News


ర్యాలీ ఉంటుంది కానీ..

Tuesday 31st December 2019
Markets_main1577731479.png-30539

2020లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ర్యాలీ ఉంటుందని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది దేశ ఆర్థిక వృద్ధి పునరుద్ధరణపైనే ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

‘‘ఏదైనా రికవరీ ఉంటే అది ఎక్కువగా 2020 రెండో భాగం (జూన్‌ తర్వాత)లోనే. మొదటి భాగంలో లార్జ్‌క్యాప్స్‌ మంచి పనితీరు కొనసాగుతుంది. జీడీపీ వృద్ధి గణాంకాల ఆధారంగా మిడ్‌క్యాప్స్‌, స్మాల్‌క్యాప్స్‌లోకి అడుగు పెట్టాలా లేదా అన్నది నిర్ణయించుకోవాలి’’ అని జేఎం ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషనల్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ సుహాస్‌ హరినారాయణన్‌ తెలిపారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఖరీదుగా లేవని, కాకపోతే సమయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. 

 

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ వచ్చే ఏడాది ర్యాలీ చేస్తాయని, ఇందుకోసం ఈ విభాగంలో మంచి నాణ్యత కలిగిన స్టాక్స్‌ను ఎంచుకోవడం ముఖ్యమన్నది విశ్లేషకుల సూచన. 2019లో కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశాలు స్టాక్స్‌పై చూపించిన ప్రభావాన్ని గుర్తు చేశారు. ‘‘స్మాల్‌క్యాప్స్‌, మిడ్‌క్యాప్స్‌లో ఎంపిక విషయంలో తెలివిగా వ్యవహరిస్తాను. ఎందుకుంటే ర్యాలీ విస్తృతంగా అయితే ఉండదు. మంచి కార్పొరేట్‌ గవర్నెన్స్‌, బలమైన ఫండమెంటల్స్‌ కలిగినవి 2020లో మంచి పనితీరు చూపిస్తాయి’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. వరుసగా రెండో ఏడాది 2019లోనూ బీఎస్‌ఈ సెన్సెక్స్‌తో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు వెనుకబడడం గమనార్హం. ఈ ఏడాది ఇంత వరకు మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ నికరంగా 4 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 9 శాతం నష్టపోయాయి. కానీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 15 శాతం, నిఫ్టీ 12.5 శాతం ర్యాలీ చేయడం పరిస్థితి తెలియజేస్తోంది.

 

‘‘2018 జనవరి నుంచి చూస్తే గనుక బీఎస్‌ఈ బి గ్రూపు స్టాక్స్‌ (మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌) ఉమ్మడి మార్కెట్‌ విలువ రూ.20.63 లక్షల కోట్ల గరిష్ట స్థాయి నుంచి 63 శాతం క్షీణించి రూ.7.65 లక్షల కోట్లకు పడిపోయింది. ఇది రానున్న కాలంలో ర్యాలీని సూచిస్తోంది. చారిత్రకంగా చూస్తే స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ దారుణంగా కరెక్షన్‌కు గురైన సందర్భాల్లో.. తర్వాత అవి తిరిగి బలంగా వెనక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, చరిత్ర పునరావృతం కావాలని లేదు. అయితే, ఆ విధమైన ప్రతికూల పనితీరు తర్వాత ఆయా విభాగాల వ్యాల్యూషన్‌ ఎంతో ఆకర్షణీయంగా మారుతుంది’’అని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ అడ్వైజరీ వ్యవస్థాపకుడు జి.చొక్కలింగం తెలిపారు. స్థానిక, విదేశీ ఫండ్స్‌ పెట్టుబడుల మద్దతు ఉన్నంత వరకు లార్జ్‌క్యాప్‌నకు, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ మధ్య అంతరం కొనసాగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన దీపక్‌జసాని అభిప్రాయపడ్డారు.You may be interested

పోగొట్టుకున్న ఫోన్లను .. కనిపెట్టేందుకు పోర్టల్‌

Tuesday 31st December 2019

- ఢిల్లీ వాసుల కోసం వెబ్‌సైట్ ప్రారంభం - త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి న్యూఢిల్లీ: చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీ దొరకపుచ్చుకునేందుకు, బ్లాక్ చేసేందుకు ఉపయోగపడే విధంగా కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) వాసుల కోసం www.ceir.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని సుమారు 5 కోట్ల మంది మొబైల్ సబ్‌స్క్రయిబర్స్‌కు ఇది ఉపయోగకరంగా ఉండగలదని కేంద్ర టెలికం శాఖ మంత్రి

అప్రమత్తంగా ఉండి.. ఫండమెంటల్స్‌పై దృష్టి..

Tuesday 31st December 2019

నూతన సంవత్సరం 2020 వచ్చేస్తోంది. 2019 సంవత్సరం మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో అస్థిరతలను చూశాం. ప్రధాన సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్‌ నూతన జీవితకాల గరిష్టాలను చేరాయి. సవాళ్లతో కూడిన పరిస్థితుల నడుమ అధిక రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలన్న సందేహం రావచ్చు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు 2020లో అనుసరించాల్సిన విధానాలను ఎంట్రస్ట్‌ ఫ్యామిలీ ఆఫీస్‌ ఎండీ రాజమోహన్‌ కృష్ణన్‌ ఓ వార్తా సంస్థకు తెలియజేశారు.    వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం

Most from this category