News


సత్య నాదెళ్ల ప్యాకేజీ @ రూ. 305 కోట్లు

Friday 18th October 2019
Markets_main1571371106.png-28963

వాషింగ్టన్‌: సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గత ఆర్థిక సంవత్సరంలో 42.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 305 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 66 శాతం అధికం. నాదెళ్ల మూలవేతనం సుమారు 2.3 మిలియన్ డాలర్లే అయినప్పటికీ, ప్యాకేజీలో అత్యధిక భాగం (సుమారు 29.6 మిలియన్ డాలర్లు) స్టాక్‌ ఆప్షన్స్‌ కింద లభించింది. 2017-18లో సత్య నాదెళ్ల 25.8 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. "గత ఆర్థిక సంవత్సరం కంపెనీ అత్యంత మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించింది. దీనికి సత్య నాదెళ్ల సారథ్యం, కస్టమర్ల విశ్వాసం చూరగొనడానికి ఆయన చేసిన కృషి, కంపెనీలో ప్రవేశపెట్టిన కొత్త మార్పులు, కొంగొత్త టెక్నాలజీలు.. మార్కెట్లలోకి కార్యకలాపాలను విస్తరించడం వంటి అంశాలు తోడ్పడ్డాయి" అని మైక్రోసాఫ్ట్ తెలిపింది. హైదరాబాదీ అయిన సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 



You may be interested

ఫైనాన్షియల్‌ అసెట్స్‌ వైపు పెట్టుబడులు

Friday 18th October 2019

మొగ్గుచూపుతున్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ నివేదికలో వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వ్యక్తిగత ఇన్వెస్టర్లు తమ సంపదను వృద్ధి చేసుకోవడానికి విభిన్న సాధనాల వైపు దృష్టిసారిస్తున్నారు. స్థలాలు, భవనాలు, బంగారం వంటి భౌతిక ఆస్తులకంటే అధికంగా ఈక్విటీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా, ప్రావిడెంట్‌ ఫండ్‌, మ్యూచుఫల్‌ ఫండ్స్‌, ప్రైవేట్‌ ఈక్విటీ వంటి ఫైనాన్షియల్‌ అసెట్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ తన ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌-2019లో

దేశీ ఫార్మాకు ఎఫ్‌డీఏ జ్వరం..!

Friday 18th October 2019

- అమెరికా నియంత్రణ సంస్థ నుంచి పెరుగుతున్న వార్నింగ్‌ లెటర్స్‌ - ఈ ఏడాది ఇప్పటికే 12 అభ్యంతరాలు - ప్రత్యామ్నాయాలపై భారత కంపెనీల దృష్టి - ఇతర తయారీ సైట్ల విస్తరణపై కసరత్తు భారతీయ ఫార్మా కంపెనీలకు కామధేనువుగా ఉన్న అమెరికా... ఇప్పుడు చేదు గుళికలా మారుతోంది. అమెరికా కీలక మార్కెట్‌గా కార్యకలాపాలు సాగించే దేశీ ఫార్మా కంపెనీలకు అక్కడి ఔషధ రంగ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ)పరంగా చిక్కులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్లాంట్లలో తయారీ

Most from this category