News


ఈ మిడ్‌ క్యాప్స్‌ జోరు చూడండి!

Friday 10th January 2020
Markets_main1578646672.png-30832

కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌
సన్‌ టీవీ నెట్‌వర్క్స్‌
ఇమామీ పేపర్‌ మిల్స్‌
న్యూలాండ్‌ లేబొరేటరీస్‌

అంతర్జాతీయ మార్కెట్లలో బలపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్‌లో జోరు చూపుతున్నాయి. మిడ్‌ సెషన్‌కల్లా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,311 పాయింట్లను తాకింది. తద్వారా 2019 డిసెంబర్‌ 20న సాధించిన 12,293 పాయింట్ల చరిత్రాత్మక ఇంట్రాడే గరిష్టాన్ని అధిగమించింది. తదుపరి ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేశాయి. మధ్యాహ్నం 2.10 సమయంలో సెన్సెక్స్‌ 87 పాయింట్లు బలపడి 41,540కు చేరగా.. నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 12,246 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా నాలుగు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌
స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పీవీ)లో మొత్తం వాటాను విక్రయించనున్నట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8.25 శాతం జంప్‌చేసి రూ. 276 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 281ను సైతం అధిగమించింది. ఎస్‌పీవీ కేఎన్‌ఆర్‌ వలయార్‌ టోల్‌వేస్‌లో 100 శాతం వాటాను సింగపూర్‌ సంస్థ క్యూబ్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌-3కు విక్రయించనున్నట్లు కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పేర్కొంది. డీల్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలువను రూ. 529 కోట్లుగా తెలియజేసింది. 

సన్‌ టీవీ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌
సన్‌ టీవీ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ కొనుగోలు సిఫారసును కొనసాగిస్తున్నట్లు విదేశీ బ్రోకింగ్‌ సంస్థ నోమురా తాజాగా పేర్కొంది. ఈ షేరుకి రూ. 689 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సన్‌ టీవీ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 460 వద్ద ట్రేడవుతోంది. తొలుత గరిష్టంగా రూ. 471కు ఎగసింది. కాగా.. ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో సన్‌ టీవీ నెట్‌వర్క్‌ ప్రకటనల ఆదాయం భారీగా క్షీణించనున్నట్లు నోమురా అంచనా వేసింది. అయితే సబ్‌స్ర్కిప్షన్‌ ఆదాయం 17 శాతం పుంజుకోనున్నట్లు తెలియజేసింది. ట్రాయ్‌ ఆదేశాల నేపథ్యంలో రిస్క్‌లు పెరిగినట్లు అభిప్రాయపడింది. మార్జిన్లు 4.3 శాతంమేర పెరిగి 63 శాతాన్ని తాకనున్నట్లు అంచనా వేస్తోంది. దీంతో ఈ కౌంటర్‌ ఆకర్షణీయంగా ఉన్నట్లు వివరించింది.

న్యూలాండ్‌ లేబొరేటరీస్‌
సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ విజయ్‌ కిషన్‌లాల్‌ కేడియా కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడికావడంతో ఫార్మా రంగ సంస్థ న్యూలాండ్‌ లేబొరేటరీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8 శాతం జంప్‌చేసి రూ. 466 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 485 వరకూ పెరిగింది. న్యూలాండ్‌ లేబ్‌లో దాదాపు 2 శాతం వాటాకు సమానమైన 2.5 లక్షల షేర్లను అక్టోబర్‌-డిసెంబర్‌ కాలంలో కేడియా సెక్యూరిటీస్‌ సొంతం చేసుకున్నట్లు తాజాగా స్టాక్‌ ఎక్స్ఛేంజీల డేటా ద్వారా వెల్లడైంది. 

ఇమామీ పేపర్‌ మిల్స్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఇమామీ పేపర్‌ మిల్స్‌ కౌంటర్‌లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 8.2 జంప్‌చేసి రూ. 89.70 వద్ద ఫ్రీజయ్యింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో ఇమామీ పేపర్‌ మిల్స్‌ నికర లాభం 223 శాతం జంప్‌చేసి రూ. 18.5 కోట్లను తాకింది. నికర అమ్మకాలు 7 శాతం పుంజుకుని రూ. 400 కోట్లను అధిగమించాయి.
 You may be interested

టాటాలకు ఊరట

Friday 10th January 2020

ఎన్‌సీఎల్‌ఏటీ ఆర్డర్‌పై సుప్రీం స్టే సైరస్‌ మిస్త్రీని టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా పునర్నియమించాలన్న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్‌ ఆదేశాల్లో లోపాలున్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేసే పరిధి, అధికారం తనకు లేదని ట్రిబ్యునల్‌ మర్చిపోయినట్లుందని తెలిపింది. ఈ విషయమై లోతైన విచారణ సాగిస్తామని చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డె ఆధ్వర్యంలోని త్రిసభ్య బెంచ్‌ తీర్పునిచ్చింది. మిస్త్రీ తనను పునర్నియమించాలని

క్యూ3లో ఈ కంపెనీల లాభాలు జూమ్‌

Friday 10th January 2020

గత కేలండర్‌ ఏడాది(2019)లో దేశీ స్టాక్‌ మార్కెట్లు విభిన్న పనితీరు ప్రదర్శించాయి. ఓవైపు ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్‌, నిఫ్టీ 12 శాతం స్థాయిలో ర్యాలీ చేయగా.. మిడ్‌ క్యాప్‌ 4 శాతం, స్మాల్‌ క్యాప్‌ 9 శాతం చొప్పున డీలాపడ్డాయి. కాగా.. డిసెంబర్‌లో సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త గరిష్టాలను సైతం అందుకున్నాయి. అయితే ఇకపై మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు సైతం మెరుగైన రిటర్నులు అందించగలవన్న అంచనాలు ఇటీవల అధికమయ్యాయి.

Most from this category