులు విపరీతమైన అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.  ఇలాంటి పరిస్థితులలో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ మెరుగుపడడం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 5 శాతం మేర, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 11 శాతం మేర పతనమయ్యాయి.
   ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే అంచనాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌లకు ఆకర్షితులవుతున్నారని విశ్లేషకులు తెలిపారు. చాలా వరకు లార్జ్‌క్యాప్‌ కంపెనీలు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో మంచి సంఖ్యలను ప్రకటించాయి. మిడ్‌ క్యాప్‌ కంపెనీలు కూడా లాభాల పునరుద్ధరణలో లార్జ్‌క్యాప్‌లతో పోటిపడతాయని మార్కెట్‌వర్గాలలో అంచనాలున్నాయి. బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో అదాని గ్రీన్‌ ఎనర్జీ అద్భుతమైన ప్రదర్శనను చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు తన దీర్ఘకాల సగటు కంటే 97 శాతం అధికంగా ట్రేడవుతోంది. అంతేకాకుండా ఈ ఏడాదిలో మంచి ప్రదర్శన చేసిన స్టాకులలో ఈ స్టాకు ముందుంటుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ షేరు 120 శాతం లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మానేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ), బెర్జర్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ సెక్యురిటీస్‌, రిలయన్స్‌ నిప్పన్‌ ఏఎంసీ షేర్లు వాటి 200 డీఎంఏ కంటే 40 శాతం అధికంగా ట్రేడవుతున్నాయి.



You may be interested

మూడోరోజూ నష్టాల్లో పసిడి

Wednesday 30th October 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర వరుసగా మూడోరోజూ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో బుధవారం ఔన్స్‌ పసిడి రాత్రి అమెరికా ముగింపు(1,490.50)తో పోలిస్తే 2డాలర్ల నష్టంతో 1488.5డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి రాత్రి అమెరికాలో ఫెడ్‌ ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్లపై తన వైఖరి ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. మందగమనం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజపరిచేందుకు ఈ ఏడాదిలో ఫెడ్‌ వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించవచ్చని మార్కెట్‌

ప్రభుత్వ రంగ షేర్ల ర్యాలీ

Wednesday 30th October 2019

బుధవారం మార్కెట్‌ ప్రారంభంలోనే ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో 1.50శాతం లాభపడింది. ప్రభుత్వరంగానికి చెందిన ఐటీఐ, సెంట్రల్‌ బ్యాంక్‌, భెల్‌, యూనైటెడ్‌ బ్యాంక్‌, ఆర్‌సీఎఫ్‌ షేర్లు 10శాతానికి పైగా లాభపడ్డాయి. బీఈఎంఎల్‌, జీఎండీసీలిమిటెడ్‌, సిండికేట్‌ బ్యాంక్‌, జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌, హిందూస్థాన్‌ కాపర్‌, బీడీఎల్‌, ఆంధ్రాబ్యాంక్‌, యూనికో బ్యాంక్‌, ఎస్‌సీఐ షేర్లు 10 నుంచి 5శాతం పెరిగాయి. కార్పోరేషన్‌ బ్యాంక్‌, ఐడీబీ బ్యాంక్‌,

Most from this category