STOCKS

News


మైక్రోసాప్ట్‌కు ‘యస్‌’.. ?

Tuesday 8th October 2019
Markets_main1570508642.png-28764

  • 15 శాతం వాటా విక్రయం 
  • రూ.2,000 కోట్ల నిధులు 
  • మైక్రోసాఫ్ట్‌కు డైరెక్టర్‌ పదవి 
  • ఈ వార్తలపై వ్యాఖ్యానించబోమన్న ఇరు సంస్థలు 

న్యూఢిల్లీ: తాజాగా పెట్టుబడులు సమకూర్చుకోవడం,  డిజిటల్‌ కార్యకలాపాల జోరును మరింత పెంచుకోవడం లక్ష్యంగా వ్యూహాత్మక భాగస్వామి కోసం యెస్‌ బ్యాంక్‌ అన్వేషిస్తోందని సమాచారం. దీంట్లో భాగంగా మైక్రోసాప్ట్‌ కార్పొరేషన్‌తో పాటు మరో రెండు అగ్రశ్రేణి దిగ్గజ కంపెనీలతో ఈ బ్యాంక్‌ సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..., మూడు వారాల క్రితం మొదలైన ఈ చర్చలు ఫలప్రదమైతే, 15 శాతం వాటాకు సమానమైన తాజా ఈక్విటీ షేర్లను ఆయా కంపెనీలకు యెస్‌ బ్యాంక్‌ జారీ చేస్తుంది. మైక్రోసాఫ్ట్‌తో యెస్‌బ్యాంక్‌ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అన్నీ అనుకూలిస్తే, యెస్‌ బ్యాంక్‌లో మైక్రోసాఫ్ట్‌  రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. మైక్రోసాఫ్ట్‌ ముందుకు వస్తే, ఈ బ్యాంక్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌, పేమెంట్‌ సిస్టమ్‌ ప్రణాళికలకు కూడా మరింత జోష్‌ వస్తుంది. అంతేకాకుండా ​మైక్రోసాఫ్ట్‌కు ఒక డైరెక్టర్‌ పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ వాటా విక్రయానికి ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ను కూడా యస్‌ బ్యాంక్‌ నియమించిందని, ఈ విషయాలన్నీ ఆర్‌బీఐకు తెలిసే జరుగుతున్నాయని సమాచారం.  కాగా ఈ విషయమై తామేమీ వ్యాఖ్యానించలేమని మైక్రోసాఫ్ట్‌, యెస్‌ బ్యాంక్‌  ప్రతినిధులు స్పష్టం చేశారు. 

నిధుల సమీకరణ సాధారణ విషయమే....
కాగా వ్యాపార అవసరాలకు కావలసిన మూలధనం సమీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని యెస్‌ బ్యాంక్‌ సోమవారం తెలిపింది. సెక్యూరిటీల జారీ ద్వారా ఇన్వెస్టర్లు, సంస్థల నుంచి మూలధనాన్ని సమీకరించడం సాధారణ విషయమేనని పేర్కొంది. వ్యాపార అవసరాలు, నియంత్రణ సంస్థల నిబంధనల పాటింపు కోసం నిధులు అవసరమని వివరించింది.  ఈ మేరకు స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు ఈ బ్యాంక్‌ వివరణ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్‌, పీఈ సంస్థల నుంచి నిధుల సమీకరించడానికి యెస్‌ బ్యాంక్‌ సంప్రదింపులు జరుపుతోందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యెస్‌ బ్యాంక్‌ను స్టాక్‌ ఎక్స్చేంజ్‌లు వివరణ కోరాయి. నిధుల సమీకరణ  కోసం వివిధ సంస్థలతో సంప్రదింపుల జరపడం సాధారణ విషయమేనని యెస్‌ బ్యాంక్‌ పేర్కొంది. అయితే మైక్రోసాఫ్ట్‌, ఇతర సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్న వార్తలు తమకు తెలియవని వివరించింది. ఇలాంటి వార్తలపై వ్యాఖ్యానించడం తమ విధానం కాదని పేర్కొంది. 
ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ నుంచి గానీ, వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ నుంచి గాని, దిగ్గజ వాణిజ్య కుటుంబం నుంచి గానీ నిధులు సమీకరించే అవకాశాలున్నాయంటూ యెస్‌ బ్యాంక్‌ గత వారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటీవలనే ఈ బ్యాంక్‌ క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ) విధానంలో రూ.1,930 కోట్ల నిధులు సమీకరించింది. 

8 శాతం ఎగసిన షేర్‌
గత ఏడాది ఆగస్టులో రూ.404గా ఉన్న షేర్‌ ధర ఏడాది కాలంలోనే దాదాపు 90 శాతం పతనమై ప్రస్తుతం రూ.42కు చేరింది. మొండి బకాయిలు భారీగా పెరగడం, ఇతర పాలనాపరమైన సమస్యల కారణంగా ఈ షేర్‌ ఈ స్థాయిలో పతనమైంది. ప్రస్తుత దశలో యస్‌ బ్యాంక్‌కు పెట్టుబడుల అవసరం తీవ్రంగా ఉంది. కాగా నిధుల కోసం  మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయన్న​ వార్తల కారణంగా యస్‌ బ్యాంక్‌ షేర్‌ సోమవారం జోరుగా పెరిగింది. స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయినా ఈ షేర్‌ 8 శాతం లాభంతో రూ. 45.60 వద్ద ముగిసింది. You may be interested

‘కాంటినెంటల్‌’ చేతులు మారుతుందా?

Tuesday 8th October 2019

‘పార్క్‌ వే’ ఎగ్జిట్‌కు ప్రమోటర్ల ప్రయత్నాలు అరబిందోతో చర్చలు... కుదరని డీల్‌ సొంతగా రుణాలు సమీకరించే అవకాశం తాజాగా చైనా హెల్త్‌కేర్‌ సంస్థ ఆసక్తి సింగపూర్‌, మలేసియాలకు చెందిన ‘పార్క్‌ వే పంటాయ్‌’ గ్రూపు నుంచి కాంటినెంటల్‌ ఆసుపత్రిని మళ్లీ తన చేతుల్లోకి తీసుకోవటానికి ప్రమోటరు డాక్టర్‌ గురునాథ్‌ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీన్లో భాగంగా ఇటీవల అరబిందో ఫార్మా ప్రమోటర్లను కలిసి చర్చించడంతో అంతా డీల్‌ కుదిరిందనే అనుకున్నా... సాకారం కాలేదు. తాజాగా

ఎస్‌బీఐ నుంచి డెబిట్‌కార్డ్‌ ఈఎంఐ 

Tuesday 8th October 2019

ముంబై: పండుగల సమయంలో ఎస్‌బీఐ తన కస్టమర్లకు డెబిట్‌ కార్డుపైనా ఈఎంపై సదుపాయాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 1500కు పైగా పట్టణాల్లోని స్టోర్లలో ఉన్న 4.5 లక్షల పైన్‌ల్యాబ్స్‌ బ్రాండ్‌ పీవోఎస్‌ మెషిన్ల వద్ద డెబిట్‌ ద్వారా ఈఎంఐ కింద కొనుగోళ్లు చేసుకోవచ్చని ఎస్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. 6 నెలల నుంచి 18 నెలల కాలానికి చెల్లించే ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. డాక్యుమెంటేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజులు ఉండవని, ఇందుకోసం బ్యాంకు శాఖలకు

Most from this category