News


ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి ఇప్పుడు...?

Saturday 3rd August 2019
Markets_main1564771094.png-27508

నిఫ్టీ 11,981 నుంచి ఏకధాటిగా పడిపోతూ 11,000 పాయింట్లకు దిగవకు చేరిపోయింది. కేవలం 19 సెషన్లలోనే ఇది జరిగింది. దీంతో చాలా స్టాక్స్‌ విలువలు ఆకర్షణీయంగా మారాయి. దేశీయ అంశాల పాత్రే ఎక్కువగా ఉంటే, అంతర్జాతీయ అంశాలు కూడా మన మార్కెట్ల నష్టాలకు తోడయ్యాయి. అమెరికా ఫెడ్‌ వ్యాఖ్యలు, అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలన్న ఆసక్తితో ఉన్న వారు... ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలన్న విషయమై తర్జన భర్జనలు పడే అవకాశం లేకపోలేదు. ఇటువంటి వారు మ్యూచువల్‌ ఫండ్స్‌ యాక్టివిటీని గమనిస్తే సరిపోతుంది. 

 

మార్కెట్లో ఈ నష్టాలు ఇంకొంతకాలం కొనసాగుతాయని కొందరు, దాదాపుగా దిద్దుబాటు పూర్తయిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫండ్‌ మేనేజర్లు పెట్టుబడులు పెడుతున్న స్టాక్స్‌పై ఇన్వెస్టర్లు ఓ సారి దృష్టి సారించొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఫండ్‌ మనేజర్లు గడిచిన నాలుగు త్రైమాసికాలుగా (ఏడాది నుంచి) 180 కంపెనీల్లో తమ వాటాలను క్రమం తప్పకుండా పెంచుకుంటూనే ఉన్నారు. వీటిల్లో లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ 180 కంపెనీల్లో లార్జ్‌క్యాప్‌ కంపెనీలను ఈ సమయంలో పెట్టుబడులకు పరిశీలించడం అనిశ్చిత పరిస్థితుల్లో కాస్త సురక్షితంగా భావించొచ్చు. అలా చూసినప్పుడు... హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, కోటక్‌ మహింద్రా బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ ఉన్నాయి. 

 

ఇలాంటి సమయాల్లో ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో నాణ్యమైన స్టాక్స్‌ను కలిగి ఉండడం వివేకమైన చర్య అవుతుందంటున్నారు నిపుణులు. ‘‘అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత, నాణ్యమైన స్టాక్స్‌కు కట్టుబడి ఉండడం తప్పనిసరి. అందుకే మ్యూచువల్‌ ఫండ్స్‌ టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తదితర ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా సరైన విధానాన్ని అనుసరిస్తున్నాయి’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా తెలిపారు. ఈ తరహా కంపెనీలు కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో పారదర్శకంగా ఉంటాయని, ఫండమెంటల్స్‌ బలంగా ఉంటాయని, నిర్వహణ సామర్థ్యాలు కూడా పటిష్టంగా ఉంటాయన్నారు. స్మాల్‌, మిడ్‌క్యాప్‌లో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ను క్రమంగా కొనుగోలు చేసేట్టు అయితే దీర్ఘకాలం పాటు వేచి ఉండాలి. అప్పుడు బ్లూచిప్‌లతో పోలిస్తే మెరుగైన రాబడులు సాధించొచ్చు. ఈ జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, స్పైస్‌జెట్‌ ఉన్నాయి’’అని క్యాపిటల్‌ ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ రొమేష్‌ తివారీ తెలిపారు. You may be interested

రూ.148కే టర్మ్‌ప్లాన్‌

Saturday 3rd August 2019

ఎడెల్‌వీజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ మొబిక్విక్‌ భాగస్వామ్యంతో రూ.లక్ష నుంచి జీవిత బీమా పాలసీలను ఆఫర్‌ చేస్తోంది. మొబిక్విక్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా యూజర్లు గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవచ్చు. రూ.లక్ష, రూ.3 లక్షలు, రూ.5 లక్షల సమ్‌ అష్యూర్డ్‌తో ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి. రూ.లక్ష బీమాకు ఏడాదికి ప్రీమియం రూ.148. అదే రూ.3 లక్షల బీమాకు ప్రీమియం రూ.443, రూ.5 లక్షల బీమాకు ప్రీమియం రూ.738.

మార్కెట్లో మూడొంతుల కరెక్షన్‌ ముగిసినట్టే..!

Saturday 3rd August 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో పతనం కొనసాగుతుండగా... రూ.55,000 కోట్ల ఆస్తుల నిర్వహణ చూసే ప్రముఖ మనీ మేనేజర్‌ మాత్రం ప్రస్తుత మార్కెట్‌ కరెక్షన్‌లో అధిక భాగం ముగిసినట్టేనని అంచనా వేస్తున్నారు. ‘‘కంపెనీల ‍త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడం మార్కెట్‌ దిద్దుబాటుకు ప్రధాన కారణం. ఆర్థిక సేవల రంగంలో ఒత్తిళ్లు, ఆర్థిక రంగంలో డిమాండ్‌ మందగించడం, ముఖ్యంగా ఆటో రంగంలో’’అని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీఐవో సంపత్‌రెడ్డి తెలిపారు. బెంచ్‌ మార్క్‌

Most from this category