News


ఇక మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ హవా

Saturday 11th January 2020
Markets_main1578722988.png-30858

2020లో ఈక్విటీ మార్కెట్లు గుడ్‌
విదేశీ ఆందోళనల ప్రభావం స్వల్పకాలికమే
వినోద్‌ నాయర్‌ అంచనాలు

ఈ కేలండర్‌ ఏడాది(2020)లో ఈక్విటీ మార్కెట్‌ వెలుగులో నిలవనున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, రీసెర్చ్‌ హెడ్‌.. వినోద్‌ నాయర్‌ అంచనా వేస్తున్నారు. ప్రధాన లార్జ్‌ క్యాప్స్‌ ఇప్పటికే భారీగా ర్యాలీ చేయడంతో ఇండెక్సులు దూకుడు చూపినప్పటికీ, ఇక మధ్య, చిన్నతరహా(మిడ్‌, స్మాల్‌ క్యాప్‌) కౌంటర్లకు డిమాండ్‌ కనిపించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇంకా పలు అంశాలపై నాయర్‌ అంచనాలు ఎలా ఉన్నాయంటే... 

రిస్కులు తగ్గాయ్‌..
కొత్త ఏడాదిలో పశ్చిమాసియా ఆందోళనలు మార్కెట్లను దెబ్బతీసినప్పటికీ.. తదుపరి కోలుకున్నాయి. సరికొత్త గరిష్టాల బాటలో సాగుతున్నాయి. ప్రధానంగా ఫిబ్రవరిలో వెలువడనున్న బడ్జెట్‌పై ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. వృద్ధికి ఊతమివ్వగల బడ్జెట్‌ను మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. దీనికితోడు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌) ఫలితాలపై అంచనాలు బలపడుతున్నాయి. సాధారణంగా జియోపొలిటికల్‌ టెన్షన్లు దీర్ఘకాలంలో మార్కెట్లను ప్రభావితం చేయలేవు. మరోవైపు అమెరికా, చైనా మధ్య వాణిజ్య మైత్రి కుదరనున్న పరిస్థితులు రిస్క్‌లను తగ్గిస్తున్నాయి. బ్రెక్సిట్‌ ఆందోళనలు ఉపశమించడం, అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలు సానుకూల వాతావరణానికి తెరతీస్తున్నాయి.

ప్రభుత్వ దన్ను
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) రానున్న రెండేళ్లలో వర్ధమాన మార్కెట్లలో అధికంగా ఇన్వెస్ట్‌ చేసే వీలుంది. దీంతో 2018, 2019తో పోలిస్తే 2020లో దేశీ మార్కెట్లు మరింత బలపడవచ్చు. ఆర్థిక వృద్ధికి వీలుగా వినియోగం, పెట్టుబడులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రకటించిన భారీ ప్రణాళికలతోపాటు.. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ రివర్సల్‌, పీఎస్‌యూ బ్యాంకులకు పెట్టుబడులు, రియల్టీ రంగంలో రెరా చట్టం తదితరాలను అమలు చేసింది. వీటికి దన్నుగా అన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం వడ్డీ రేట్లను పదేళ్ల కనిష్టానికి చేర్చింది.

ఇతర రంగాలూ..
కొద్ది రోజులుగా సూపర్‌ లార్జ్‌ క్యాప్స్‌ ర్యాలీ చేయడంతో మార్కెట్లు భారీ ర్యాలీ చేయకపోవచ్చు. ఇకపై ఇతర రంగాలూ, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లవైపు మార్కెట్లు దృష్టి పెట్టే వీలుంది. కొంతమేర సమస్యలున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు జోరు చూపుతాయి. కార్పొరేట్లు, ఇన్వెస్టర్ల రిస్క్‌ సామర్ధ్యం పెరగనుండటమే దీనికి కారణం. అయితే ద్రవ్యలోటు పరిస్థితుల కారణంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, వినియోగ రంగాలపై ఆశించిన స్థాయిలో పెట్టుబడులను వెచ్చించలేకపోవచ్చు. డిజిన్వెస్ట్‌మెంట్‌, స్పెక్ట్రమ్‌ విక్రయం, డివిడెండ్లు, జీఎస్‌టీ వంటి పలు మార్గాలలో ప్రభుత్వానికి తగిన ఆదాయం సమకూరవలసి ఉంది. You may be interested

ఇరాన్‌పై కొత్త ఆంక్షలు విధించిన అమెరికా

Saturday 11th January 2020

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలను అమెరికా విధించింది. ఇరాన్‌ ఎకానమీలో వివిధ విభాగాలను లక్ష్యంగా చేసుకొని తాజా ఆంక్షలను విధించింది. నిర్మాణం, ఉత్పత్తి, టెక్స్‌టైల్స్‌, మైనింగ్‌ రంగాలతో పాటు 8మంది టాప్‌ ఇరాన్‌ అధికారులు తాజా ఆంక్షల కిందకు వచ్చారు. ఇరాన్‌ ఎకానమీపై ఈ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్‌ నాయకత్వం పద్ధతి మార్చుకోనంత వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్‌ శుక్రవారం

లాభంతో ముగిసిన పసిడి

Saturday 11th January 2020

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లు శుక్రవారం లాభంతో ముగిశాయి. అమెరికాలో నిన్నరాత్రి మార్కెట్ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి ధర 5.80డాలర్లు లాభపడి 1,560.10 డాలర్ల వద్ద స్థిరపడింది. అమెరికా డిసెంబర్‌ పేరోల్‌ వృద్ధి గణాంకాలు అంచనాలకు మించిన నమోదు కాకపోవడంతో బాండ్‌ ధరలు పెరిగాయి. తద్వారా తగ్గిన బాండ్‌ ఈల్డ్‌లు...వడ్డీరేట్ల తగ్గింపునకు దారి తీయవచ్చనే అశావహ అంచనాలు పసిడికి డిమాండ్‌ పెంచినట్లు బులియన్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కిందటేడాదిలో స్పాట్‌ బంగారం ధర

Most from this category