News


లాభాల్లో మెటల్‌ షేర్లు

Thursday 12th December 2019
news_main1576131550.png-30190

లాభాల మార్కెట్లో మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. దీంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 2శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మెటల్‌ షేర్లకు ప్రాతనిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 2,525.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొనడంతో ఇండెక్స్‌ ఒక దశలో 2శాతం లాభపడి 2559.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు (2,509.55)తో పోలిస్తే 1.70శాతం లాభంతో 2,552.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ ఇండెక్స్‌లో ఒక్క జిందాల్‌ స్టీల్‌ తప్ప మిగిలిన షేర్లన్ని లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా వేదాంత షేరు 3.50శాతం లాభపడింది. ఏపిల్‌ అపోలో, సెయిల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2.50శాతం పెరిగాయి. ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ జింక్‌, నాల్కో షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. మెయిల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, రత్నమని లిమిటెడ్‌, కోల్‌ ఇండియా షేర్లు అరశాతం పెరిగాయి. 



You may be interested

ఇన్ఫీపై యూఎస్‌లో దావా దాఖలు!

Thursday 12th December 2019

దేశీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌పై అమెరికాకు చెందిన షేర్‌హోల్డర్ల పరిరక్షణ న్యాయసలహా సంస్థ ద స్కాల్‌ లాఫరమ్‌ క్లాస్‌ యాక‌్షన్‌ సూట్‌ దాఖలు చేసింది. ఇన్ఫీ తన ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించి నష్టాలు వచ్చేలా చేసిందని దావాలో ఆరోపించింది. ఇన్ఫోసిస్‌ షేర్లను 2018 జూలై 7 నుంచి 2019 అక్టోబర్‌ 20 మధ్యలో కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు తమను ఈ నెల 23లోపు సంప్రదించి దావాలో భాగస్వామ్యులు కావచ్చని ప్రకటించింది.

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బంపర్‌ లిస్టింగ్‌

Thursday 12th December 2019

గురువారం ఉజ్జీవన్‌ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేర్లు స్టాక్‌ ఎక్చేంజ్‌లో లిస్టయ్యాయి. ఇష్యూధర కన్నా 56.76 శాతం అధిక ప్రీమియంతో బీఎస్‌ఈలో ఈ షేర్లు రూ. 58 వద్ద లిస్టయ్యాయి. షేరు ఇష్యూధర రూ. 37. ఎన్‌ఎస్‌ఈలో షేరు 58.78 శాతం ప్రీమియంతో రూ. 58.75 వద్ద లిస్టయింది. అనంతరం గరిష్ఠంగా రూ. 62.80 వరకు దూసుకుపోయింది. ఐపీఓ ద్వారా బ్యాంకు రూ. 750 కోట్లు సమీకరించింది. గత రెండేళ్లలో వచ్చిన

Most from this category