News


రాణిస్తున్న మెటల్‌ షేర్లు

Monday 18th November 2019
Markets_main1574057344.png-29669

పరిమితి శ్రేణిలో ట్రేడింగ్‌ జరుగుతున్న మార్కెట్లో మెటల్‌ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో దాదాపు 1.50శాతానికి పైగా లాభపడింది.  అమెరికా చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే వార్తలు మెటల్‌ షేర్లకు డిమాండ్‌ను పెంచాయి. గత రెండేళ్లుగా అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం సమిసిపోతే వృద్ధి మందగమనం నుంచి ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం లభిస్తుందని ఆర్థిక వేత్తలు ఆశావహన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదయం గం:11:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,498.80)తో పోలిస్తే 1.25శాతం లాభంతో 2,530.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా టాటాస్టీల్ 3.30శాతం లాభపడింది. జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, మెయిల్‌, హిందాల్కో, జిందాల్‌ స్టీల్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. సెయిల్‌ షేరు 1.50శాతం, వేదాంత, నాల్కో షేర్లు 1శాతం, హిందూస్థాన్‌ జింక్‌, ఎన్‌ఎండీసీ షేర్లు అరశాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో వెల్‌స్పన్‌కార్ప్‌, కోల్‌ ఇండియా షేర్లు 1శాతం నష్టపోగా, రత్నమని మెటల్స్‌, హిందూస్థాన్‌ కాపర్‌, ఏపిల్‌ అపోలో షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

టెలికాం కన్సాలిడేషన్‌తో..ఎయిర్‌టెల్‌కు లబ్ది !

Monday 18th November 2019

ప్రభుత్వ సాయం అందకపోతే మిగిలేవి రెండే.. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అంచనా ఏజీఆర్‌ బకాయిలు, ఫ్లోర్‌ ధర, నియంత్రణా జరిమానాలు, స్పెక్ట్రంకు సంబంధించి ప్రభుత్వం నుంచి సరైన రూపంలో సాయం అందకపోతే దేశీయ టెలికం పరిశ్రమ మరింత కన్సాలిడేషన్‌కు లోనవుతుందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అభిప్రాయపడింది. ప్రభుత్వం ‘నో రిలీఫ్‌’ అంటే టెలికం పరిశ్రమ నిర్మితే మారుతుందని తెలిపింది. ఏజీఆర్‌ జరిమానాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎయిర్‌టెల్‌కు గట్టి దెబ్బని కానీ పరిశ్రమలో

స్వల్ప నష్టాల్లో పసిడి

Monday 18th November 2019

అమెరికా-చైనాల మధ్య పాక్షికంగా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వైట్‌ హౌస్‌ ఉన్నతాధికారి ప్రకటించడంతో సోమవారం పసిడి ధర స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1.65డాలరు నష్టంతో 1,466.85 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే చర్చల సంపూర్ణంగా సఫలమయ్యానే సంకేతాల కొసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అమెరికా చైనాలకు చెందిన ఉన్నతాధికారులు శనివారం చర్చలపై ఫోన్‌లో సంభాషించినట్లు చైనా మీడియా శనివారం తెలిపింది.

Most from this category