News


ట్రేడ్‌ డీల్‌ పై ఆశలతో మెటల్‌ షేర్లకు డిమాండ్‌

Thursday 26th December 2019
Markets_main1577339976.png-30450

అమెరికా, చైనాల మధ్య ట్రేడ్‌ డీల్‌ ఒప్పందంపై ఆశలతో గురువారం మెటల్‌ షేర్లకు గిరాకీ నెలకొంది. ఫలితంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గురువారం ఉదయం సెషన్‌లో 1శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,725.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా, చైనాల మధ్య కుదిరిన మొదట దశ వాణిజ్య ఒప్పందంపై జనవరి మొదటివారంలో ఇరుదేశాధ్యక్షులు సంతకాలు పెడతారనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. అక్కడి నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మెటల్‌ షేర్లు నేడు మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ర్యాలీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రంగానికి చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సెయిల్‌, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, హిందూస్థాన్‌ జింక్‌ షేర్ల ర్యాలీ కారణంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఒక దశలో 1శాతం పెరిగి 2,750.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,723.15)తో పోలిస్తే 2,746.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో హిందూస్థాన్‌ కాపర్‌ 3శాతం, నాల్కో 2.50శాతం, సెయిల్‌, జిందాల్‌ స్టీల్‌, వేదాంత షేర్లు 2శాతం పెరిగాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఎన్‌ఎండీసీ షేర్లు 1.50 ర్యాలీ చేశాయి. హిందూస్థాన్‌ జింక్‌, మొయిల్‌, హిందాల్కో షేర్లు 1శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌, కోల్‌ ఇండియా షేర్లు 1శాతం నుంచి వరకు నష్టపోయాయి.  



You may be interested

సిటీగ్రూప్‌ డౌన్‌గ్రేడ్‌తో యస్‌ బ్యాంక్‌ డౌన్‌

Thursday 26th December 2019

ఓవైపు యస్‌ బ్యాంక్‌ బాండ్ల రేటింగ్‌ను బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేయగా.. మరోవైపు విదేశీ సంస్థ సిటీ షేరు టార్గెట్‌ ధరలో కోత పెట్టింది. దీంతో యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో యాక్టివిటీ పెరిగింది. గురువారం ట్రేడింగ్‌లో ఉదయం 11కే ఈ కౌంటర్లో 2.29 కోట్ల షేర్లు చేతులు మారినట్లు మార్కెట్‌ వర్గాలు తెలియజేశాయి. 11.40 ప్రాంతంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ. 50.65 వద్ద ట్రేడవుతోంది.

ఆదాయపన్నులో కోత, శ్లాబ్‌ల్లో మార్పులు...?!

Thursday 26th December 2019

పలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌పై అంచనాలు ఫిబ్రవరిలో వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌ వచ్చే ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే పలు రంగాల నిపుణులు, కంపెనీల ప్రతినిధులు తదితరుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై పరిశీలన చేపట్టారు. ఈ బాటలో ప్రతి బడ్జెట్‌లోనూ మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపే ఆదాయపన్ను శ్లాబులపైనా చర్చ జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు.

Most from this category