News


ఇక మిడ్, స్మాల్‌క్యాప్‌ల హవా

Friday 21st February 2020
Markets_main1582275267.png-31986

మెరుగైన కార్పొరేట్‌ లాభాల ఫలితంగా ఇక రానున్న రోజుల్లో మిడ్, స్మాల్‌ క్యాప్‌ షేర్లకు డిమాండ్‌ పెరుగుతుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ బోబ్డే అంచనావేశారు. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కరోనావైరస్‌ ఆందోళనలున్నప్పటికీ, మార్కెట్‌ అనేది కార్పొరేట్లు వెలువరించే మంచి ఫలితాలు, అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు వ్యవస్థలోకి ప్రవేశపెట్టే లిక్విడిటీపై ఆధారపడివుంటుందని అన్నారు. ఇప్పటివరకూ వెల్లడైన కార్పొరేట్‌ ఫలితాలు అంచనాలకంటే బావున్నాయని, దీంతో 2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో మరింత మెరుగ్గా లాభాలు వుండవచ్చనే అంచనాలు సహజంగానే ఇన్వెస్టర్లలో ఏర్పడతాయన్నారు. అలాగే గతేడాది రుతుపవనాలు బావున్నందున, రిజర్వాయిర్లలో పుష్కలంగా నీటినిల్వలు వున్నాయని, దాంతో రబీ దిగుబడులు పెరుగుతాయని ఆయన వివరించారు. మరోవైపు జీఎస్‌టీ వసూళ్లు మెరుగుపడుతున్నాయని, విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు పెరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. 
కరోనావైరస్‌ ప్రభావం...
కరోనావైరస్‌ వ్యాప్తి కారణంగా విడిభాగాలు, ముడిపదార్థాల సరఫరాకు కలిగే ఆటంకంవల్ల కొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం వుండవచ్చని పంకజ్‌ అంచనావేశారు. రసాయినాలు, ఫార్మా, కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాలు ఇబ్బంది పడవచ్చని, అలాగే చైనా అధికంగా వినియోగించే కమోడిటీలకు కూడా డిమాండ్‌ బలహీనంగా వుంటుందని, దీంతో మెటల్‌ కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడవచ్చన్నారు. మొత్తంమీద కరోనావైరస్‌ కారణంగా మార్కెట్‌కు కొంతమేర రిస్క్‌ వుందని కూడా ఆయన హెచ్చరించారు. 
 లార్జ్‌క్యాప్స్‌...మిడ్,స్మాల్‌క్యాప్స్‌పై.....
మిడ్, స్మాల్‌క్యాప్స్‌ స్కీముల్లోకి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇటీవల భారీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తున్నాయని, ఈ కారణంగా లార్జ్‌క్యాప్‌ షేర్లు, మిడ్, స్మాల్‌క్యాప్‌ల మధ్య విలువల వ్యత్యాసం క్రమేపీ తగ్గుతుందని పంకజ్‌ వ్యాఖ్యానించారరు. మెరుగైన కార్పొరేట్‌ ఫలితాలు, చౌక విలువలు, దేశీయ ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడుల ఫలితంగా రానున్న రోజుల్లో మిడ్,స్మాల్‌క్యాప్‌ షేర్లకు డిమాండ్‌ పెరుగుతుందని ఆయన అంచనావేశారు. అలాగే హౌసింగ్, ఆటోమొబైల్, రిటైల్‌ రుణాల వృద్ధికి ఇటీవల ఆర్‌బీఐ తీసుకున్న చర్యలవల్ల ఈ రంగాలు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తాయని అలాగే వడ్డీ రేట్లు కూడా కనిష్టస్థాయిలోనే కొనసాగనున్నందున, కంపెనీలన్నీ ప్రయోజనం పొందగలుగుతాయని వివరించారు. 
 You may be interested

ఈక్విటీ మార్కెట్లలో మరోసారి కరోనా కలవరం..!

Friday 21st February 2020

కొన్ని రోజులుగా సద్దుమణిగిన కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి ప్రపంచ మార్కెట్లను మరోసారి కలవరపెడుతోంది. దీంతో ఆర్థిక మందగమన భయాలతో ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు ఇంట్రాడేలో 1శాతం నష్టాన్ని చవిచూసి చివరికి అరశాతం నష్టంతో ముగిశాయి. నేడు ఆసియాలో ఒక్క చైనా తప్ప మిగిలిన అన్ని మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు సైతం నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించగా, అమెరికా ఫ్యూచర్లు అరశాతం

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ ఐపీఓ ఆఫర్‌ ధర రూ.750-755..?

Friday 21st February 2020

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)లో ఆఫర్‌ ధరను ఒక్కో షేరుకు రూ.750నుంచి 755గా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.9,500 కోట్లను సమీకరించనుంది. కాగా ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్స్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ మార్చి2న ప్రారంభమై మార్చి 5న ముగియనుంది. ఆఫర్‌ ముగిసిన తరువాత నాల్గోరోజు ప్రత్యేకంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్క్‌ ఇన్వెస్టర్లు, ఎస్‌బీఐ

Most from this category