STOCKS

News


లార్జ్‌క్యాప్స్‌ కంటే మిడ్‌క్యాప్స్‌ మిన్న!

Thursday 2nd January 2020
Markets_main1577957935.png-30619

ఈ ఏడాది స్మాల్‌ క్యాప్స్‌ టర్న్‌అరౌండ్‌?
రికవరీ వస్తుందన్న నమ్మకముంటే..లార్జ్‌ క్యాప్స్‌ కంటే మిడ్‌ క్యాప్స్‌లోనే అత్యధిక రిటర్నులు పొందవచ్చునంటున్నారు.. సుందరం మ్యూచువల్‌ ఫండ్‌ ఎండీ, సీఈవో సునీల్‌ సుబ్రమణ్యం. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతేడాది మార్కెట్ల తీరు, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో భారీ ర్యాలీ తదితర పలు అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు చూద్దాం..

ప్రధానంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధిపై ఆధారపడి కదులుతుంటాయి. ఈ ఏడాది జీడీపీ రికవరీ బాట పడుతుందని భావిస్తున్నాం. ఇటీవల కనిపిస్తున్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో హెచ్‌యూఎల్‌, ఐటీసీ, నెస్లే వంటి కంపెనీలు మార్కెట్‌ వాటాను పెంచుకుంటూ వచ్చాయి. అయితే ఒకప్పటి మిడ్‌ క్యాప్‌ కంపెనీలు కొన్ని నేడు లార్జ్‌క్యాప్స్‌గా ఆవిర్భవించాయి. ఇందువల్ల దీర్ఘకాలంలో పెట్టుబడులు, రిటర్నులను పరిగణిస్తే.. మిడ్‌ క్యాప్స్‌పట్ల వ్యతిరేకతను ప్రదర్శించలేము. ఒక మిడ్‌ క్యాప్‌ దశాబ్ద కాలంలోనూ మిడ్‌ క్యాప్‌గానే ఉంటే దీనిని గ్రేట్‌కంపెనీగా చెప్పలేము. పదేళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుత ఇండెక్స్‌లో అప్పటి మిడ్‌క్యాప్స్‌నకు చోటు లభిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో గెలుపు గుర్రాలతోపాటు.. విఫల కంపెనీలూ ఉంటాయి. ఎల్లవేళలా కన్సాలిడేషన్‌ జరుగుతూనే ఉంటుంది. సరైన సమయంలో పటిష్టమైన కంపెనీని ఎంచుకోవడంతోపాటు.. బిజినెస్‌లు భారీగా విస్తరించేవరకూ ఎదురుచూడవలసి ఉండొచ్చు! అప్పుడు మాత్రమే మిడ్‌ క్యాప్‌లో ఇన్వెస్ట్‌చేసి లార్జ్‌క్యాప్‌లో బయటపడేందుకు వీలుంటుంది!!

జీడీపీ జోరు చూపితే..
జీడీపీ నీరసించిన పరిస్థితుల్లో సిమెంట్‌, స్టీల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సైక్లికల్స్‌ వంటి రంగ కంపెనీలు వెనకడుగు వేస్తుంటాయి. ఆర్థిక వ్యవస్థ జోరు చూపుతుంటే ఈ రంగాలలోని మిడ్‌ క్యాప్స్‌.. లార్జ్‌ క్యాప్స్‌ను మించిన వృద్ధిని చూపుతుంటాయి. అయితే జీడీపీ పుంజుకోనున్న పరిస్థితుల్లో మాత్రమే మిడ్‌ క్యాప్స్‌వైపు దృష్టిసారించవలసి ఉంటుంది. ఇటీవలి వరకూ పలు దేశాల కేంద్ర బ్యాంకులు వ్యవస్థలోకి పంప్‌చేసిన సొమ్ము లార్జ్‌క్యాప్స్‌లోకి మాత్రమే ప్రవేశిస్తూ వచ్చింది. ఈ పెట్టుబడులు వృద్ధికి ఊతమిస్తే.. మిడ్‌ క్యాప్స్‌ వెలుగులోకి వస్తాయి. అలాకాకుండా అధిక లిక్విడిటీ పరిస్థితుల్లో రక్షణాత్మకంగా లార్జ్‌క్యాప్స్‌లోకి మాత్రమే పెట్టుబడులు ప్రవహిస్తుంటాయి.

స్టీల్‌.. ఓకే
అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార డీల్‌ కుదిరితే స్టీల్‌కు డిమాండ్‌ పెరిగే అవకాశముంటుంది. అంతర్జాతీయంగా రికవరీ కనిపిస్తే.. మెటల్‌ ధరలు మెరుస్తాయి. దీంతో స్టీల్‌ కంపెనీల బ్యాలన్స్‌ షీట్స్‌ బలపడతాయి. వీటికి జతగా సిమెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేర్లకు డిమాండ్‌ పుడుతుంది. రోడ్లు లేదా గృహ నిర్మాణాలు పెరిగితే ఈ రంగాలకు లబ్ది చేకూరుతుంది. దేశీయంగా గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ. 100 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించారు. ఇలాంటి అంశాలు ఈ రంగాలకు బూస్ట్‌నిచ్చే వీలుంది. 

బ్లూచిప్స్‌ మాత్రమే 
గత దశాబ్ద కాలంలో కొటక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, నెస్లే, పేజ్‌, ఐషర్‌, బాష్‌ వంటి కంపెనీలు భారీ రిటర్నులను ఇచ్చిన విషయం విదితమే. అయితే సంస్కరణల ఫలం కనిపించిన గత దశాబ్ద కాలంతో పోలిస్తే రానున్న దశాబ్దం విభిన్నంగా ఉండనుంది. మధ్యతరగతి ఆదాయాలు పెరగడం, వినియోగం పుంజుకోవడంతోపాటు.. జీవన వ్యయాలు పెరుగుతున్నాయి. దీంతో మ్యూచువల్‌ ఫం‍డ్స్‌, బీమా, టెలికం రంగాలు మరింత బలపడనున్నాయి. అయితే దేశీయంగా పొదుపు తరువాతే వినియోగానికి ప్రాధన్యత ఉంటుంది. దీంతో మారుతున్న జీవన విధానాల కారణంగా దేశీ కంపెనీలకే ఈ లబ్ది చేకూరాలని లేదు. ఇప్పటికే కనిపిస్తున్న టెలికం సర్వీసుల కన్సాలిడేషన్‌లో మిగిలిన కొద్దిపాటి దేశీ కంపెనీలే రానున్న దశాబ్దంలో లాభపడవచ్చు. కాగా.. మరోపక్క అత్యధికంగా హ్యాండ్‌సెట్లను విక్రయిస్తున్న చైనా కంపెనీలు ఆధిపత్యం చెలాయించవచ్చు. అయితే స్టాక్‌ మార్కెట్‌ వీటన్నిటినీ పట్టించుకోదు. దేశ ఆర్థిక వ్యవస్థ తీరు, తద్వారా లబ్ది పొందగల ఆయా రంగాల కంపెనీలపై మాత్రమే కన్నేస్తుంది!You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌ జోరు

Thursday 2nd January 2020

దేశీయ ఈక్విటీ మార్కెట్లో ప్రభుత్వరంగ షేర్లకు గురువారం భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.05శాతం పెరిగింది.  నేడు పీఎస్‌యూ ఇండెక్స్‌ 2,530.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం నుంచి లాభాల్లో కదలాడినప్పటికీ.., మిడ్‌సెషన్‌ కొనుగోళ్లు ఇండెక్స్‌ను మరింత పరుగులు పెట్టించాయి. ఒక దశలో ఇండెక్స్‌ 2.22శాతం వరకు పెరిగి 2582.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి

బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Thursday 2nd January 2020

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా బ్యాంకింగ్‌ షేర్లకు భారీగా లాభపడుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం మిడ్‌సెషన్‌కల్లా 0.75శాతం లాభపడింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 8,226.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఒక దశలో 0.60శాతం పెరిగి 32296.15 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం 1:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(32102.90)తో పోలిస్తే 0.50శాతం

Most from this category