News


మిడ్‌,స్మాల్‌ క్యాప్స్‌ నుంచి మంచి రాబడులు

Saturday 18th January 2020
Markets_main1579329801.png-31014

రానున్న 3-4 ఏళ్లలో మధ్య, చిన్నతరహా కౌంటర్లదే జోరు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పీఎంఎస్‌ నిపుణులు పరాగ్‌ థక్కర్‌ అంచనా

రెండేళ్ల క్రితం స్మాల్‌ క్యాప్స్‌లో ర్యాలీ చివరి దశకు చేరుకున్నదని ప్రకటించడం ద్వారా కచ్చితమైన అంచనాలు ప్రకటించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ పీఎంఎస్‌ నిపుణులు పరాగ్‌ థక్కర్‌ తాజాగా.. యూటర్న్‌ తీసుకున్నారు. ఇకపై మళ్లీ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అత్యధిక రిటర్నులు ఇచ్చే వీలున్నట్లు చెబుతున్నారు. ఒక అంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా పలు అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

2018 పరిస్థితులు వేరు
2007 ఆగస్ట్‌ తదుపరి మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ప్రారంభమైన ర్యాలీ 2018 జనవరికల్లా బాగా ఊపందుకుంది. ప్రధానంగా చిన్న షేర్లు పిచ్చిగా పెరిగాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ పీఈ 25కు చేరింది. దీంతో 2018 జనవరిలో ర్యాలీ చివరి దశకు చేరుకున్నట్లు భావించాం. తద్వారా అంచనాలు నిజమయ్యాయి. అయితే ఇటీవల 2019 ఆగస్ట్‌- సెప్టెంబర్‌లో 14 పీఈకి స్మాల్‌ క్యాప్‌ దిగివచ్చింది. లాభాలు 10-15 శాతం తగ్గిన స్మాల్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు 30-50 శాతం మధ్య దిద్దుబాటు(కరెక్షన్‌)కు లోనయ్యాయి. ఫలితంగా బిజినెస్‌ సైకిల్స్‌ బలహీనపడినప్పటికీ.. కార్పొరేట్‌ పాలన, రుణ భార సమస్యల్లో చిక్కుకోని కంపెనీలవైపు దృష్టి సారిస్తున్నాం. 

4 అంశాలకు ప్రాధాన్యం
కంపెనీల ఎంపికలో నాలుగు అంశాలకు ప్రాధాన్యమిస్తాం. కార్పొరేట్‌ గవర్నెన్స్‌, మైనారిటీ వాటాదారులకు విలువ చేకూర్చగల యాజమాన్యం కీలకం. ఇక రిటర్నుల విషయంలో ఆర్‌వోఈ 15-18 శాతం స్థాయిలో ఉన్న కంపెనీలు మేలు. వర్కింగ్‌ కేపిటల్‌ సమస్యలులేకుండా మెరుగైన క్యాష్‌ఫ్లో సాధించే కంపెనీలు నిలకడను చూపగలవు. ఇదే విధంగా ఇబిటా- నికర రుణ నిష్పత్తి 3.5కు మించని కంపెనీలకు ప్రాధాన్యముంటుంది. స్మాల్‌ క్యాప్స్‌తోపాటు.. మెటల్‌ కౌంటర్లనూ ఇన్వెస్ట్‌మెంట్‌కు పరిగణిం‍చవచ్చని భావిస్తున్నాం. ఇటీవల స్మాల్‌ క్యాప్స్‌ వేగంగా పెరిగిన కారణంగా కొంతమేర కన్సాలిడేషన్‌కు అవకాశముంది.

కాం‍ట్రా ఫండ్స్‌
కాంట్రా వ్యూహాలు మాకు అత్యంత ప్రియమైనవని చెప్పవచ్చు. ఇవి మా ఫండ్‌ హౌస్‌కు లబ్ది చేకూర్చాయి కూడా. అలాగని బాగా చౌకగా లభించే షేర్లను కొనుగోలు చేయబోము. రీజనబుల్‌ డిస్కౌంట్‌లో ట్రేడవుతున్న నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకుంటాం. ఆయా రంగాలు లేదా మార్కెట్లలో తాత్కాలిక సమస్యల కారణంగా షేర్ల ధరలు తగ్గిన కంపెనీలవైపు దృష్టి పెడుతుంటాము. ఉదాహరణకు చమురు ధరలు పెరిగితే.. పెయింట్స్‌, ఆటో, బ్యాంకింగ్‌ రంగాల కౌంటర్లు డీలాపడతాయి. ద్రవ్యోల్బణ భయాలతో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు బ్యాంకు షేర్లను దెబ్బతీయవచ్చు. ఇలాంటి సందర్భాలకు అనుగుణంగా పెట్టుబడి వ్యూహాలను అమలు చేస్తుంటాం. ఇక కాంట్రా బెట్స్‌ విషయానికి వస్తే.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా మెటల్‌ షేర్లు నీరసించాయి. 7-8 పీఈలకు చేరాయి. 2015తో పోలిస్తే ప్రస్తుతం మెటల్‌ కంపెనీల బ్యాలన్స్‌షీట్స్‌ బలపడ్డాయి. ఇబిటా, నికర రుణ నిష్పత్తి విషయంలో కొన్ని కంపెనీలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయం‍లో ఎఫ్‌ఎంసీజీ, పెయింట్స్‌ రంగ స్టాక్స్‌ కొనుగోలు ఆలోచన చేయడమే కాంట్రా.

ఫార్మా దీర్ఘకాలానికి
ఫార్మా రంగం విషయానికివస్తే.. గత ఐదేళ్ల రిటర్నులకు ప్రాధాన్యం ఇవ్వబోము. పటిష్ట బిజినెస్‌లు కలిగి మంచి క్యాష్‌ఫ్లోలు సాధించే కంపెనీలకు ప్రాధాన్యత ఉంటుంది. మెరుగైన ఆర్‌వోసీఈ ఉన్నప్పటికీ.. వృద్ధి అంతగా కనిపించని కంపెనీలవైపు దృష్టి సారిస్తాం. ఏదో ఒక సమయంలో ఇలాంటి కంపెనీలు వేగవంత వృద్ధిని అందుకునే అవకాశముంటుంది.You may be interested

సగటు గృహ,వ్యక్తిగత రుణాల్లో అగ్రస్థానంలో బెంగళూరు

Saturday 18th January 2020

రెండో స్థానానికి పరిమితమైన ముంబై న్యూఢిల్లీ: సగటున అధిక మొత్తంలో గృహ రుణాలు  పొందే నగరాల జాబితాలో ఆర్థిక రాజధాని ముంబైని వెనక్కి నెట్టి బెంగళూరు ముందువరుసలో నిలిచింది. ఐటీ హబ్‌గానే కాకుండా స్టార్టప్‌లకు రాజాధానిగా పేరుగాంచిన బెంగళూరు నగరం గృహ, వ్యక్తిగత సగటు రుణాలను దేశంలో ఇతర ప్రాంతాల కంటే అధికంగా తీసుకుంటూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని బ్యాంక్‌ బజార్‌ మనీమూడ్‌-2020 నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2019

రూ.260 పెరిగిన పసిడి

Saturday 18th January 2020

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో శుక్రవారం 10గ్రాముల పసిడి ధర రూ.260లు లాభపడింది. చైనా 2019లో  వృద్ధి 29 సంవత్సరాల కనిష్ట స్థాయి 6.1 శాతానికి పడిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు కొనుగోలు మద్దతు లభించింది. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 17 పైసలు బలహీనపడటం దేశీయ పసిడి ప్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. రాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి

Most from this category