News


జనవరిలో మిడ్‌ క్యాప్స్‌ జోరు

Wednesday 15th January 2020
Markets_main1579070069.png-30946

కొత్త ఏడాది(2020)లో అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే మధ్య, చిన్నతరహా కౌంటర్లు జోరు చూపుతున్నాయి. ఓవైపు మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతుంటే.. మరోవైపు మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ఇన్వెస్టర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. వెరసి ఈ జనవరిలో ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 1.6 శాతం పుంజుకోగా.. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 3 శాతం, స్మాల్‌ క్యాప్‌ 5 శాతం చొప్పున ఎగశాయి. ఇతర వివరాలు చూద్దాం..

ఈ ఏడాది ప్రారంభమయ్యాక ఇప్పటివరకూ బీఎస్‌ఈ-500 ఇండెక్స్‌లో భాగమైన 300 స్టాక్స్‌ లాభాల బాటలో సాగుతున్నాయి. గతేడాది మొదలు ఇప్పటివరకూ భారీ ర్యాలీ చేసిన బ్లూచిప్స్‌తో పోలిస్తే పలు నాణ్యమైన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

80-25 శాతం ప్లస్‌
గత నెల రోజుల ట్రేడింగ్‌ను పరిగణిస్తే.. మిడ్‌ క్యాప్స్‌లో ఇండియాబుల్స్‌ ఇంటిగ్రేటెడ్‌, ఇండియాబుల్స్‌ రియల్టీ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, జిందాల్‌ స్టీల్‌, ఈక్లర్క్స్‌​, శం‍కర బిల్డ్‌, సెయిల్‌, ఫోర్స్‌ మోటార్స్‌, ఇండియన్‌ ఎనర్జీ, టీవీ 18 బ్రాడ్‌క్యాస్ట్‌, జై కార్ప్‌, చెన్నై పెట్రో, టైమ్‌ టెక్నోప్లాస్ట్‌, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, జిందాల్‌ సా, కేఆర్‌బీఎల్‌, హిందుస్తాన్‌ కాపర్‌, జేకే లక్ష్మీ సిమెంట్‌ తదితరాలు 80-25 శాతం మధ్య దూసుకెళ్లాయి. 

ఇతర కౌంటర్లు సైతం
గత నెల రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఇతర చిన్న షేర్ల జాబితా ఇలా ఉంది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, అవంతీ ఫీడ్స్‌, హిమాద్రి స్పెషాలిటీ, కేర్‌ రేటింగ్స్‌, నిట్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, ఐటీడీ సిమెంటేషన్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, సెంట్రమ్‌ కేపిటల్‌, దీపక్‌ ఫెర్టిలైజర్స్‌, నవభారత్‌ వెంచర్స్‌, సుప్రజిత్‌ ఇంజినీరింగ్‌, మేఘమణి ఆర్గానిక్స్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, డీసీఎం శ్రీరామ్‌, ఇండియా సిమెంట్‌, ఇన్ఫీబీమ్‌ ఎవెన్యూస్‌, రెయిన్‌ ఇండస్ట్రీస్‌, ఎంసీఎక్స్‌, టాటా గ్లోబల్‌ తదితరాలు 25-20 శాతం మధ్య జంప్‌చేయడం విశేషం!

డిష్‌మన్‌ కార్బొ డౌన్‌
గత నెల రోజుల్లో వివిధ ప్రతికూల వార్తల నేపథ్యంలో కొన్ని మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. వీటిలో డిష్‌మన్‌ కార్బొజెన్‌ 35 శాతం పతనంకాగా.. యస్‌ బ్యాంక్‌ 16 శాతం క్షీణించింది. ఈ బాటలో ఇండియన్‌ బ్యాంక్‌, లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌, ఆస్ట్రాజెనెకా, ట్రైడెంట్‌, కేన్‌ ఫిన్‌, యూనియన్‌ బ్యాంక్‌, వొడాఫోన్‌ ఐడియా తదితరాలు 15- 10 శాతం మధ్య వెనకడుగు వేశాయి.

జోరు తీరిలా

కంపెనీ పేరు      15న ధర(రూ.)     లాభం(%)
ఐబీ ఇంటిగ్రేటెడ్‌     138         82
ఐబీ రియల్టీ         100         61
అదానీ గ్రీన్‌ ఎనర్జీ     188         40
గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌     128         32
శంకర బిల్డ్‌ ప్రొడక్ట్స్‌     385         32

 You may be interested

చైనాగూడ్స్‌పై టారిఫ్స్‌ కొనసాగుతాయ్‌!

Wednesday 15th January 2020

రెండో దశ ట్రేడ్‌ ఒప్పందం జరిగేవరకు చైనా వస్తువులపై విధించిన టారిఫ్‌లు కొనసాగుతాయని అమెరికా వాణిజ్య సెక్రటరీ స్టీవెన్‌ నుచిన్‌ చెప్పారు. తొలిదశ ఒప్పందంపై సంంతకాలకు అనుకున్న గడువు సమీపిస్తున్న వేళ స్టీవెన్‌ ఈ ప్రకటన చేశారు. రెండో దశ వాణిజ్య ఒప్పందం వేగంగా జరిగితే ప్రెసిడెంట్‌ ట్రంప్‌ టారిఫ్‌ల తగ్గింపును పరిగణిస్తారని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం ట్రంప్‌, చైనాకు చెందిన లీయుహె తొలిదశ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ట్రంప్‌

రూ. 19వేల కోట్లివ్వండి!

Wednesday 15th January 2020

చమురు కంపెనీలను కోరుతున్న ప్రభుత్వం గతేడాదితో పోలిస్తే 5 శాతం అధికంగా రికార్డు స్థాయిలో రూ. 19000 కోట్ల డివిడెండ్‌ను ఇవ్వాలని ప్రభుత్వం పీఎస్‌యూ చమురు కంపెనీలను కోరుతోంది. విత్త పరిస్థితులు బాగాలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మొత్తం చెల్లించాలని ప్రభుత్వం కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మొత్తంలో 60 శాతాన్ని చమురు కంపెనీల్లో పెద్దన్నలైన ఓఎన్‌జీసీ, ఇండియన్‌ ఆయిల్‌ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతేడాదితో పోలిస్తే కంపెనీల లాభాలు

Most from this category