News


మెటల్‌ షేర్లలో అమ్మకాలు: జిందాల్‌ స్టీల్‌ 5శాతం డౌన్‌

Wednesday 26th February 2020
Markets_main1582696925.png-32102

అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గడంతో దేశీయంగానూ మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. కరోనా వైరస్‌ వ్యాధితో చైనాలో మెటల్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గింది. దీంతో నేటి మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు మెటల్‌ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపారు. ఒక దశలో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌  1.58శాతం నష్టపోయి 2431 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ మునుపటి మగింపు(2470)తో పోలిస్తే 1.30శాతం నష్టంతో 2439 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 5శాతం నష్టాన్ని చవిచూసింది. మెయిల్, హిందాల్కో షేర్లు 3శాతం, హిందూస్థాన్‌ జింక్‌ షేరు 2.50శాతం, హిందూస్థాన్‌ కాపర్‌ 2శాతం, నాల్కో, ఎన్‌ఎండీసీ, సెయిల్‌ షేర్లు 1.50శాతం నష్టపోయాయి. టాటా స్టీల్, ఏపిల్‌ అపోలో టైర్స్, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు 1శాతం, రత్నమనిట్యూబ్స్‌ అండ్‌ టైర్స్‌ షేర్లు అరశాతం పతనమైంది. మరోవైపు ఇదే రంగానికి చెందిన వెల్‌స్పన్‌ కార్ప్‌ షేరు 2శాతం లాభపడింది. వేదాంత, కోల్‌ ఇండియా షేర్లు స్వల్పంగా 0.10శాతం పెరిగాయి. 
 You may be interested

దేశీ మార్కెట్‌ వైపు గ్లోబల్‌ ఫండ్స్‌ చూపు!

Wednesday 26th February 2020

కరోనా ప్రభావం తక్కువగా ఉండడమే కారణమంటున్న నిపుణులు కరోనా వైరస్‌ ప్రభావం ఇండియా మార్కెట్‌పై పెద్దగా ఉండదని భావిస్తున్న విదేశీ మదుపరులు, గ్లోబల్‌ ఫండ్స్‌ తమ పెట్టుబడులను భారత మార్కెట్లోకి మరలిస్తున్నాయి. భారత మార్కెట్‌ ఎక్కువగా స్థానిక అంశాలపై ఆధారపడుతుందని, ప్రస్తుతం ఇక్కడ ఎకానమీలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని ఈస్ట్‌ స్ప్రింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, నార్త్‌కేప్‌ క్యాపిటల్‌లాంటి సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా చైనాలో దాదాపు మూడువేలమంది మరణించారు. ఈ

ఇండియా సిమెంట్స్‌, నవీన్‌ ఫ్లోరిన్‌- యమస్పీడ్‌

Wednesday 26th February 2020

14 శాతం జంప్‌చేసిన ఇండియా సిమెంట్స్‌ 10 శాతం దూసుకెళ్లిన నవీన్‌ ఫ్లోరిన్‌ షేరు కరోనా వైరస్‌ విస్తరించవచ్చన్న ఆందోళనలతో అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) అప్రమత్తతను ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పతన బాట పట్టాయి. వరుసగా రెండు రోజుల్లో అమెరికా మార్కెట్లు 6 శాతం కుప్పకూలగా.. దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 289 పాయింట్లు పతనమై 39,992కు చేరగా.. నిఫ్టీ 84 పాయింట్ల క్షీణతతో 11,714

Most from this category