News


అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Monday 10th February 2020
Markets_main1581324205.png-31658

  • 3.50శాతం నష్టపోయిన మెటల్‌ షేర్లు
  • 6శాతం పతమనమైన టాటా స్టీల్‌

అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్ తగ్గడంతో సోమవారం దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మిడ్‌ సెషన్‌ సమయానికి 3.50శాతం క్షీణించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్‌ ఉత్పత్తిదారు చైనాలో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో రెండో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన నాన్‌ఫెర్రస్‌ మెటల్‌ ఉత్పత్తి 10శాతం పతనమయ్యే అవకాశం ఉందని చైనా మెటల్‌ అసోసియేషన్‌ గణాంకాలు వెల్లడించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గింది. అలాగే ఇటీవల క్యూ3 ఫలితాలను వెల్లడించిన మెటల్‌ కంపెనీల ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు అందుకోలేకపోయాయి. దీంతో నేటి మార్కెట్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్ల కౌంటర్లో అమ్మకాలు వెల్లువత్తాయి. ఒక దశలో ఇండెక్స్‌ 3.50శాతం నష్టాన్ని చవిచూసి 2616.75 ఇంట్రాడే కనిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం 2గంటలకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు(2616.75)తో పోలిస్తే -3.13శాతం నష్టంతోనే 2,625.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన టాటా స్టీల్‌ అత్యధికంగా 6శాతం నష్టపోయింది. సెయిల్‌ 5.50శాతం, నాల్కో 4శాతం, హిందాల్కో 3.50శాతం, కోల్‌ ఇండియా, జిందాల్‌ స్టీల్‌, వేదాంత షేర్లు 3శాతం నష్టపోయాయి. హిందూస్థాన్‌ కాపర్‌, రత్నమని మెటల్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, మెయిల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, ఎన్‌ఎండీసీ షేర్లు 1శాతం క్షీణించాయి. హిందూస్థాన్‌ జింక్‌ షేరు అరశాతం నష్టపోయింది. ఒక్క ఏపిల్‌ అపోలో షేరు మాత్రం 3.50శాతం లాభపడింది. You may be interested

ఈ వారం నిఫ్టీకి 12,200 కీలకం?!

Monday 10th February 2020

హెచ్చుతగ్గులకు చాన్స్‌ 12.400కు చేరుకునే అవకాశాలు తక్కువే - ఉమేష్‌ మెహతా, రీసెర్చ్‌ హెడ్‌,  శామ్‌కో సెక్యూరిటీస్‌ కేంద్ర బడ్జెట్‌ విడుదల, రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్ష, దిగ్గజ కంపెనీల క్యూ3 ఫలితాలు వంటి ప్రధాన అంశాలను దాటుకుని వచ్చేశామంటున్నారు శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌.. ఉమేష్‌ మెహతా. దీంతో ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నట్లు చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లపై ఉమేష్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను

ఎయిర్‌టెల్‌.. లాభాల ట్యూన్‌ వెనుక?!

Monday 10th February 2020

3 నెలల్లో షేరు 45 శాతం ర్యాలీ ఏడాదిలో షేరు ధర రెట్టింపు గత వారం సరికొత్త గరిష్టానికి  మార్కెట్‌ విలువలో 12వ ర్యాంక్‌ మొబైల్‌ రంగ దేశీ దిగ్గజం భారత్‌ ఎయిర్‌టెల్‌ షేరు ఇటీవల జోరు చూపుతోంది. ఓవైపు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్‌ ఐడియా షేరు సరికొత్త కనిష్టాలకు చేరినప్పటికీ ఎయిర్‌టెల్‌ కౌంటర్లో ర్యాలీ నమోదవుతూ వస్తోంది. ప్రధానంగా పేరుకుపోయిన ఏజీఆర్‌ బకాయిలు, పెరుగుతున్న నష్టాలు వంటి అంశాలతో వొడాఫోన్‌ ఐడియా డీలాపడగా.. దక్షిణాఫ్రికా

Most from this category