News


లాభాల్లో మెటల్‌ షేర్లు

Tuesday 17th December 2019
Markets_main1576573352.png-30273

మార్కెట్‌ రికార్డు ర్యాలీలో మంగళవారం భాగంగా మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి. ఫలితంగా మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3.50శాతం ర్యాలీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,603.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రేపు జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో మెటల్‌ ఉత్పత్తులను సుంకాలను సవరించవచ్చని అంచనాలతో నేడు మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.77శాతం పెరిగి 2,662.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.2:00లకు ఇండెక్స్‌ 2.74శాతం లాభంతో 2662 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి జిందాల్‌ స్టీల్ 5శాతం, టాటాస్టీల్‌ 4శాతం, వేదాంత, సెయిల్‌, హిందాల్కో, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 3శాతం పెరిగాయి. జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఎన్‌ఎండీసీ, కోల్‌ ఇండియా షేర్లు 2శాతం లాభపడ్డాయి. హిందూస్థాన్‌ జింక్‌ 1 శాతం, మెయిల్‌ అరశాతం, నాల్కో, రత్నమణి లిమిటెడ్‌ షేర్లు అరశాతం పెరిగాయి. 
ఇదే సమయానికి సెన్సెక్స్‌ 350 పాయింట్లు పెరిగి 41,288 వద్ద, నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 12,141 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి 
 



You may be interested

మూడు స్టాకులపై మోర్గాన్‌స్టాన్లీ బుల్లిష్‌

Tuesday 17th December 2019

టెక్‌ మహీంద్రా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు ప్రముఖ బ్రోకరేజ్‌ మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. వచ్చే ఏడాదిలో ఈ స్టాకులు దాదాపు 20 శాతం వరకు రాబడినిస్తాయని అంచనా వేసింది.  - టెక్‌ మహీంద్రా: ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 850. కమ్యూనికేషన్‌ వ్యాపారం విభాగంలో కొత్త డీల్స్‌లో మెరుగుదల కనిపిస్తుంది. వచ్చే ఏడాది రెవెన్యూ గ్రోత్‌ 8-10 శాతం ఉండొచ్చు. మార్జిన్ల మెరుగుదలతో ఎర్నింగ్స్‌

ఆల్‌టైం హైకి బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 17th December 2019

మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్లతో మంగళవారం ట్రేడింగ్‌లో బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఇండెక్స్‌ 32వేల స్థాయి పైన 32,082.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌ ప్రక్రియ సోమవారం పూర్తయ్యిందని ఆర్సెలర్‌ మిట్టల్‌ ప్రకటించింది. దివాలా చట్టం కింద పరిష్కారమైన అతిపెద్ద రికవరీ ఇదే కావడంతో పలు బ్యాంకింగ్‌

Most from this category