News


తగ్గిన వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు: మెటల్‌ షేర్లకు డిమాండ్‌

Thursday 26th September 2019
Markets_main1569490388.png-28568

 అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలపై ట్రంప్‌ సానుకూల వ్యాఖ్యలు చేయడంతో గురువారం  ప్రపంచ మార్కెట్లలో మెటల్‌ షేర్లు లాభాల బాటపట్టాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్నాయి. అలాగే నేడు ఇక్కడ మార్కెట్లో నెలకొన్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా మెటల్‌కు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో మెయిల్‌, ఎన్‌ఎండీసీ, వేదాంత, నాల్కో, సెయిల్‌ షేర్లు 6.50శాతం నుంచి 5శాతం పెరిగాయి. సెయిల్‌, జిందాల్‌ స్టీల్‌ షేర్లు 4.50శాతం లాభపడ్డాయి. హిందూస్థాన్‌ జింక్‌ 4శాతం, కోల్‌ ఇండియా 3.50శాతం షేర్లు పెరిగాయి. అలాగే హిందాల్కో, వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌, టాటాస్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2శాతం పెరిగాయి. ఏపిల్‌ అపోలో షేర్లు 2.50శాతం నష్టపోగా, జేఎస్‌ఎల్‌హిస్సార్‌ స్టీల్‌ ఒకశాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,419.75)తో పోలిస్తే 2,503.10 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ఎల్‌ఐసీ పోర్టుఫోలియోలో టాప్‌లేపిన మిడ్‌క్యాప్స్‌!

Thursday 26th September 2019

 అతి పెద్ద దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) పోర్టుపోలియోలోని  షేర్లు సెప్టెంబర్‌ నెలలో అద్భుత ప్రదర్శనను చేశాయి. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ఎల్‌ఐసీ పోర్టుపోలియోలో మొత్తంగా 240 కంపెనీల షేర్లుండగా, అందులో 162 కంపెనీలు పాజిటివ్ రిటర్న్‌లను ఇవ్వడం గమనార్హం. రియల్‌ ఎస్టేట్‌, హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ వ్యాపారాలలో ఉన్న టెక్స్‌మాకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్‌ హోల్డింగ్స్ (సెప్టెంబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 24

లాభాల్లో ప్రభుత్వరంగ షేర్లు

Thursday 26th September 2019

ప్రభుత్వరంగ షేర్లు గురువారం మిడ్‌సెషన్‌లో లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేడు 2శాతం పెరిగింది. ప్రభుత్వ రంగానికి చెందిన పెట్రోమార్కెటింగ్‌ కంపెనీల్లోని ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం పెరిగాయి. బ్యాంకింగ్‌ రంగ సెక్టార్‌ల్లోని ఇండియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లు 1.10శాతం నుంచి 3శాతం పెరిగాయి. అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3శాతం లాభపడింది.  భారత్‌

Most from this category