News


మిడ్‌క్యాప్‌లో ర్యాలీకి ఫస్ట్‌ గేర్‌

Tuesday 26th November 2019
Markets_main1574790885.png-29877

ప్రధాన సూచీలు, స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీల మధ్య అంతరం పెరిగిపోయింది. రెండేళ్ల పాటు చిన్న సూచీలు లార్జ్‌క్యాప్‌తో వెనుకబడి ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల మధ్య అంతరం దీర్ఘకాలికంగా సగటును పరిశీలించినప్పుడు చాలా గణనీయ స్థాయికి చేరిందని సిటీ గ్రూపు అంటోంది. ఎంఎస్‌సీఐ ఇండియా మిడ్‌క్యాప్‌ సూచీ గత రెండు సంవత్సరాల్లో 17 శాతాన్ని కోల్పో‍యింది. కానీ, బెంచ్‌మార్క్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 శాతం మేర లాభపడింది. 

 

దీర్ఘకాల ప్రతికూల పనితీరు అనంతరం రిస్క్‌ కొద్దీ రాబడుల విషయంలో ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌ను పరిశీలిస్తున్నట్టు సిటీ గ్రూపు అనలిస్ట్‌ సురేంద్ర గోయల్‌ పేర్కొన్నారు. ‘‘లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ మధ్య విలువల అంతరం పదేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. అంటే రిస్క్‌ కొద్దీ రాబడుల పరిస్థితి మెరుగుపడింది. రెండేళ్ల కాలంలో  మిడ్‌క్యా్ప్‌లో సెంటిమెంట్‌ పూర్తి ఆశావహం నుంచి పూర్తి నిరాశావాదానికి మారిపోయింది’’ అని గోయల్‌ వివరించారు. పడిపోతున్న ఆర్థిక వృద్ధిని నిలువరించి, వ్యవస్థలో తిరిగి డిమాండ్‌ ఏర్పడేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు సహా ఎన్నో నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. 2019-20 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6 శాతం లోపునకు పడిపోతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. 

 

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ను ఇప్పుడు కొనుగోలు చేయడం వల్ల అధిక రాబడులకు అవకాశం ఉందని గోయల్‌ పేర్కొన్నారు. అయితే, ఎంపిక చేసుకునే స్టాక్స్‌పైనే రాబడులు ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత పదేళ్ల కాలంలో కేవలం 2 శాతం చిన్న కంపెనీలే లార్జ్‌క్యాప్‌గా మారినట్టు చెప్పారు. అదే సమయంలో చిన్న కంపెనీల్లో 20 శాతం గత పదేళ్లలో మూతపడడం లేదా లిస్టింగ్‌ నుంచి వెళ్లిపోవడం జరిగిందన్నారు. మిడ్‌క్యాప్‌ విభాగంలో పరిస్థితి మెరుగ్గా ఉందని, 15 శాతం కంపెనీలు పెద్దగా అవతరించినట్టు చెప్పారు. అదే సమయంలో మూడింట రెండొంతులు చిన్న కంపెనీలుగా మారిపోయాయని వివరించారు. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఏసీసీ, బయోకాన్‌, ఎల్‌అంట్‌టీ ఫైనాన్స్‌ హల్డింగ్స్‌ పట్ల సిటీ సానుకూలంగా ఉంది.



You may be interested

కార్వీలో వాటా విక్రయం?

Wednesday 27th November 2019

వ్యూహాత్మక ఇన్వెస్టరుతో డీల్‌ ఖరారు! స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ నుంచి భారీగా క్లయింట్ల వలస- షేర్లను బదిలీ చేయించుకుంటున్న ఇన్వెస్టర్లు అసలు తనఖా మొత్తం ఎంతనేది ఇప్పటికీ సస్పెన్సే- 25-30 కోట్లు మాత్రమేనంటున్న కార్వీ చైర్మన్‌- వాటా విక్రయంతో పూర్తిగా కాకున్నా ప్రస్తుతానికి ఓకే ఖాతాదారుల షేర్లను తనఖా పెట్టి... ఆ డబ్బుల్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించిందనే వ్యవహారంలో కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌ సర్వీస్‌ నుంచి క్లయింట్ల వలస మొదలైంది. కొత్త క్లయింట్లను చేర్చుకోరాదని సెబీ ఉత్తర్వులివ్వటంతో...

కొత్త రికార్డు వద్ద లాభాల స్వీకరణ

Tuesday 26th November 2019

స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు ఆదుకున్న రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కొత్త గరిరిష్టాలను నమోదు చేసిన సెన్సెక్స్‌, నిఫ్టీ జీవితకాల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు మంగళవారం స్వల్ప నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 68 పాయింట్లు నష్టంతో 40,821.30 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లను కోల్పోయి 12,037.70 వద్ద స్థిరపడ్డాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్స్‌, మెటల్‌, మీడియా, అటో రంగ షేర్ల నష్టాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌,

Most from this category