News


మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Friday 23rd August 2019
Markets_main1566543765.png-27972

  • 2.50శాతం ర్యాలీ చేసిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌

ఇటీవల బాగా క్షీణించిన మెటల్‌ షేర్లు శుక్రవారం కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. వేదాంత, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, కోల్‌ ఇండియా షేర్ల ర్యాలీ ఇండెక్స్‌ లాభపడేందుకు తోడ్పడింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,191.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభమైంది. అంతర్జాతీయ వృద్ధి మందగమనం, ట్రేడ్‌వార్‌తో గతకొంతకాలంగా భారీగా పతనమైన మెటల్‌ షేర్లు కనిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఈ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా ఇండెక్స్‌ 2.64శాతం పెరిగి 2,261.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,203.60)తో పోలిస్తే 2.50శాతం పెరిగి 2,261.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో వేదాంత, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌ షేర్లు 5శాతం ర్యాలీ చేశాయి. టాటాస్టీల్‌ 4శాతం, నాల్కో 3.50శాతం, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఏపిఎల్‌ అపోలో షేర్లు 2శాతం, ఎన్‌ఎండీసీ, జేఎస్‌ఎల్‌ఆర్‌ హిస్సార్‌ హిందాల్కో, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 1శాతం, మెయిల్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. వెల్‌స్పన్‌కార్ప్‌, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 1.50శాతం నుంచి అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 

మధ్యాహ్నం గం.12:30లకు ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో 36,537.40 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల నష్టంతో 10,754.65 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

నిఫ్టీ, సెన్సెక్స్‌ టార్గెట్‌లను తగ్గించిన బ్రోకరేజిలు

Friday 23rd August 2019

సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాలు నిరాశపరచడంతో పాటు, ఆర్థిక మందగమనం వలన ఇన్వెస్టర్లకు ఇండియాపై దృక్పథం మారుతుండడంతో నిఫ్టీ, సెన్సెక్స్‌ టార్గెట్‌ అంచనాలను ప్రముఖ బ్రోకరేజి సంస్థలు తగ్గించాయి. నిఫ్టీ లాభాలు, అంచనాలను అందుకోలేకపోవడంతో నిఫ్టీ మార్చి 2020 టార్గెట్‌ను నోమురా 12,900 నుంచి 11,880కి తగ్గించింది. ‘ప్రస్తుత ఫలితాల సీజన్లో లాభాల వృద్ధి తగ్గుముఖం పట్టింది. ఆర్థిక సంవత్సరం 2019 ప్రారంభం నుంచి ఆర్థిక సంవత్సరం 2020-21లో నిఫ్టీ లాభాలు

లాభాల్లో ఒరాకిల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు

Friday 23rd August 2019

దేశియ కరెన్సీ డాలర్‌ మారకంలో 8 నెలల కనిష్ఠానికి పడిపోవడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఉదయం 11.50 సమయానికి 1.14 శాతం లాభపడి 15,810.65 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన ఒరాకిల్‌ (ఓఎఫ్‌ఎస్‌ఎస్‌) 3.20 శాతం లాభపడి రూ. 3,002.00 వద్ద, టీసీఎస్‌ 1.33 శాతం లాభపడి రూ. 2,245.45 వద్ద, ఇన్ఫోసిస్‌ 0.75 శాతం లాభపడి

Most from this category