News


టీసీఎస్‌ నుంచి ఇన్ఫీ వైపు మొగ్గుతున్న ఎంఎఫ్‌లు

Friday 8th November 2019
Markets_main1573202730.png-29450

దిగివచ్చిన వాల్యూషన్లే కారణం
బడా ఫండ్‌ మేనేజర్ల ఆసక్తి క్రమంగా టీసీఎస్‌ షేరు నుంచి ఇన్ఫోసిస్‌ షేరు వైపు మరలుతున్నట్లు కనిపిస్తోందని మ్యూచువల్‌ ఫండ్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు షేర్లూ ప్రతిఒక్కరూ తమ పోర్టుఫోలియోలో ఉంచుకోవాల్సినవేనని, కాకపోతే ప్రస్తుతం బడా ఇన్వెస్టర్ల మొగ్గు కొంతమేర ఇన్ఫీవైపు ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు. ఈ విషయాన్ని తాజా గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి. గత ఎనిమిది ట్రేడింగ్‌ సెషన్లలో ఇన్ఫీ షేరు దాదాపు 11 శాతం లాభపడగా, టీసీఎస్‌ షేరు దాదాపు అరశాతం నష్టంలో ఉంది. ఈ సమయంలో రూ. 620 కోట్ల విలువైన ఇన్ఫీ షేర్లు డెలివరీ కాగా, రూ. 480 కోట్ల విలువైన టీసీఎస్‌ షేర్లు మాత్రమే డెలివరీ అయ్యాయి. ఇటీవలి పతనం తర్వాత ఇన్ఫీ వాల్యూషన్లు చాలా ఆకర్షణీయంగా మారాయని, అందువల్ల ఎక్కువమంది ఈ షేరుపై ఆసక్తి చూపుతున్నారని కోటక్‌సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది.

ప్రస్తుతం ఇన్ఫీ షేరు తన ముందస్తు ఎర్నింగ్స్‌ అంచనాలకు 17 రెట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు డివిడెండ్‌ ఈల్డ్‌ 3.2 శాతం. ఇదే సమయంలో టీసీఎస్‌ షేరు తన ముందస్తు ఎర్నింగ్స్‌ అంచనాలకు 23 రెట్ల వద్ద ట్రేడవుతోంది. దీని డివిడెండ్‌ ఈల్డ్‌ 1.4 శాతం. దీనికితోడు ఇటీవల కంపెనీ ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణల కారణంగా ఇన్ఫీ షేరు భారీగా పతనమైంది. ఈపతనం కారణంగా టీసీఎస్‌, ఇన్ఫీ మధ్య వాల్యూషన్‌ డిస్కౌంట్‌ అంతరం 19 నుంచి 35 శాతానికి పెరిగింది. క్యు2లో ఇన్ఫీ మార్జిన్లు మెరుగుదల నమోదు చేయగా, టీసీఎస్‌ మార్జిన్లు తొమ్మది త్రైమాసికాల కనిష్ఠానికి పడిపోయాయి. ఇవన్నీ ఫండ్‌ మేనేజర్లు ఇన్ఫీ వైపు మొగ్గు చూపేందుకు కారణమయ్యాయి. 



You may be interested

పసిడికి తిరిగి డిమాండ్‌ పెరుగుతుంది!

Friday 8th November 2019

అధిక ధరలు కారణంగా బంగారు ఆభరణాలకు డిమాండ్‌ భారీగా తగ్గింది. తక్కువ కాలంలో ఇంత మొత్తంలో బంగారం ధరలు పెరగడం మొదటి సారిగా చూస్తున్నాం’ అని  వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఇండియా, ఎండీ, పీఆర్‌ సోమసుందరమ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. బంగారం కొనుగోళ్లు తగ్గాయి.. ధరలు అధికంగా పెరగడంతో బంగారం ఆభరణాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతోపాటు బంగారం ధరలు పెరిగినప్పుడు, దానిని సొమ్ము

31000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Friday 8th November 2019

మార్కెట్‌ ప్రారంభం ప్రైవేట్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా లాభాల బాట పట్టిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మిడ్‌ సెషన్‌ సమయానికి 31000 స్థాయికి ఎగిసింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30,571.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ప్రైవేట్‌ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్‌(3.75శాతం) లాభపడి జీవితకాల గరిష్టాన్ని అందుకోవడం, యస్‌బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 9శాతం నుంచి 4శాతం పెరగడం,

Most from this category