News


ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌: మెటల్‌ షేర్ల మెరుపులు

Thursday 2nd January 2020
Markets_main1577946403.png-30613

  • 17శాతం పెరిగి హిందూస్థాన్‌ కాపర్‌ షేరు

అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య ఒప్పందం పురోగతి సాధిస్తుందనే అంచనాలో గురువారం మార్కెట్లో మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం లాభపడింది. ఏడాదిన్నరగా చైనాతో సాగుతున్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అడుగులు వేస్తుందని ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. అందులో ఇటీవల చైనాతో కుదుర్చుకున్న తొలిదశ వాణిజ్య ఒప్పంద పత్రంపై జనవరి 15న సంతకం పెడుతున్నట్లు ఆయన పేర్కోన్నారు. వైట్‌ హౌస్‌ కేంద్రంగా చైనా ఉన్నతస్థాయి వాణిజ్య అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం ఉంటుందని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమంలో చెప్పుకొచ్చారు. తరువాత రోజు నుంచి రెండో దశ ఒప్పందంపై చర్చలు ప్రారంభం అవుతాయని ఈ సందర్భంగా ట్రంప్‌ తెలిపారు. రెండు అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే అశావహన అంచనాలతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందిపుచ్చుకున్న దేశీయ మెటల్‌ షేర్లు నేటి మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ర్యాలీని కొనసాగిస్తు‍న్నాయి. ఫలితంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం పెరిగి 2,853.60 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2796.05)తో పోలిస్తే 1.98శాతం లాభంతో 2,851.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా హిందూస్థాన్‌ కాపర్‌ 17శాతం పెరిగింది. సెయిల్‌ 8శాతం లాభపడింది. మెయిల్‌, నాల్కో షేర్లు 5శాతం, జిందాల్‌ స్టీల్‌ 4శాతం, టాటాస్టీల్‌ 3శాతం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, వేదాంత లిమిటెడ్‌ 3.50శాతం, హిందూస్థాన్‌ జింక్‌ 2శాతం, హిందాల్కో , ఎన్‌ఎండీసీ షేర్లు 1శాతం, ఏపిల్‌అపోలో షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు కోల్‌ ఇండియా, వెల్‌స్పన్‌ కార్ప్‌, రత్నమణిలిమిటెడ్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి. You may be interested

సెన్సెక్స్‌ డబుల్‌- ఈ 4 మిడ్‌క్యాప్స్‌.. కేక

Thursday 2nd January 2020

నిఫ్టీ హాఫ్‌ సెంచరీ కొత్త ఏడాదిలో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కారానికి వీలుగా ఈ నెల 15కల్లా ప్రాథమిక దశ ఒప్పందం కుదరనున్న వార్తలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌పైనా అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. దీంతో ఉదయం 11.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ

క్రమంగా జీఎస్‌టీ రేట్ల పెంపు?!

Thursday 2nd January 2020

వస్తు సేవల పన్ను రేట్లను క్రమంగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఒకేసారి పన్ను రేట్లను పెంచితే కన్జూమర్లపై పెను భారం పడుతుందన్న ఆలోచనతో వీటిని క్రమంగా పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. క్రమానుగత పెంపులో భాగంగా రేట్లను స్వల్పంగా పెంచడం, కొన్ని ఉత్పత్తులను అధిక శ్లాబులోకి దశలవారీగా మార్చడంలాంటి చర్యలను ప్రభుత్వం చేపట‍్టనుంది. ప్రస్తుత పన్ను నిర్మితిని పరిశీలించి, ఆదాయం పెంచుకునే సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం కేంద్ర, రాష్ట్రాల అధికారులతో

Most from this category