News


వచ్చే ఏడాది మిడ్‌ క్యాప్స్‌ హవా: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌

Wednesday 25th December 2019
Markets_main1577255030.png-30427

నాణ్యమైన మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ 
భారీ హెచ్చుతగ్గులకు ఆస్కారం తక్కువే
రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌: నవీన్‌ కులకర్ణి

వచ్చే ఏడాది(2020)లో మధ్య, చిన్నతరహా కౌంటర్లు వెలుగులో నిలిచే వీలున్నట్లు రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి చెబుతున్నారు. అయితే స్మాల్‌ క్యాప్స్‌తో పోలిస్తే మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ త్వరగా జోరందుకోనున్నట్లు అంచనా వేశారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2020లో మార్కెట్ల గమనం, విభిన్న రంగాల తీరు తదితర అంశాలపై అభిప్రాయాలను వెల్లడించారు. ఇతర వివరాలు చూద్దాం..

అంచనాలను మించుతూ
దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రస్తుతం సరికొత్త గరిష్ట రికార్డులను అందుకున్నాయి. ఏడాది ప్రారంభంలో ఈ జోరును అంచనా వేయలేదు. అయితే ఏడాది మధ్యలో కొంతమేర సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది కూడా. అంతర్జాతీయ స్థాయిలోనూ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. రానున్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై పలు అంచనాలున్నాయి. ద్రవ్యలోటు కట్టడి, రుణ సమీకరణ తదితర అంశాలపట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వేల్యూ స్టాక్స్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. ఇదే విధంగా మెటల్‌ రంగం సైతం వెలుగులోకి వస్తున్న సంకేతాలు కనిపిస్తు‍న్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో పెద్ద సంస్థల కౌంటర్లు పుంజుకుంటున్నాయి. కాగా.. రానున్న 12 నెలల్లో మిడ్‌ క్యాప్స్‌ భారీగా పెరిగే అవకాశముంది. నాణ్యమైన మిడ్‌ క్యాప్స్‌నకు డిమాండ్‌ కనిపించవచ్చు. అయితే స్మాల్‌ క్యాప్స్‌ పుంజుకునేందుకు మరింత సమయం పడుతుందని భావిస్తున్నాం. ఏడాది కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే.. మిడ్‌క్యాప్స్‌ విభాగంలో భారీ ఒడిదొడుకులకు ఆస్కారం తక్కువగా కనిపిస్తోంది. 

గ్రామీణ వినియోగంపై మొగ్గు
రబీ సీజన్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది వ్యవసాయ ఆదాయాలు పెరగనున్నాయి. మహారాష్ట్రలో రెండు ప్రధాన పంటల తీరును పరిశీలిస్తే రైతుల ఆదాయం పుంజుకోనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో గ్రామీణ వినియోగం ఊపందుకోనుంది. ఈ అంశాల ఆధారంగా మిడ్‌ క్యాప్స్‌లో ఎస్కార్ట్స్‌ షేరుపట్ల బుల్లిష్‌గా ఉన్నాం. ఇది ఆటో రంగానికి చెందిన కౌంటర్‌కాగా.. ఎఫ్‌ఎంసీజీ విభాగంలో డాబర్‌ను పరిశీలించవవచ్చు. ఈ కౌంటర్‌ను మొత్తం వినియోగ రంగ పరిస్థితుల ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చని భావిస్తున్నాం. కంపెనీ అనుసరించే విభిన్న వ్యూహాలు, అభివృద్ధి ప్రణాళికలే దీనికి కారణం. 

ఆటో రంగం​ గుడ్‌
ఇటీవల నీరసించిన ఆటో రంగం ఇకపై రికవరీ బాట పట్టే వీలుంది. ఈ అంచనాలతో ఆటో విభాగంలో అశోక్‌ లేలాండ్‌, ఐషర్‌ మోటార్స్‌ కౌంటర్లపట్ల ఆసక్తిగా ఉన్నాం. ఎఫ్‌ఎంసీజీ రంగంలో హెచ్‌యూఎల్‌, ఆటో విభాగంలో మారుతీ వంటి బ్లూచిప్‌ కంపెనీలు సైతం మంచి పనితీరు ప్రదర్శించవచ్చు. ఐటీ రంగం విషయానికి వస్తే బ్లూచిప్స్‌ షేరు ఇన్ఫోసిస్‌ రీజనబుల్‌ విలువలో ఉంది. మిడ్‌ క్యాప్స్‌ విభాగంలో సొనాటా సాఫ్ట్‌వేర్‌, మైండ్‌ట్రీ పట్ల ఆశావహ ధృక్పథాన్ని కలిగి ఉన్నాం. కెమికల్స్‌ విభాగంలో అయితే ఆర్తి ఇండస్ట్రీస్‌ను దీర్ఘకాలానికి మాత్రమే పరిగణించాలి. ఇటీవల ఈ కంపెనీ పనితీరు కొంత మందగించినప్పటికీ కీలక విభాగాలలో పెట్టుబడులను వెచ్చిస్తోంది. ఇక రబీ పంటల ఆధారంగా చెప్పాలంటే కోరమాండల్‌ లబ్ది పొందనుంది. పటిష్ట యాజమాన్యం కంపెనీకున్న బలంకాగా.. మధ్యకాలానికి ఈ షేరు రిటర్నులు అందించే అవకాశముంది. బ్యాంకింగ్‌ విభాగంలో బ్లూచిప్‌ సంస్థ ఎస్‌బీఐ మెరుగైన పనితీరు చూపే వీలుంది. మిడ్‌ క్యాప్‌ విభాగంలో డీసీబీ బ్యాంక్‌ రీజనబుల్‌గా కనిపిస్తున్నప్పటికీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందువల్ల దీర్ఘకాలిక దృష్టితో మాత్రమే ఈ కౌంటర్‌ను చూడవలసి ఉంటుంది.You may be interested

నేడు మార్కెట్లకు సెలవు

Wednesday 25th December 2019

 క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. హోల్‌సేల్‌ కమోడిటీ, మెటల్‌, బులియన్‌ మార్కెట్లు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌, కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లకు కూడా నేడు సెలవు దినం. భారత ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం తీవ్రంగానే ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎమ్‌ఎఫ్‌) హెచ్చరించడంతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం, ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడం లాంటి అంశాలు సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.

1500డాలర్లపైన ముగిసిన పసిడి

Wednesday 25th December 2019

ఏడు వారాల అనంతరం పసిడి ఫ్యూచర్ల ధర 1500డాలర్లపైన ముగిసింది. అమెరికాలో నిన్నరాత్రి ఫిబ్రవరి కాంటాక్టు ఔన్స్‌ పసిడి ఫ్యూచర్స్‌ 16.10 డాలర్లు లాభపడి 1,504.80 వద్ద స్థిరపడింది. ఆర్థిక మాంద్య భయాలు వెంటాడటంతో పాటు ఈక్విటీ మార్కెట్లు గరిష్ట స్థాయిల వద్ద ట్రేడ్‌ తరుణంలో లాభాల స్వీకరణ జరగవచ్చనే అందోళనలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచినట్లు బులియన్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.  ‘‘ ఈక్విటీ సూచీలు గరిష్ట స్థాయి వద్ద ఉన్నాయి.

Most from this category