News


ఆకర్షణీయంగా మిడ్‌క్యాప్‌ షేర్లు

Thursday 9th January 2020
Markets_main1578541437.png-30780

  • టాటా మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్‌ శైలేష్‌ జైన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చౌక వేల్యుయేషన్స్‌కు లభిస్తున్న మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌ షేర్లు .. ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆకర్షణీయంగా ఉన్నాయని టాటా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ మేనేజర్‌ శైలేష్‌ జైన్‌ తెలిపారు. గతంలో భారీ ప్రీమియం పలికిన ఈ స్టాక్స్‌.. ప్రస్తుతం లార్జ్‌క్యాప్‌ షేర్లతో పోలిస్తే 10 శాతం పైగా డిస్కౌంట్‌తో లభిస్తున్నాయన్నారు. కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి 10 శాతం పైగా నమోదు కావొచ్చని, జూన్‌ త్రైమాసికం నుంచి మార్కెట్‌ పరిస్థితులు మరింత సానుకూలంగా ఉండవచ్చని జైన్‌ చెప్పారు. రంగాలవారీగా చూస్తే కార్పొరేట్‌ బ్యాంకులు, టెలికం వంటివి ఆకర్షణీయంగా బుధవారమిక్కడ విలేకరులకు తెలిపారు. 
టాటా క్వాంట్‌ ఫండ్‌ ...
ఈ సందర్భంగా టాటా క్వాంట్‌ ఫండ్‌ వివరాలను జైన్‌ వెల్లడించారు. జనవరి 3న ప్రారంభమైన ఈ ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం 17న ముగియనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతల ఆధారంగా ఈ స్కీమ్‌లో పెట్టుబడి విధానం ఉంటుందని జైన్‌ చెప్పారు. మెరుగైన రాబడులు ఇచ్చేందుకు, రిస్కులను తగ్గించేందుకు ఇది గణనీయంగా తోడ్పడగలదని పేర్కొన్నారు. You may be interested

మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎంలో 2% తగ్గుదల

Thursday 9th January 2020

గతనెల్లో రూ. 61,810 కోట్ల ఉపసంహరణ రూ. 26.54 లక్షల కోట్లకు మొత్తం నిర్వహణ ఆస్తి  రుణ-ఆధారిత పథకాల్లో భారీగా విక్రయాలు న్యూఢిల్లీ: డిసెంబర్‌ నెలలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు తగ్గుదలను నమోదుచేశాయి. అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) విడుదల చేసిన తాజా సమాచారం ‍ప్రకారం.. గత నెల్లో రూ. 61,810 కోట్ల ఉపసంహరణ చోటుచేసుకుంది. దీంతో ఈ పరిశ్రమలోని 44 సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2 శాతం తగ్గి

బొగ్గులో సంస్కరణల బాజా

Thursday 9th January 2020

ఇతర సంస్థలూ బిడ్‌ చేసేందుకు అవకాశం అంతిమ వినియోగంపై ఆంక్షల తొలగింపు ఈ నెలలోనే 40 దాకా బ్లాకుల వేలం ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం న్యూఢిల్లీ: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడంతో పాటు మరింతగా పెట్టుబడులు ఆకర్షించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం 1957, బొగ్గు గనులు (స్పెషల్‌ ప్రొవిజన్స్‌) చట్టం 2015లో సవరణలను సవరిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది.

Most from this category