News


మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Monday 4th November 2019
Markets_main1572842258.png-29325

అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావహన అంచనాలతో సోమవారం మార్కెట్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌ ప్రారంభంలో 3శాతానికి పైగా లాభపడింది. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా పూర్తిస్థాయి ఒప్పందంపై ఇరుదేశాధ్యక్షులు ఈ నెలలో సంతకాలు చేయవచ్చని సంకేతాలను వెలువడ్డాయి. ఈ సానూకూలాంశంతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ముఖ్యంగా స్టీల్‌ సంబంధిత షేర్లకు గిరాకి నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం దేశీయ మెటల్‌ షేర్లు రాణిస్తున్నాయి. జిందాల్‌ స్టీల్‌, హిందాల్కో, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 5శాతం లాభపడ్డాయి. టాటా స్టీల్‌, సెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 4శాతం పెరిగాయి. నాల్కో, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 3శాతం, ఎన్‌ఎండీసీ, కోల్‌ ఇండియా, ఏపీఎల్‌అపోలో, వెల్‌స్పన్‌ కార్ప్‌, మెయిల్‌ ఇండియా షేర్లు 2శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. మరోవైపు రత్నమణి మెటల్‌, ట్యూబ్స్‌ లిమిటెడ్‌ షేరు అరశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. ఉదయం గం.10:00లకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3.20శాతం లాభంతో ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

26 పైసలు బలపడిన రూపీ

Monday 4th November 2019

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో సోమవారం సెషన్‌లో 26 పైసలు బలపడి రూ. 70.55 వద్ద ప్రారంభమైంది. విదేశీ నిధుల ఇన్‌ఫ్లో కొనసాగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 11 పైసలు బలపడి 70.81 వద్ద ముగిసింది. యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందనే అంచనాలున్నప్పటికి, యురోప్‌, యుఎస్‌ ఆర్థిక డేటా విడుదలవ్వడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా సోమవారం సెషన్లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11945 పైన ముగిస్తే 12280పాయింట్ల వరకు నిఫ్టీ!

Monday 4th November 2019

నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు గతవారం పాజిటివ్‌గా ముగిశాయి. నిఫ్టీ వారాంతానికి దాదాపు 2.3 శాతం లాభపడింది. ఇప్పటివరకు ప్రధాన సూచీలే ర్యాలీ జరుపుతుండగా క్రమంగా చిన్న స్టాకులు కూడా పాజిటివ్‌గా మారుతున్నాయని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా గతవారం మిడ్‌క్యాప్‌ సూచీ 3 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2 శాతం పైచిలుకు లాభంతో ముగిశాయి. డైలీ చార్టుల్లో నిఫ్టీ డోజీ క్యాండిల్స్‌ ఏర్పరుస్తోంది. ఇవి మార్కెట్లో అనిశ్చితికి నిదర్శనాలు. కానీ వీక్లీ

Most from this category