News


ఇకపై మెటల్‌ షేర్లకు డిమాండ్‌?

Friday 3rd January 2020
Markets_main1578033678.png-30647

సాధారణంగా వర్ధమాన మార్కెట్లకూ, కమోడిటీలకు పటిష్ట బంధం ఉంటుంది. ఇవి ఒకే విధమైన కదలికలకు లోనవుతుంటాయి. వెరసి ఇకపై అటు వర్ధమాన స్టాక్‌ మార్కెట్లతోపాటు.. ఇటు మెటల్‌ కౌంటర్లు జోరు చూపే వీలున్నదంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు! బుల్‌ ట్రెండ్‌, సాంకేతిక అంశాలు.. తదితర పలు విషయాలపై విశ్లేషకుల స్పందన తీరిలా..

బుల్‌ జోరు చూపే మార్కెట్లలో ప్రతిసారీ చోటుచేసుకునే దిద్దుబాట్లు(కరెక్షన్లు) ర్యాలీ బలాన్ని ప్రతిబింబిస్తాయి. 2019 ఆగస్ట్‌ తదుపరి వచ్చిన కరెక్షన్లు స్వల్ప కాలానికే పరిమితమయ్యాయి. దీంతో మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరుతూ వచ్చాయి. ఈ బాటలో గత వారం కనిపించిన అప్‌ట్రెండ్‌ మార్కెట్ల ప్రస్తుత బలాన్ని సూచిస్తోంది. అయితే కొన్ని హెవీవెయిట్స్‌ మాత్రమే మార్కెట్లను నడిపిస్తూ వచ్చాయి. గత మూడు నెలల్లో నిఫ్టీ పలు అవరోధాలను అధిగమించడం ద్వారా ఆల్‌టైమ్‌ హై సాధించింది. ఇందుకు బ్యాంక్‌ నిఫ్టీ, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఆర్‌ఐఎల్‌ తదితర దిగ్గజాలు సహకరించాయి. అయితే ఇటీవల ఎంఎస్‌సీఐ వరల్డ్‌ ఇండెక్స్‌తోపాటు.. డాలరు ఇండెక్స్‌ 99 స్థాయి నుంచి బలహీనపడుతూ వస్తున్నాయి. ఈ పరిణామం ఇకపై వర్ధమాన మార్కెట్లు పుంజుకుంటాయన్న సంకేతాలు ఇస్తోంది.

మెటల్‌ బ్లూచిప్స్‌ జోరు
సాధారణంగా వర్ధమాన మార్కెట్లు బలపడితే.. కమోడిటీలకూ డిమాండ్‌ పుడుతుంది. ఈ బాటలో ఇటీవల నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌, నిఫ్టీ రేషియో సాంకేతికంగా బ్రేకవుట్‌ సాధించింది. వెరసి తాజాగా టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌ కౌంటర్లలో కనిపిస్తున్న ర్యాలీ కొనసాగే అవకాశముంది.You may be interested

తొలి త్రైమాసికానికి 8 రికమండేషన్లు

Friday 3rd January 2020

కొత్త ఏడాది తొలి త్రైమాసికం చివరకు(మార్చి చివరకల్లా) మంచి రాబడిని అందించే ఎనిమిది షేర్లను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. 1. సుదర్శన్‌ కెమికల్స్‌: టార్గెట్‌ రూ. 470. ఐఐఎఫ్‌ఎల్‌ సిఫార్సు. క్రమానుగత వృద్దిని సాధిస్తూ వస్తోంది. మార్కెట్‌ వాటా పెంచుకుంటూ ప్రస్తుతం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద పిగ్‌మెంట్‌ ఉత్పత్తిదారుగా అవతరించింది. అంతర్జాతీయంగా రెండు బడా కంపెనీలు ఈ వ్యాపారం నుంచి తప్పుకోవడం కంపెనీ మరింత ఎదిగేందుకు దోహదం చేయనుంది.  2. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌:

బ్యాంకుల నెత్తిన రూ. 30వేల కోట్ల భారం!

Friday 3rd January 2020

పెరగనున్న మొండిపద్దుల కేటాయింపులు కొత్త ఏడాదిని దేశీయ బ్యాంకులు దాదాపు రూ. 30వేల కోట్ల ప్రొవిజన్ల కేటాయింపుతో ఆరంభించనున్నాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, రిలయన్స్‌ అనీల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలు, సీసీడీ, సీజీ పవర్‌ కంపెనీలకు ఇచ్చిన రుణాలకు సంబంధించి బ్యాంకులు ఈ మొత్తాన్ని తమ పద్దు పుస్తకాల్లో కేటాయించాల్సిఉంటుంది. వీటిలో ఏ అకౌంట్‌కు సంబంధించి ఇంతవరకు సెటిల్‌మెంట్‌ జరగలేదు. దీంతో డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల్లో బ్యాంకుల ప్రొవిజనింగ్స్‌ పెరగనున్నాయి. ఈ కేటాయింపుల్లో అధికభాగం

Most from this category