News


టీసీఎస్‌, ఆర్‌ఐఎల్‌ షేర్లు పెరుగుతాయా? తగ్గుతాయా?

Saturday 18th January 2020
Markets_main1579338378.png-31019

దిగ్గజ కంపెనీల ఫలితాలపై ప్రభావం ఇలా...
శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా

ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న మార్కెట్లలో గడిచిన వారం ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. దీంతో ఇకపై మార్కెట్‌ కొంతమేర కన్సాలిడేట్‌ కావచ్చు. లార్జ్‌క్యాప్స్‌లో ఈ ప్రభావం కనిపించే వీలుంది. అయితే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ప్రారంభమైన ర్యాలీ కొనసాగవచ్చని భావిస్తున్నామంటున్నారు శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా. ఒక ఇంటర్వ్యూలో మెహతా వెల్లడించిన ఇతర వివరాలు చూద్దాం.. 

గత వారం‍ దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. దీంతో లార్జ్‌ క్యాప్స్‌లో కొంతమేర కన్సాలిడేషన్‌కు వీలుంది. అయితే కొద్ది రోజులుగా జోరు చూపుతున్న మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ మరింత పుంజుకునే అవకాశముంది. ఈ జనవరిలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈక్విటీలలో పెట్టుబడులకు సంబంధించి కొంత ఉదాసీనతను కనబరుస్తున్నారు. మార్కెట్ల ర్యాలీపట్ల కొంతమేర అనిశ్చిత భావం తలెత్తి ఉండవచ్చు. కొంత కాలంగా దూకుడు చూపుతున్న లార్జ్‌ క్యాప్స్‌ వేల్యుయేషన్స్‌, ద్రవ్యలోటు, ఇతర ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎఫ్‌పీఐలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాల సీజన్‌ ఊపందుకోవడంతో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముంది. ఇందుకు ఫిబ్రవరిలో వెలువడనున్న బడ్జెట్‌పై అంచనాలు సైతం కారణంకానున్నాయి.

బడ్జెట్‌పై ఆశలు
అంతర్జాతీయంగా అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అధిగమిస్తున్నాయి. ఇది దేశీ మార్కెట్లపైనా సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. దీనికితోడు బడ్జెట్‌పై అంచనాలు పెరిగాయి. మౌలికసదుపాయాలు, హౌసింగ్‌ తదితర రంగాలలో పెట్టుబడులు, పన్నుల్లో కోత తదితర చర్యలను మార్కెట్లు ఆశిస్తు‍న్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ప్రస్తుతం చరిత్రాత్మక గరిష్టం వద్ద ఉంది. అయితే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ జీవితకాల గరిష్టాలతో పోలిస్తే 20 శాతం తక్కువలో ఉన్నాయి. దీంతో చిన్న షేర్లు ఇటీవల జోరం‍దుకున్నాయి. ప్రీబడ్జెట్‌ ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు పోర్ట్‌ఫోలియోలను సమీక్షించుకోవాలి. దీర్ఘకాలానికి కీలకంగా భావించే నాణ్యమైన స్టాక్స్‌ను కొనసాగించవచ్చు. సైక్లికల్స్‌లో కొంతమేర లాభాల స్వీకరణ చేపట్టడం మేలు.

నిఫ్టీ తీరిలా
నిఫ్టీకి 12,200 పాయింట్ల వద్ద మంచి మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిలో ట్రేడింగ్‌ స్టాక్స్‌లో లాభాల స్వీకరణ చేపట్టడంమేలు. దేశీయంగా అతిపెద్ద బుల్‌ మార్కెట్‌ నిర్మితమవుతున్నట్లు తోస్తోంది. అయితే దశలవారీగా ఇందుకు వీలున్నట్లు భావిస్తున్నాం. ప్రతీ బడ్జెట్‌ సమయంలోనూ బుల్‌ జోరు కనిపించడం, తదుపరి దిద్దుబాటు(కరెక్షన్‌) చోటు చేసుకోవడం గమనిస్తు‍న్నాం. చరిత్ర ప్రకారం చూస్తే.. మూడునాలుగు దఫాలలో బుల్‌ మార్కెట్‌ ప్రకటితమవుతుంటుంది!

3 స్టాక్స్‌ బ్రేకవుట్‌
సాంకేతిక అంశాల ప్రకారం టొరంట్‌ ఫార్మా, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ మంచి బ్రేకవుట్‌ సాధించాయి. వచ్చే వారానికి టొరంట్‌ ఫార్మాను రూ. 2112 టార్గెట్‌తో కొనుగోలు చేయవచ్చు. రూ. 1953 స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి. ఇక రూ. 15800 టార్గెట్‌తో రూ. నెస్లే ఇండియాలో పొజిషన్‌ తీసుకోవచ్చు. రూ. 15,230 దిగువన స్టాప్‌లాస్‌ సెట్‌ చేసుకోవాలి. ఇక రూ. 525 స్టాప్‌ లాస్‌తో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరుని రూ. 550 లక్ష్యంగా ఎంపిక చేసుకోవచ్చు. 

క్యూ3 ఎఫెక్ట్‌?
ఆదాయ అంచనాలు మిస్‌కావడంతో ఈ ఏడాది(2019-20) క్యూ3 ఫలితాలు ప్రకటించిన టీసీఎస్‌ షేరు సోమవారం నీరసంగా ప్రారంభంకావచ్చు. ఈ కౌంటర్‌కు రూ. 2300 వద్ద గట్టి రెసిస్టెన్స్‌, రూ. 2195 వద్ద పటిష్ట మద్దతు లభించవచ్చు. అయితే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఈ షేరు ప్రస్తుతం ఓవర్‌బాట్‌ జోన్‌లో ఉంది. ఈ షేరుకి రూ. 580 స్థాయిలో గట్టి మద్దతు లభించవచ్చు. 10 శాతం ర్యాలీని అంచనా వేస్తున్నాం. ఇక క్యూ3 ఫలితాలు వెల్లడించిన ఆర్‌ఐఎల్‌ షేరు ప్రస్తుతం కన్సాలిడేషన్‌ దశలో ఉంది. రూ. 1620 వద్ద గట్టి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. ఈ స్థాయి దాటితే మరో 5 శాతం ర్యాలీకి చాన్స్‌ ఉందని భావిస్తున్నాం.You may be interested

6 నెలల కాలానికి టాప్‌ సిఫార్సులు

Saturday 18th January 2020

కేంద్ర ప్రభుత్వం మరో 12 రోజుల్లో పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ ప్రభావంతో స్టాక్‌మార్కెట్లో సూచీలు స్వల్పకాలం(3నెలల పాటు)లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టాప్‌ బ్రోకరేజ్‌ సం‍స్థలు 6 నెలల కాలానికి 5 షేర్లను సిఫార్సు చేస్తున్నాయి. 1.షేరు పేరు:- కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ బ్రోకరేజ్‌ సంస్థ:- మోతీలాల్‌ ఓస్వాల్‌ రేటింగ్‌:- కొనవచ్చు షేరు ప్రస్తుత ధర:- రూ.588.70 టార్గెట్‌ ధర:- రూ.677.00 కాలపరిమితి:- 6నెలలు విశ్లేషణ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కంపెనీ మెరుగైన

ఎం అండ్‌ ఎం చేతికి ఫిప్త్‌గేర్‌ వెంచర్స్‌

Saturday 18th January 2020

న్యూఢిల్లీ: మహీంద్ర అండ్‌ మహీంద్ర కంపెనీ(ఎం అండ్‌ ఎం)  ఈ-కామ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ఫిప్త్‌ గేర్‌ వెంచర్స్‌(ఎఫ్‌జీవీఎల్‌)ను కొనుగోలు చేయనుంది. మహీంద్ర కంపెనీ తన అనుబంధ సంస్థ అయిన  మహీంద్ర ఫస్ట్‌ ఛాయిస్‌ వీల్స్‌ లిమిటెడ్‌(ఎంఎఫ్‌సీడబ్ల్యూఎల్‌) ఫిప్త్‌గేర్‌ వెంచర్స్‌ను రూ.30.45 కోట్లవరకు కొనుగోలు చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. డిజిటల్‌ ఆటోమోటివ్స్‌ను మరింత విస్తరించేందుకు ఎఫ్‌జీవీఎల్‌ను సొంతం చేసుకుంటున్నట్లుగా మహీంద్ర మహీంద్ర కంపెనీ  వెల్లడించింది.  ఇప్పటికే ఫిప్త్‌ గేర్‌ వెంచర్స్‌ను పూర్తిస్థాయిలో

Most from this category