News


మ్యూచువల్‌ ఫండ్లు వాటాలు పెంచుకున్న షేర్లివే..!

Friday 7th February 2020
news_main1581067358.png-31599

మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) గతేడాది(2019) డిసెంబర్‌ చివరి నాటికి రూ. 3.15 లక్షల కోట్లు (13 శాతం వృద్ధి) పెరిగాయి. అంతక్రితం ఏడాది (2018)లో రూ. 23.62 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం పరిశ్రమ నిర్వహణ ఆస్తి.. గత డిసెంబర్‌ చివరినాటికి రూ. 26.77 లక్షల కోట్లకు చేరుకునట్లు గణాంకాలు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు బీఎస్‌ఈ500 కంపెనీల్లో 243 కంపెనీల్లో తమ వాటాను పెంచుకున్నాయి. వాటిలో అవంతీ ఫీడ్స్‌, జిందాల్‌ స్టీల్‌, గుజరాత్‌ గ్యాస్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, సెయిల్‌, అంబర్‌ఎంటర్‌ ప్రైజెస్‌ కంపెనీలున్నాయి. ఫండ్ మేనేజర్లు వాటాను పెంచుకున్న 50 శాతం కంపెనీలు 2019 సెప్టెంబర్ నుండి నష్టాలను చవిచూశాయి. దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, డిష్‌మెన్‌ కార్బోజెన్‌,  అరబిందో ఫార్మా, జీఈ పవర్‌, జస్ట్‌ డయల్‌, టీమ్‌లీజ్‌ కంపెనీ షేర్లు సెప్టెంబర్‌-జనవరి కాలంలో రెండంకెల నష్టాన్ని చవిచూశాయి. మరోవైపు అవంతీ ఫీడ్స్‌, జిందాల్‌ స్టీల్‌, పవర్‌, గుజరాత్‌ గ్యాస్‌, నారాయణ హృదయాలయ, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్సెల్‌ ప్రోప్యాక్‌ షేర్లు ఫండ్‌ మేనేజర్లకు లాభాలను పంచాయి

విస్తృత మార్కెట్లో పతనం తర్వాత  ఫండ్ మేనేజర్లు స్మాల్ & మిడ్‌క్యాప్ షేర్లలో నాణ్యమైన షేర్ల ఎంపికలో నిమగ్నమై ఉన్నారు. ఏడాదిలో ఈ స్మాల్‌ & మిడ్‌ క్యాప్‌ షేర్లు ఇన్వెస్టర్లకు ఎక్కువ లాభాల్ని పంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లు గడచిన రెండేళ్ల భారీగా నష్టాన్ని చవిచూశాయి. ఇప్పుడు కరెక్షన్‌ మోడ్‌ను బయటపడినట్లు కనిపిస్తుంది. ఆకర్షణీయమైన వాల్యూవేషన్లు, వృద్ధి ఆందోళనలను తగ్గముఖం పట్టడంతో  గత క్వార్టర్‌ నుంచి మంచి ప్రదర్శన కనపరుస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు. 

సెన్సెక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్లు కొన్న షేర్లివే...

ఇదే డిసెంబర్‌ క్వార్టర్‌లో ఫండ్‌ మేనేజర్లు సెన్సెక్స్‌లోని సుమారు 17 కంపెనీల షేర్లలో వాటాలను పెం‍చుకున్నారు. అందులో యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ అటో ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, హీరో మోటో కార్ప్‌, ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ మారుతి సుజుకీ షేర్లులున్నాయి. మరోవైపు ఇండెక్స్‌లో 12 షేర్లలో వాటాను తగ్గించారు. తగ్గించుకున్న షేర్లలో ఏషియన్‌ పేయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌, ఎంఅండ్‌ఎం, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, రిలయన్స్‌ షేర్లు ఉన్నాయి. 

 You may be interested

ఐఆర్‌సీటీసీ.. షేరుకి ‘తేజస్‌’

Friday 7th February 2020

ఐపీవో ధర రూ. 320 లిస్టింగ్‌ ధర రూ. 644 ప్రస్తుతం రూ. 1515(ఎన్‌ఎస్‌ఈ) ప్రభుత్వ రంగ సంస్థ.. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) లిమిటెడ్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యాక రేసు గుర్రంలా దౌడు తీస్తోంది. అందరి అంచనాలను మించుతూ షేరు పురోగమిస్తోంది. గురువారం (6న) ఇంట్రాడేలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 1563 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. చివరికి రూ. 1504 వద్ద ముగిసింది. ప్రస్తుతం 1 శాతం

52 వారాల గరిష్టానికి చేరిన షేర్లివే!

Friday 7th February 2020

శుక్రవారం 52 వారాల గరిష్టానికి 58 షేర్లు పెరిగాయి. వీటిలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌, అజంతా ఫార్మా, అల్‌కైల్‌ ఎమైన్స్‌ కెమికల్స్‌, అలెంబిక్‌ ఫార్మాస్యూటికల్స్‌, అర్మాన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బాటా ఇండియా, భారత్‌ రాస్‌యాన్‌, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, క్రియేటివ్‌ పెరిపెరల్స్‌ అండ్‌ డిస్ట్రీబ్యూషన్‌, ఎడెల్వీజ్‌ మ్యుచువల్‌ ఫండ్‌, ఈఐడీ ప్యారీ ఇండియా, ఎసాబ్‌ ఇండియా,

Most from this category