News


క్యూ3లో ఈ కంపెనీల లాభాలు జూమ్‌

Friday 10th January 2020
Markets_main1578641923.png-30831

గత కేలండర్‌ ఏడాది(2019)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు విభిన్న పనితీరు ప్రదర్శించాయి. ఓవైపు ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్‌, నిఫ్టీ 12 శాతం స్థాయిలో ర్యాలీ చేయగా.. మిడ్‌ క్యాప్‌ 4 శాతం, స్మాల్‌ క్యాప్‌ 9 శాతం చొప్పున డీలాపడ్డాయి. కాగా.. డిసెంబర్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను సైతం అందుకున్నాయి. అయితే ఇకపై మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు సైతం మెరుగైన రిటర్నులు అందించగలవన్న అంచనాలు ఇటీవల అధికమయ్యాయి. పలువురు విశ్లేషకులు ప్రధానంగా నాణ్యమైన మిడ్‌ క్యాప్‌ కంపెనీలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించగల కొన్ని మిడ్‌ క్యాప్‌ కంపెనీలను బ్రోకింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా నికర లాభాల్లో భారీ వృద్ధిని అంచనా వేస్తున్నాయి. మోతీలాల్‌ ఓస్వాల్‌  జాబితాలో బిర్లా కార్పొరేషన్‌, లారస్‌ లేబ్స్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా చేరగా.. టిమ్‌కెన్‌ ఇండియా, బంధన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలను కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఎంపిక చేసింది. వివరాలు చూద్దాం..

బిర్లా కార్పొరేషన్‌
వార్షిక ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బిర్లా కార్పొరేషన్‌ నికర లాభం 200 శాతంపైగా పెరిగే వీలుంది. రూ. 90 కోట్లను తాకవచ్చు. కాగా.. అమ్మకాలు 6 శాతంపైగా పుంజుకుని రూ. 1664 కోట్లుగా నమోదయ్యే అవకాశముంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన సిమెంట్‌ అమ్మకాల పరిమాణం 4 శాతం బలపడి 3.34 ఎంటీకు చేరవచ్చు. దేశ తూర్పు ప్రాంతంలో నీరసించిన సిమెంట్‌ ధరలను ఉత్తర, మధ్యప్రాంతాలలోని అమ్మకాలు బ్యాలన్స్‌ చేసే వీలుంది.

లారస్‌ ల్యాబ్స్‌
వార్షిక ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో లారస్‌ ల్యాబ్స్‌ నికర లాభం 157 శాతంపైగా జంప్‌చేసే వీలుంది. రూ. 45 కోట్లను తాకవచ్చు. అమ్మకాలు సైతం 29 శాతంపైగా పెరిగి రూ. 685 కోట్లుగా నమోదయ్యే అవకాశముంది. 

స్ట్రైడ్స్‌ ఫార్మా
వార్షిక ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో స్ట్రైడ్స్‌ ఫార్మా నికర లాభం 130 శాతం పురోగమించవచ్చు. నికర లాభం రూ. 56 కోట్లను తాకే వీలుంది. ఇక అమ్మకాలు 3 శాతం పెరిగి రూ. 762 కోట్లకు చేరవచ్చు. రానిటిడైన్‌ ఔషధ అమ్మకాల కారణంగా యూఎస్‌ మార్కెట్ల నుంచి అధిక వృద్ధి నమోదయ్యే అవకాశముంది.

టిమ్‌కెన్‌ ఇండియా
వార్షిక ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో టిమ్‌కెన్‌ ఇండియా నికర లాభం 182 శాతం జంప్‌ చేసే అవకాశముంది. ఇందుకు ఇండస్ట్రియల్‌ విభాగంతోపాటు, ఏబీసీ ప్లాంట్ల నుంచి ఎగుమతులు పుంజుకోవడం సహకరించవచ్చు. కాగా.. అమ్మకాలు 10 శాతం పెరిగే వీలుంది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 22 శాతానికిపైగా నమోదయ్యే అవకాశముంది.

బంధన్‌ బ్యాంక్‌
వార్షిక ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం 100 శాతంపైగా ఎగసే వీలుంది. ఇందుకు పన్ను వ్యయాలు తగ్గడం సహకరించవచ్చు. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) సైతం 44 శాతం పుంజుకోనుంది. ఇందుకు గృహ ఫైనాన్స్‌ కొనుగోలు దోహదం చేసే అవకాశముంది. తద్వారా 85 శాతం రుణ వృద్ధి నమోదుకానుంది. ఇది ఎన్‌ఐఐ బలపడేందుకు సహకరించనుంది. త్రైమాసిక ప్రాతిపదికన నికర వడ్డీ మార్జిన్లు యథాతథంగా నమోదుకావచ్చు.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
వార్షిక ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నికర లాభం 300 శాతం జంప్‌చేసే అవకాశముంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) సైతం 50 శాతం పుంజుకోనుంది. ఇందుకు స్లిప్పేజెస్‌ తగ్గడం, స్థిరమైన నిర్వహణ పనితీరు వంటి అంశాలు సహకరించే వీలుంది. ఇతర పీఎస్‌యూ బ్యాంకులతో పోలిస్తే బీవోబీపై రుణ పరిష్కార పథకాల(రిజల్యూషన్‌) ప్రభావం అంతగా కనిపించకపోవచ్చు. You may be interested

ఈ మిడ్‌ క్యాప్స్‌ జోరు చూడండి!

Friday 10th January 2020

కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సన్‌ టీవీ నెట్‌వర్క్స్‌ ఇమామీ పేపర్‌ మిల్స్‌ న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ అంతర్జాతీయ మార్కెట్లలో బలపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో జోరు చూపుతున్నాయి. మిడ్‌ సెషన్‌కల్లా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,311 పాయింట్లను తాకింది. తద్వారా 2019 డిసెంబర్‌ 20న సాధించిన 12,293 పాయింట్ల చరిత్రాత్మక ఇంట్రాడే గరిష్టాన్ని అధిగమించింది. తదుపరి ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేశాయి. మధ్యాహ్నం 2.10 సమయంలో సెన్సెక్స్‌ 87

పశ్చిమాసియా టెన్షన్లను తక్కువ చేసి చూస్తున్నారు!

Friday 10th January 2020

మార్కెట్లపై ఎకనమిస్టు నోరియల్‌ రౌబిని ప్రపంచ మార్కెట్లు యూఎస్‌, ఇరాన్‌ ఉద్రిక్తతలను తక్కువ చేసి చూస్తున్నాయని ప్రముఖ ఎకనమిస్టు నోరియల్‌ రౌబిని హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం రాకున్నా ప్రస్తుత టెన్షన్లు మరింత పెరిగేందుకు మాత్రం 50 శాతం ఛాన్సుందని అంచనా వేశారు. ఇదే జరిగితే క్రూడాయిల్‌ 80 డాలర్లను చేరవచ్చన్నారు. ఇది ఇండియాకు మంచిది కాదని చెప్పారు. ఇండియాకు క్రూడాయిల్‌ ధర 80 డాలర్లను చేరితే విత్త,

Most from this category