News


ఈ స్టాకులపై ఎంఎఫ్‌ల ఆసక్తి

Friday 14th June 2019
Markets_main1560508881.png-26302

ఎన్‌డీఏ ప్రభుత్వం రెండో దఫా పాలనా కాలంలో ఇన్‌ఫ్రాపై వ్యయాలు పెంచుతుందన్న అంచనాలున్నాయి. దీంతో అసెట్‌మేనేజర్లు ఈ రంగానికి చెందిన మేలైన కంపెనీలపై దృష్టి పెడుతున్నారు. దీంతో పాటు క్యాపిటల్‌గూడ్స్‌ రంగానికి చెందిన కంపెనీలపై సైతం ఎంఎఫ్‌లు మక్కువ చూపుతున్నాయి. మేనెల్లో ఇలా ఎంఎఫ్‌లకు మక్కువగా మారిన ఐదు కంపెనీల వివరాలు ఇలా ఉన్నాయి...
1. ఎల్‌అండ్‌టీ: మార్కెట్‌ క్యాప్‌ 2.12 లక్షల కోట్ల రూపాయలు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎంఎఫ్‌ కొనుగోలు చేసింది. కంపెనీ ఆర్డర్‌బుక్‌ బలంగా ఉండడం, పోర్టుఫోలియో వైవిధ్య భరితంగా ఉండడంతో ఎంఎఫ్‌లు ఈ స్టాకుపై మక్కువ చూపుతున్నాయి. వచ్చే మూడేళ్లకు ఆర్డర్లకు ఢోకాలేదు. దీంతోపాటు తీసుకున్న ఆర్డర్లను తక్కువ వ్యవధిలో పూర్తి చేస్తోంది. వచ్చే రెండేళ్లు ఎర్నింగ్స్‌లో 20 శాతం వరకు వృద్ధి ఉంటుందని అంచనా. 
2. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌: మార్కెట్‌క్యాప్‌ రూ. 91.1 వేల కోట్లు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌ కొనుగోలు చేసింది. బలమైన బ్రాండ్‌; దేశీ మార్కెట్లో విస్తృత అవకాశాలుండడం, వైవిధ్యభరిత ఉత్పత్తులు కంపెనీకి భారత్‌లో కలిసివచ్చే అంశాలు. పలు విభాగాల్లో బీమా ఉత్పత్తులను అందిస్తున్నందున వచ్చే పదేళ్లలో దీర్ఘకాలిక వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. కంపెనీ ఏయూఎం విలువ 1.25 లక్షల కోట్లుంది.
3. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌: రూ. 5280 కోట్ల మార్కెట్‌క్యాప్‌. హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ కొనుగోలు చేసింది. దాదాపు 12వేల కోట్లరూపాయలకు పైచిలుకు ఆర్డర్‌బుక్‌తో అధిక ఆదాయఅవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నాలుగేళ్ల వరకు ఆర్డర్‌బుక్‌ నిండిపోయింది. కంపెనీ అనుసరించే బిజినెస్‌ మోడల్‌ విజయవంతమైనదిగా ఫండ్‌మేనేజర్లు భావిస్తున్నారు. కొత్త ఏడాది మరింత ఎక్కువ ఆర్డర్లు పొందవచ్చని అంచనా.
4. భెల్‌: మార్కెట్‌ క్యాప్‌ రూ. 24వేల కోట్లు. హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ కొనుగోలు చేసింది. క్యాపెక్స్‌ సైకిల్‌లో రివైవల్‌ వస్తుందన్న అంచనాలున్నాయి. విద్యుత్‌, పారిశ్రామిక మెషనరీలో అగ్రగామి ఈపీసీ కంపెనీ. థర్మల్‌పవర్‌ క్యాపెక్స్‌లో పూర్వవైభవం రాబోతుండడం కంపెనీకి కలిసివచ్చే అంశం. బడా ప్రాజెక్టులను తక్కువ పోటీతో చేజిక్కించుకునే సత్తా కంపెనీకి ఉంది.
5. బీఈఎల్‌: మార్కెట్‌క్యాప్‌ రూ. 27వేల కోట్లు. రిలయన్స్‌ నిప్పన్‌ ఏఎంసీ కొనుగోలు చేసింది. డిఫెన్స్‌, రాడార్లు, అంతర్గత సెక్యూరిటీ, నౌకా యానం, టెలికం తదితర పలు రంగాలకు చెందిన కీలక వస్తువులను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. గత త్రైమాసిక ఫలితాలు అంచనాలను దాటాయి. స్టాకు ప్రస్తుతం ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద కొనసాగుతోంది. కంపెనీకి రూ. 52వేల కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ ఉంది. వచ్చే ఏడాది 15 శాతం ఎర్నింగ్స్‌ వృద్ధి అంచనా.


 You may be interested

11900ల దిగువన ముగిసిన నిఫ్టీ

Friday 14th June 2019

మార్కెట్‌ ఈ వారం చివరిరోజైన శుక్రవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 289 పాయింట్ల నష్టంతో 39,452.07 వద్ద, నిఫ్టీ 90.75 పాయింట్లను నష్టపోయి 11,823.30 వద్ద ముగిసింది. శుక్రవారం అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలకు నేడు టోకు ద్రవ్యోల్బణ గణాంకాల

ఆరు షేర్లపై మోర్గాన్‌స్టాన్లీ ఓవర్‌వెయిట్‌

Friday 14th June 2019

దేశీయ మార్కెట్లో ఆరు స్టాకులపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు దిగ్గజ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. 1. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌: టార్గెట్‌ రూ. 1525. డొమినాస్‌ పిజ్జామేకరైన ఈ సంస్థ లాంగ్‌టర్మ్‌ వృద్ధిపై ధీమాగా ఉంది.వ్యయ నియంత్రణకు సాంకేతికాభివృద్ధిని వినియోగిస్తోంది. బంగ్లాదేశ్‌లో విస్తరణపై నమ్మకంగా ఉంది. 2. యాక్సిస్‌బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 1100. దేశీయ వృద్ధి బలంగా 15- 18 శాతం వరకు ఉండొచ్చు. కాస్ట్‌ రేషియో మెరుగుదల సరైన దిశలోనే ఉంది. వచ్చే

Most from this category