STOCKS

News


ఈ స్టాక్స్‌పై ఓ సారి లుక్కేయండి..!

Thursday 15th August 2019
Markets_main1565813315.png-27768

గత నెలలో కేంద్ర బడ్జెట్‌ సమర్పణ నాటి నుంచి స్టాక్‌ మార్కెట్లు కరెక్షన్‌ బాట పట్టాయి. గరిష్టాల నుంచి నిఫ్టీ 10 శాతం నష్టపోయింది. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమన పరిస్థితుల్లోకి వెళ్లినట్టు ఆర్‌బీఐ సైతం పేర్కొనగా, అటు అంతర్జాతీయ ఆర్థిక రంగం పరిస్థితులు మరింత భయపెట్టేలా ఉన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయంటూ అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనించేందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఈ దిశగా ఇతర సంకేతాలు కూడా కనిపిస్తున్నాయని ఇటీవలే హెచ్చరించింది. మన మార్కెట్లలో నిఫ్టీ-50 బాస్కెట్‌ సహా మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లో మెజారిటీ షేర్లు తీవ్రంగా నష్టాల్లోనే ఉన్నాయి. 30-80 శాతం మధ్యలో వాటి జీవిత గరిష్టాల నుంచి పతమయ్యాయి. ఈ నేపథ్యంలో నాణ్యమైన స్టాక్స్‌ను ఎంపిక చేసుకుని దీర్ఘకాలానికి (మూడేళ్లు అంతకంటే ఎక్కువ) క్రమంగా కొంటూ వెళ్లడం ఇప్పుడు స్టార్ట్‌ చేయవచ్చంటున్నారు నిపుణులు. 

 

ఇలా చూసుకున్నప్పుడు ఏ స్టాక్స్‌ కొనుగోలు చేయాలన్న సందేహం రావచ్చు. అటువంటి సందర్భాల్లో గత నాలుగు త్రైమాసికాలుగా అంటే ఏడాది కాలంగా మ్యూచువల్‌ ఫండ్స్‌, విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) క్రమంగా తమ వాటాలను పెంచుకుంటూ వెళుతున్న స్టాక్స్‌ను ఓ సారి పరిశీలించాల్సిందే.

కంపెనీ                       మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా    ఎఫ్‌ఐఐల వాటా(జూన్‌ నాటికి) శాతంలో


ఏషియన్‌ పెయింట్స్‌                                   4.74                  16.65
ఏయూ స్మాల్‌ఫైనాన్స్‌                               11.22                   24.69
బజాజ్‌ కన్జ్యూమర్‌                                     8.61                   24.52
కెపాసిట్‌ఇన్‌ఫ్రా                                         6.74                   7.89
జీఎఫ్‌ఎల్‌                                                5.08                   4.80
హెచ్‌డీఎఫ్‌సీ                                            7.99                   74.69
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంకు                                2.94                   13.75
ఇండియన్‌ ఎనర్జీ                                      9.48                   19.57
ఇన్‌సెక్టిసైడ్స్‌ఇండియా                               9.24                    3.75
మిశ్రధాతునిగమ్‌                                      9.98                    0.58
ఎన్‌హెచ్‌పీసీ                                            3.24                     4.92
తేజాస్‌ నెట్‌వర్క్స్‌                                    12.27                   26.29
టోరెంట్‌ పవర్‌                                         12.11                     7.91
వరుణ్‌ బెవరేజెస్‌                                       6.40                   14.21
డబ్ల్యూపీఐఎల్‌                                          5.97                     0.46
జీఎంటర్‌టైన్‌మెంట్‌                                    6.32                    47.07

 

మార్కెట్‌ పరిస్థితులు ఏడాదిన్నరగా తీవ్ర అస్థిరతలతో ఉన్నప్పటికీ ఇవేవీ మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎఫ్‌ఐఐలను ఈ స్టాక్స్‌లో వాటాలు పెంచుకోకుండా అడ్డుపడలేదు. మరి సాధారణ ఇన్వెస్టర్లు ఎందుకు మార్కెట్‌ భయపడి దూరంగా ఉండిపోవాలి...? కాకపోతే తగిన అవగాహన, అధ్యయనంతో నాణ్యమైన స్టాక్స్‌లోనే దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టుకోవడం సురక్షితమని గ్రహించాలి. ‘‘చాలా స్టాక్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా పెరగడం అన్నది... వాటి త్రైమాసిక పనితీరు బాగుండడం, మంచి యాజమాన్యం, ప్రమోటర్ల పనితీరు, ఆయా రంగాల్లో మార్కెట్‌ వాటా, దీర్ఘకాలానికి బలమైన వృద్ధి అవకాశాలు ఉండడం వల్లే’’ అని రెలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. మార్కెట్లో కరెక్షన్‌ చోటు చేసుకున్నా గానీ, దీర్ఘకాల సగటు ప్రకారం చూస్తే ఇంకా అధిక వ్యాల్యూషన్‌లోనే (2020 ఎర్నింగ్స్‌ ప్రకారం 18.2రెట్ల వద్ద) ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొంది. గత మార్చి త్రైమాసికం, జూన్‌ త్రైమాసికాల్లో బలమైన నిర్వహణ పనితీరు చూపించిన కంపెపెనీలపై దృష్టి సారించొచ్చని, బలహీన ఆర్థిక పరిస్థితుల్లోనూ ఆయా కంపెనీల సామర్థ్యానికి అది నిదర్శనమని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీఐవో అనిల్‌ సరిన్‌ పేర్కొన్నారు. You may be interested

ఆర్థిక ​ఉద్దీపన చర్యలుంటాయి: ప్రధాని

Thursday 15th August 2019

దేశ ఆర్థిక పరిస్థితులను గురించి, వివిధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి గురువారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తన స్వాతంత్ర దినోత్సవ  ప్రసంగంలో మాట్లాడారు. వృద్ధి మందగమనాన్ని తగ్గించడానికి ఒక ఉద్ధీపన పథకాన్ని సిద్ధం చేయడంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నిమగ్నమయ్యిందని వివరించారు. ఈ ఉద్దీపన ప్యాకేజీలో డిమాండ్ పెంచడానికి ప్రోత్సాహకాలు, కొన్ని పరిశ్రమలకు సంబంధించి-నిర్దిష్టమైన చర్యలు, సూపర్ రిచ్ సర్‌చార్జ్ నుంచి విదేశి పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఉపశమనం కలిగించే చర్యలుండవచ్చని

మంచి షేర్లు మల్టీబ్యాగర్లవుతాయి..

Wednesday 14th August 2019

ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పడిపోయిన ప్రతి స్టాకు తిరిగి కోలుకోలేకపోవచ్చని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రె‍సిడెంట్‌, రిసెర్చ్‌ హెడ్‌ జగన్నాథం తునుగుంట్ల ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఆర్థిక ఉద్దీపనల కోసం వేచి ఉన్నాం.. మార్కెట్‌ 11,000 దిగువకు పడిపోయాయి. విదేశి సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ)లపై అధిక పన్నులు విధించడం, మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, బలహీన రుతుపవనాలు,

Most from this category