News


రానున్న కాలంలో చిన్న షేర్లదే హవా

Saturday 28th December 2019
Markets_main1577521890.png-30495

ఖరీదైన లార్జ్‌క్యాప్స్‌ నుంచి బయటపడుతున్నాం
రీజనబుల్‌గా ఉన్న మిడ్‌క్యాప్స్‌వైపు మళ్లుతున్నాం
-పంకజ్‌ టిబ్రేవాల్‌ 
కొటక్‌ ఎంఎఫ్‌ ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌

కొద్దిపాటి హెవీవెయిట్స్‌తో ప్రస్తుతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో వచ్చిన ర్యాలీ భవిష్యత్‌లో ఇతర కౌంటర్లకూ విస్తరించనున్నట్లు కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌(ఎంఎఫ్‌) ఈక్విటీ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ పంకజ్‌ టిబ్రేవాల్‌ అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగంసైతం పుంజుకోనున్నట్లు చెబుతున్నారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు అంశాలను ప్రస్తావించారు.. వివరాలు చూద్దాం..

గత రెండేళ్లలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ విభాగం క్లిష్ట పరిస్థితులను చవిచూసింది. లార్జ్‌క్యాప్స్‌లోనూ ర్యాలీ 15-20 స్టాక్స్‌కు పరిమితమైంది. దీంతో మార్కెట్లు ఊపందుకున్నప్పటికీ పలు కౌంటర్లకు ర్యాలీలో చోటు దక్కలేదు. ప్రధానంగా 2017 తదుపరి మిడ్‌, స్మాల్‌ క్యా‍ప్స్‌లో పార్టిసిపేషన్‌ బాగా తగ్గిపోయింది. రెండేళ్లుగా జరుగుతున్న దిద్దుబాటు(కరెక్షన్‌) కారణంగా ఇటీవల ర్యాలీ మిడ్‌క్యాప్స్‌ వైపు మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తు‍న్నాయి. అక్టోబర్‌లో తొలిసారి మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ లార్జ్‌ క్యాప్స్‌ను అధిగమించి బలపడింది. గత కొద్ది రోజులుగా స్టాక్‌ ఆధారిత మూవ్‌మెంట్స్‌ కనిపిస్తున్నాయి. 2020 విషయానికొస్తే పలు ప్రతికూల అంశాలను మార్కెట్లు ఇప్పటికే అవగాహన చేసుకున్నాయి. దీంతో రానున్న 18-24 నెలల కాలంలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ వెలుగులో నిలిచే అవకాశముంది. నిఫ్టీని మించి పరుగుతీయవచ్చు. దీంతో​క్రమంగా లార్జ్‌ క్యాప్స్‌ నుంచి పెట్టుబడులను మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌నకు మళ్లించనున్నాం.

15 శాతం రిటర్నులు
ఈ ఏడాది(2019) సంక్లిష్ట పరిస్థితుల మధ్య గడిచింది. అయితే బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో 130 షేర్లు 15 శాతానికి మించిన రిటర్నులు సాధించాయి. వీటిలో విభిన్న రంగాలకు చెందిన కంపెనీలున్నాయి. వీటిలో ఏదో ఒక థీమ్‌ ఆధారంగా లాభపడిన కౌంటర్లు తక్కువే. అత్యధిక రిటర్నులు అందించిన స్టాక్స్‌ జాబితాలో రెవెన్యూ, హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఏఎంసీ, ఎంఎఫ్‌ఐ, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, స్పెషాలిటీ రంగాలున్నాయి. దీంతో రానున్న ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో ఈ ట్రెండ్‌ పుంజుకునే అవకాశముంది. మెరుగైన ఆర్జనలు సాధించే కంపెనీలకు డిమాండ్‌ పెరగనుంది. ఇలాంటి కంపెనీలకు సంబంధించి బ్యాలన్స్‌షీట్‌, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ వంటి అంశాలకు ప్రాధాన్యత ఉండకపోవచ్చు. అయితే 2017 తరహా ర్యాలీని అంచనా వేయలేము.

ఫైనాన్షియల్‌ స్టాక్స్‌?
ఫైనాన్షియల్స్‌, బ్యాంకింగ్‌ విభాగాలలో బిజినెస్‌ పరిమాణం కీలకంగా నిలుస్తుంది. దేశీయంగా భారీ బ్యాంకులు ఈ అంశంలో లబ్డి పొందగలుగుతున్నాయి. లయబిలిటీ విషయంలో భారీ బ్యాంకులు తొలిసారి అత్యంత పటిష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో డిపాజిట్ల రేట్లను తగ్గించడం, ఏడాది లేదా రెండేళ్లకు మించిన డిపాజిట్లపట్ల ఆసక్తి చూపకపోవడం వంటి చర్యలకు దిగుతున్నాయి. బ్యాలన్స్‌షీట్‌ రిస్కులు, తదిరాలను అంచనావేయకున్నప్పటికీ ఇటీవల కొన్ని మధ్యస్థాయి ఫైనాన్షియల్‌ రంగ కంపెనీలపట్ల నమ్మకం​కలుగుతోంది. ఆర్థిక మందగమనం కారణంగా రానున్న 6-12 నెలల కాలంలో స్లిప్పేజెస్‌ మరింత పెరగవచ్చు. ఈ పరిస్థితి, రిటైల్‌, ఎస్‌ఎంఈలకూ పాకే వీలుంది. ఇలాంటి అంశాలపై స్పష్టత వస్తే.. మధ్యస్థాయి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపే అవకాశముంది.

స్టాక్స్‌ ఎంపిక ఎలా?
స్టాక్స్‌ ఎంపిక, పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఆధారంగా రిటర్నుల విషయంలో ఫండ్స్‌ పనితీరును అంచనా వేయవచ్చు. ఇక స్టాక్స్‌ ఎంపిక విషయానికొస్తే.. బ్యాలన్స్‌ షీట్‌, క్యాష్‌ ఫ్లోలకు ప్రాధాన్యత ఉంటుంది. నికర లాభాల్లో వృద్ధి కీలకం అయినప్పటికీ అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన పనిలేదు. భారీ ఆదాయం సాధించే కంపెనీ.. లాభాలను సాధించకపోవచ్చు. ఇదే విధంగా అకౌంటింగ్‌ లాభాలున్నప్పటికీ పటిష్ట క్యాష్‌ ఫ్లో లేకపోవచ్చు. ఇలాంటి నియమాల కారణంగా మేము గత మూడేళ్ల కాలంలో చాలా పొరపాట్లకు తావీయలేదు. అంతేకాకుండా మార్కెట్లలో తలెత్తిన పలు సవాళ్ల నుంచి సైతం తప్పించుకోగలిగాం. కంపెనీల ఎంపికలో పటిష్ట యాజమాన్య నిర్వహణకూ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఆయా కంపెనీల ప్రమోటర్లు జీవితకాలంలో చేసిన పెట్టుబడుల ద్వారా నిర్మించే వెల్త్‌లో మనమూ భాగస్వాములం కాగలుగుతాం. పెట్టుబడుల విషయంలో ఓపిక వహిస్తే ఇన్వెస్టర్లకు పోర్ట్‌ఫోలియోల ద్వారా లాభాలు అందించగలుగుతాం. సాధారణంగా దీర్ఘకాలంలో ఈక్విటీ వ్యయాలను మించి రిటర్నులు అందించగల బిజినెస్‌లవైపు దృష్టిపెడుతుంటాం. కొన్ని సైక్లికల్‌ బిజినెస్‌లు అధిక రిటర్నులు ఇచ్చినప్పటికీ దీర్ఘకాలంలో వెనుకంజ వేస్తుంటాయి. ఇలాంటి కొన్ని నియమాలను పెట్టుబడుల విషయంలో అమలు చేయడం ద్వారా సమస్యాత్మక వాతావరణంలోనూ నెగ్గుకురావచ్చు.



You may be interested

డిసెంబర్‌ 31లోగా మీరు పూర్తిచేయాల్సిన ఆర్థిక వ్యవహారాలు..!

Saturday 28th December 2019

ఈ 2019 ఏడాది మరో 3రోజుల్లో ముగుస్తుంది. మనలో కొంతమంది సరికొత్త ఎజెండాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మీరు కూడా డిసెంబర్‌ 31లోగా ఈ 3 ఆర్థిక కర్తవ్యాలను పూర్తి చేసుకుని నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకండి. ఇంతకీ ఈ 3 ఆర్థిక కర్తవ్యాలు ఏమిటని ఆలోచిస్తున్నారా..? అయితే పూర్తి వివరాలకు కింద కథనాన్ని చదవండి.... పాన్‌కార్డును ఆధార్‌తో లింక్‌ చేసుకోండి:-  ఈ డిసెంబర్‌ 31వ తేదీకల్లా పాన్‌కార్డును

4రోజుల్లోనే రూ.1110 పెరిగిన పసిడి

Saturday 28th December 2019

దేశీయ పసిడి ఫ్యూచర్లకు ఈ వారం బాగా కలిసొచ్చింది. కేవలం 4 ట్రేడింగ్‌ సెషన్‌ల్లోనే ఏకంగా రూ.1100లు లాభపడింది. దేశీయం ఎంసీఎక్స్‌లో  ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్స్‌ ధర సోమవారం రూ.38,040 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ వారంలో అంతర్జాతీయ పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడటం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయితో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ పరిమితి శ్రేణిలో ట్రేడ్‌ కదలాడటం తదితర అంశాలు

Most from this category