STOCKS

News


మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Thursday 6th February 2020
Markets_main1580970237.png-31558

మార్కెట్లో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.20శాతం లాభపడింది. కరోనా వైరస్‌కు వాక్సిన్‌ విడుదలకావచ్చనే అంచనాలతో అంతర్జాతీయ వృద్ధి భయాలు తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. అక్కడి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న మెటల్‌ షేర్లు దేశీయంగానూ రాణిస్తున్నాయి. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,665.40)తో పోలిస్తే 1.15శాతం లాభంతో 2,695.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ మెటల్‌ షేర్లలో ప్రధాన షేర్లైన మొయిల్‌ షేరు అత్యధికంగా 5శాతం లాభపడింది. నాల్కో 3.50శాతం పెరిగింది. జిందాల్‌ స్టీల్‌ 3శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఎన్‌ఎండీసీ షేర్లు 2.50శాతం ర్యాలీ చేశాయి. వెల్‌స్పన్‌ కార్ప్‌ షేరు 1.50శాతం, టాటా స్టీల్‌, హిందూస్థాన్‌ జింక్‌, ఏపిల్‌ అపోలో రత్నమని మెటల్స్‌ లిమిటెడ్‌, వేదాంత షేర్లు 1శాతం పెరిగాయి. కోల్‌ ఇండియా షేరు అరశాతం పెరగ్గా... హిందూస్థాన్‌ కాపర్‌ షేరు ఎలాంటి లాభనష్టాలకు లోనవకుండా స్థిరంగానూ, హిందాల్కో షేరు 1శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి... మెటల్‌, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌, మీడియా షేర్ల అండతో సెన్సెక్స్‌ మునుపటి ముగింపు (41,142.66)తో పోలిస్తే 31 పాయింట్లు పెరిగి 41,173.62 వద్ద, నిఫ్టీ నిన్నటి ముగింపు(12,089.15) ముగింపుతో పోలిస్తే 10 పాయింట్లు లాభంతో 12,099 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ధర ఎక్కువయితే 5 జీ స్పెక్ట్రం కొనుగోలు చేయం భారతీ ఎయిర్‌టెల్‌

Thursday 6th February 2020

టెలికం ఆపరేటర్‌ అయిన భారతీ ఎయిర్‌టెల్‌ త్వరలో నిర్వహించనున్న వేలంలో 5జీ స్పెక్ట్రం కొనుగోలు చేయడంలేదని వెల్లడించింది. ట్రాయ్‌ సిఫార్సు చేసిన మెగా హెట్జ్‌ కనీస ధర రూ. 492 కోట్లయితే 5జీ స్పెక్ట్రం కొనబోమని భారతీ ఎయిర్‌ టెల్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 2.62 శాతం పెరిగి 547.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 6th February 2020

  వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు ఎవెన్యూ సూపర్‌ మార్కెట్స్‌: ఈ కంపెనీ రూ.4000 కోట్ల నిధులు సమీకరించడానికి షేర్ల విక్రయాన్ని ప్రారంభించింది. ఐఓసీ: ఐఓసీలో ఉన్న ప్రభుత్వ షేర్లను తిరిగి కోనుగోలు చేయమని కంపెనీకి ప్రభుత్వం చెప్పింది. తద్వారా కంపెనీలో తన వాటాను 51 శాతానికి తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: డిసెంబర్‌తో ముగిసిన ఈ కంపెనీ స్టాండెలోన్‌ నికర లాభం 56 శాతం తగ్గి

Most from this category