STOCKS

News


వెలుగులో మెటల్‌ షేర్లు ..!

Tuesday 15th October 2019
Markets_main1571133663.png-28900

మెటల్‌ షేర్లు మంగళవారం మిడ్‌సెషన్‌ నుంచి లాభాల బాట పట్టాయి. గతవారంలో జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాతో చైనా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం సరైందేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ ప్రకటనతో మార్కెట్‌ వర్గాలకు వాణిజ్య యుద్ధంపై కొంతమేర అనిశ్చితి తొలిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్‌ షేర్లు ఒక్కసారిగా లాభాల బాటపట్టాయి. ఆ సానుకూల ప్రభావంతో నేటి మిడ్‌సెషన్‌ నుంచి మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3శాతం వరకు పెరిగింది. మధ్యాహ్నం గం.3:00ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,360.20)తో పోలిస్తే 1.62 శాతం(40 పాయింట్లు) పెరిగి 2,398.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమాయనికి ఇండెక్స్‌లో అత్యధికంగా హిందూస్థాన్‌ కాపర్‌ 4.61శాతం పెరిగింది. వేదాంత, జిందాల్‌ స్టీల్‌, ఎన్‌ఎండీసీ షేర్లు 4శాతం ర్యాలీ చేశాయి. నాల్కో, ఏపిఎల్‌ అపోలో, సెయిల్‌ షేర్లు 3శాతం, సెయిల్‌ 2.50శాతం, హిందాల్కో, వెల్‌స్పన్‌ కార్ప్‌ షేర్లు 2శాతం లాభపడ్డాయి. టాటా స్టీల్‌, షేర్లు 1శాతం, కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు అరశాతం పెరిగాయి. మెయిల్‌ షేర్లు 1శాతం నష్టపోగా, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, రత్నమణి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ లిమిటెడ్‌ షేర్లు 1శాతం క్షీణించాయి.



You may be interested

షార్ట్‌టర్మ్‌కు ఏడు సిఫార్సులు

Tuesday 15th October 2019

వచ్చే మూడు, నాలుగు వారాల్లో 10 శాతం వరకు రాబడినిచ్చే ఏడు స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. రెలిగేర్‌ బ్రోకింగ్‌ అనలిస్టు అజిత్‌ మిశ్రా సిఫార్సులు 1. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 120... 10 శాతం అప్‌సైడ్‌ ఛాన్స్‌. 2. గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 740... ఏడు శాతం అప్‌సైడ్‌ ఛాన్సులు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు నందీశ్‌ షా రికమండేషన్లు 1. బ్రిటానియా ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ.

39 షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌!

Tuesday 15th October 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 39 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో రైల్‌వికాస్‌నిగమ్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఆర్‌ఈసీ తదితర పీఎస్‌యూలతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, టాటామోటర్స్‌, ఐసీఐసీఐ లుంబార్డ్‌, స్ట్రైడ్స్‌ ఫార్మా, ఫ్యూచర్‌ రిటైల్‌; ఐబీ రియల్‌ఎస్టేట్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌

Most from this category