News


మెట్రోపోలిస్‌- యూఎస్‌ఎల్‌... జూమ్‌

Friday 7th February 2020
Markets_main1581061663.png-31596

4 శాతం ఎగసిన మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌
52 వారాల గరిష్టానికి యునైటెడ్‌ స్పిరిట్స్‌

వరుసగా నాలుగు రోజులపాటు దూకుడు చూపిన దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. మధ్యాహ్నం 1.15 ప్రాంతంలో సెన్సెక్స్‌ 157 పాయింట్లు క్షీణించి 41,149కు చేరగా.. నిఫ్టీ 38 పాయింట్లు తక్కువగా 12,100 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఫార్మా రంగ కంపెనీ మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో ర్యాలీ బాటలో సాగుతున్న లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ రూ. 42 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 35 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం 17 శాతం పెరిగి రూ. 223 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 23 శాతం ఎగసి రూ. 63 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు 26.84 శాతం నుంచి 28.17 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 1649 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1675 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో పటిష్ట ఫలితాలు సాధించడంతో వరుసగా ఏడో రోజు యునైటెడ్‌ స్పిరిట్స్‌ కౌంటర్‌ జోరం‍దుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 678 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 692 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. వెరసి ఈ నెలలో ఇప్పటివరకూ 11 శాతం లాభపడింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3లో యునైటెడ్‌ స్పిరిట్స్‌ రూ. 235 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 15 శాతం అధికంకాగా.. పన్నుకు ముందు లాభం 8 శాతం పెరిగి రూ. 290 కోట్లను తాకింది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 2 శాతంపైగా బలపడి 16.4 శాతానికి చేరాయి.



You may be interested

జీడీపీ వృద్ధిలో బ్యాంకింగ్‌ వ్యవస్థదే కీలక పాత్ర

Friday 7th February 2020

 టీసీఎస్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ రాజేష్‌ గోపినాథన్‌ భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ భవిష్యత్తులో పెద్దపెద్ద సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని టీసీఎస్‌ చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌ రాజేష్‌ గోపినాథన్‌ అన్నారు. ఐబీఏ టెక్నాలజీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశారు. పెను సవాళ్లు ఎదురైనప్పటికీ వచ్చే దశాబ్దంలో భారత బ్యాంకింగ్‌ వ్యస్థ భారీ వృద్ధిని సాధిస్తుందని ఆకాంక్షించారు. వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధిని సాధించే కంపెనీలు కొన్ని

టాటామోటర్స్‌ జేఎల్‌ఆర్‌కు కరోనా వైరస్‌ కష్టాలు

Friday 7th February 2020

చైనాలో జేఎల్‌ఆర్‌ ప్లాంట్‌ మూసివేత మార్చి 31లోగా బీఎస్‌-VI వాహనాలు అందుబాటులోకి కష్టమే: పవన్ గోయెంకా మార్చి 31లోగా బీఎస్‌-VI వాహనాలు అందుబాటులోకి కష్టమే: ఎంఅండ్‌ఎం చైనాలో కరోనా వ్యాధి వ్యాప్తితో టాటా మోటర్స్‌ కంపెనీ జేఎల్‌ఆర్‌ వాహన ఉత్పత్తులపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. టాటా మోటర్స్‌,  చైనా కంపెనీ చెర్రీ.. జాయింట్‌వెంచర్‌గా ఏర్పాటుచేసిన జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ ప్లాంట్‌ చైనాలోని షాంఘై నగర సరిహద్దుల్లో కేంద్రీకృతమై ఉంది. ఈ ప్రాంతం కరోనా వైరస్‌ పుట్టికొచ్చిన

Most from this category