News


మెటల్‌ షేర్లకు ట్రేడ్‌ డీల్‌ జోష్‌..!

Friday 13th December 2019
Markets_main1576211367.png-30203

3శాతం ఎగిసిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 
చైనాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా ఫేజ్ వన్ వాణిజ్య ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడంతో మార్కెట్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3శాతం లాభపడింది.చైనాతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు దిగుమతయ్యే 160 బిలియన్ డాలర్ల విలువైన చైనా వినియోగ దిగుమతులపై కొత్త సుంకాలు నిలిపివేయనుంది. ఇందుకు ప్రతిఫలంగా అమెరికాకు చెందిన మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చైనా అంగీకారం తెలిపింది. ఒప్పందం సూత్రప్రాయంగా అంగీకారమైందని, కాని చట్టపరమైన అనుమతి లభించాల్సి ఉందని ఈ వ్యవహారంతో సంబంధం వ్యక్తులు తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు వైట్ హౌస్ ప్రతినిధి నిరాకరించారు. గత ఏడాదిన్నరగా అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం సమిసిపోతే మెటల్‌ షేర్లకు రానున్న రోజుల్లో మరింత డిమాండ్‌ పెరుగుతుందనే అంచనాలతో దేశీయ మెటల్‌ షేర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఉదయం గం.9:45ని.లకు ఇండెక్స్‌ కిత్రం ముగింపు(2,568.80)తో పోలిస్తే 2.50శాతం లాభంతో 2,633.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ మెటల్‌లోని షేర్లన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా హిందూస్థాన్‌ కాపర్‌ 3.50శాతం లాభపడింది. వేదాంత 3.50శాతం, టాటాస్టీల్‌ 3శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, హిందాల్కో, నాల్కో షేర్లు 2.50శాతం ర్యాలీ చేశాయి. సెయిల్‌, కోల్‌ ఇండియా షేర్లు 2శాతం పెరిగాయి. ఏపిల్‌ అపోలో, హిందూస్థాన్‌ జింగ్‌, మెయిల్‌ షేర్లు 1.50శాతం లాభపడగా, ఎన్‌ఎండీసీ షేరు 1శాతం, వెల్‌స్పన్‌ కార్ప్‌, రత్నమని లిమిటెడ్‌ షేర్లు అరశాతం వరకు పెరిగాయి. 



You may be interested

ఈ సూచీలో గోల్డెన్‌ క్రాస్‌.. మన సూచీలకు పాజిటివ్‌!

Friday 13th December 2019

ఎంఎస్‌సీఐ వర్ధమాన మార్కెట్‌ సూచీ(ఎంఎస్‌సీఐ ఈఎం ఇండెక్స్‌)లో తాజాగా ఏర్పడిన గోల్డెన్‌ క్రాస్‌ దేశీయ ఈక్విటీలు మరింత పాజిటివ్‌గా ఉంటాయనేందుకు సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో రెండోసారీ ఈఎం ఇండెక్స్‌లో గోల్డెన్‌ క్రాస్‌ ఏర్పడింది. స్వల్పకాలిక మూవింగ్‌ యావరేజ్‌ రేఖ కిందనుంచి పైకి దీర్ఘకాలిక మూవింగ్‌ యావరేజ్‌ రేఖను ఖండించడాన్ని గోల్డెన్‌ క్రాస్‌ అంటారు. టెక్నికల్‌గా 50 డీఎంఏ రేఖ దిగువనుంచి ఎగువకు 200 డీఎంఏ రేఖను ఖండిస్తే

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 13th December 2019

అటు అమెరికా-చైనాల ట్రేడ్‌డీల్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదం తెలపడం, ఇటు బ్రిటన్‌ ఎన్నికల్లో బోరిస్‌ జాన్సన్‌ విజయం సాధించవచ్చన్న ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలతో ప్రపంచ మార్కెట్లు భారీ ర్యాలీ జరుపుతున్న నేపథ్యంలో భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 178 పాయింట్ల లాభంతో 40,752 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 12,026 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category