News


మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ కొనొచ్చు!

Monday 23rd December 2019
Markets_main1577095256.png-30383

ఎస్‌బీఐ ఎంఎఫ్‌ సీఐవో నవనీత్‌ మునోత్‌

ఇప్పటికే మధ్య, చిన్నతరహా(మిడ్‌, స్మాల్‌) కౌంటర్లలో చాలా వరకూ దిద్దుబాటు(కరెక‌్షన్‌) జరిగింది. దీంతో ఇకపై ఈ విభాగంపై దృష్టి పెట్టవచ్చంటున్నారు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సీఐవో నవనీత్‌ మునోత్‌. దేశీయంగా అతిపెద్ద ఈక్విటీ ఫండ్‌ నిర్వహిస్తున్న నవనీత్‌.. మార్కెట్‌ ట్రెండ్‌పై అవగాహన కోసం ప్రధానంగా నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇస్తానంటున్నారు. స్థూల ఆర్థిక అంశాలు, కార్పొరేట్ల లాభదాయకత, వేల్యుయేషన్స్‌, లిక్విడిటీ పరిస్థితుల ఆధారంగా మార్కెట్ల గమనాన్ని అంచనా వేస్తుంటానని ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇంటర్వ్యూలోని ఇతర వివరాలు చూద్దాం..

అవి కీలకం ఎందుకంటే
మార్కెట్ల నడకను అంచనా వేయడంలో స్థూల ఆర్థిక అంశాలు, కార్పొరేట్ల లాభదాయకత, షేర్ల విలువ, లిక్విడిటీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్థూల ఆర్థిక అంశాలలో భాగంగా పరపతి విధానాలు, ద్రవ్య విధానాలు, వృద్ధి, ద్రవ్యోల్బణాలను పరిగణిస్తాను. మరోపక్క గ్లోబల్‌ ఎకానమీ, విదేశీ మార్కెట్లు, వేల్యుయేషన్స్‌, లిక్విడిటీ కీలకంగా నిలుస్తాయి. వీటి తరువాత కంపెనీల లాభాలు, షేర్ల ధరలకూ ప్రాధాన్యత ఉంటుంది. కంపెనీల ఆర్జనకున్న శక్తిని షేర్ల ధరలు ప్రతిఫలిస్తుంటాయి. ఇక వేల్యుయేషన్స్‌ విషయానికివస్తే.. ప్రస్తుతం మా‍ర్కెట్లు జీడీపీ వృద్ధి లేదా లాభదాయకత అంశాలను ప్రతిఫలించకపోవడం గమనార్హం. అయితే దీర్ఘకాలంలో ఈ అంశాలను మార్కెట్‌ ప్రతిబింబిస్తుంది. 

లార్జ్‌క్యాప్స్‌ అప్‌
దీర్ఘకాలిక సగటు ప్రకారం చూస్తే.. లార్జ్‌ క్యాప్స్‌ విలువ కొంత అధికంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో దీర్ఘకాలిక సగటుకంటే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ తక్కువ స్థాయిలో కదులుతున్నాయి. కొన్ని సందర్బాలలో మార్కెట్లు అధిక స్థాయిలవద్ద కొనసాగుతుంటాయి. తదుపరి కొంతకాలంలో వేల్యుయేషన్స్‌ దిగివస్తుంటాయి. దేశీయంగా ఆర్ధిక వ్యవస్థ, కార్పొరేట్‌ లాభాలకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యాత్మక వాతావరణంలోనూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు), దేశీ ఫం‍డ్స్‌(డీఐఐలు) పెట్టుబడులు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్‌ లాభాలు జీడీపీలో 2 శాతానికి నీరసించాయి. 2008లో ఈ వాటా 7 శాతం. ఇందుకు టెలికం రంగ నష్టాలు, బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏల ప్రొవిజనింగ్‌ వంటి అంశాలు కారణమవుతున్నాయి. అయితే కొంత సమయం​ తర్వాత రికవరీ ప్రారంభమయ్యే అవకాశముంది. ఆర్థిక పురోభివృద్ధికి వీలుగా ఇప్పటికే ప్రభుత్వం ఐబీసీ, రెరా, జీఎస్‌టీ తదితర సంస్కరణలను తీసుకువచ్చింది. ఈ బాటలో ఇటీవల కార్పొరేట్‌ ట్యాక్స్‌ను సైతం తగ్గించింది.

2018తో పోలిస్తే చౌకగా
మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ వేల్యుయేషన్స్‌ 2018తో పోలిస్తే భారీగా క్షీణించాయి. గత రెండేళ్లలో కరెక‌్షన్‌ కొనసాగింది. దీంతో ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించవచ్చు. కొన్ని ఎంపిక చేసిన షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించవచ్చు. కాగా.. కొద్ది రోజులుగా ప్రభుత్వ రంగ కంపెనీలు ఆక‌ర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియను వేగవంతం చేయడం, పీఎస్‌యూ కంపెనీల నిర్వహణ మెరుగుపరచడం వంటి అంశాలు ఇందుకు దోహదం చేసే అవకాశముంది. You may be interested

2020లో కూడా పెద్దస్టాకులదే రాజ్యం!

Monday 23rd December 2019

నిపుణుల అంచనా ఈ ఏడాదిలాగానే కొత్త ఏడాదిలో కూడా పెద్ద స్టాకులదే రాజ్యమని ఎక్కువమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 2019లో జరిగినట్లే కొన్ని లార్జ్‌క్యాప్స్‌ మాత్రమే సూచీలను ముందుకు నడిపిస్తాయని అంచనా వేస్తున్నారు. ఎకానమీలో మందగమనం కొత్త ఏడాది కూడా కొనసాగవచ్చని, అందువల్ల ఇన్వెస్టర్లు ఎక్కువగా క్వాలిటీ షేర్లను ఎంచుకోవడం జరుగుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ప్రతినిధి దీపేన్‌షా చెప్పారు. విదేశీ నిధులు సైతం లార్జ్‌క్యాప్స్‌లోకే ప్రవహిస్తాయన్నారు. ఈ ఏడాదిలో వృద్ధి నెమ్మదించినా సూచీలు

ఎస్‌బీఐ 2 శాతం డౌన్‌: నష్టాల్లో పీఎస్‌యూ బ్యాంకులు

Monday 23rd December 2019

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. సూచీల వరుస 4రోజుల రికార్డు ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ ఇందుకు కారణమైంది. మార్కెట్‌ భారీ పతనంలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గతవారంలో  దీర్ఘకాలిక ఈల్డ్‌ తగ్గింపు లక్ష్యంగా ఆపరేషన్‌ ట్విస్ట్‌ పేరుతో రూ.10వేల కోట్ల విలువైన పదేళ్ల కాలపరిమితి ఉన్న ప్రభుత్వ బాండ్లను కొంటామని, ఇదే సమయంలో అంతే మొత్తానికి ఏడాది

Most from this category