Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

ప్రధాన వార్తలు

New Study Finds People Are Breathing In Cancer Causing Chemicals In Their Cars
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?

మీరు కార్లలో ప్రయాణిస్తున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత‍్త. ప్రయాణికులు కార్ల నుంచి వెదజల్లే క్యాన్సర్ కారక రసాయనాలను పీల్చుకుంటున్నారంటూ సంచలన నివేదిక వెలుగులోకి వచ్చింది.అమెరికా నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ విభాగానికి చెందిన నేషనల్‌ టాక్సాలజీ ప్రోగ్రామ్‌ (ఎన్‌టీపీ) కార్ల గురించి ద్రిగ్భాంతికర విషయాల్ని వెలుగులోకి  తెచ్చింది.2015 నుంచి 2022 మధ్యఎన్‌టీపీ పరిశోధకులు 2015 నుంచి 2022 మధ్య 101 ఎలక్ట్రిక్, గ్యాస్, హైబ్రిడ్ కార్ల క్యాబిన్ ఎయిర్‌పై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో 99 శాతం కార్లలో అగ్నిప్రమాదాల్ని నివారించే టీసీఐపీపీ (అంటే ట్రిస్(1-క్లోరో-2-ప్రొపైల్) ఫాస్ఫేట్) అనే రసాయనం ఉందని పరిశోధకులు గుర్తించారు. దీంతో పాటు క్యాన్సర్‌ కారకాలైన టీడీసీఐపీపీ, టీసీఈపీ అనే రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించారు.ఎలాంటి ప్రయోజనం లేదనితాజా అధ్యయనంపై ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ (యూఎస్‌ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్) స్పందించింది. వాహనాల లోపల వెదజల్లే ఫైర్‌ రిటార్డెంట్ రసాయనాల ప్రమాణాలను అప్‌డేట్‌ చేయాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికా హెల్త్‌ విభాగం జరిపిన అధ్యయనంలో కార్లలో అన్వేక కారణాల వల్ల వ్యాపించే మంటల్ని అదుపుచేసే రసాయనాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశోధకలు స్పష్టం చేశారు.  ఇదొక్కటే పరిష్కారంగ్రీన్ సైన్స్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్ శాస్త్రవేత్త లిడియా జాహ్ల్ మాట్లాడుతూ.. కార్లలో ప్రయాణించే సమయంలో కిటికీలు తెరవడం, నీడలో లేదా గ్యారేజీలలో పార్కింగ్ చేయడం ద్వారా కార్ల నుంచి రసాయనాల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.

Stock Market Trend On Today Closing
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 22,306 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 19 పాయింట్లు నష్టపోయి 73,492 వద్దకు చేరింది.సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, మారుతీ సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, నెస్లే, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, టీసీఎస్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) 

Microsoft buys 48 acre land in Hyderabad estimated worth 267 crore
హైదరాబాద్‌లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్‌!

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో భారీ విస్తీర్ణంలో భూమిని కొనుగోలు చేసింది. 48 ఎకరాల భూమిని రూ. 267 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రాప్‌స్టాక్‌కు లభించిన పత్రాల ద్వారా తెలిసింది.ఏప్రిల్ 18న సేల్ డీడ్ రిజిస్టర్ అయినట్లు డాక్యుమెంట్లను బట్టీ తెలుస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో ఉన్న భూమిని ఎకరం సుమారు రూ. 5.56 కోట్లు పెట్టి కొన్నట్లు సమాచారం. ల్యాండ్ అగ్రిగేటర్ సాయి బాలాజీ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఈ డీల్‌ జరిగినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి అధికారిక సమాచారం రాలేదు. మీడియా నివేదికల ప్రకారం, 2022లో, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌ను స్థాపించడానికి హైదరాబాద్‌లో సుమారు రూ. 275 కోట్లకు మూడు ల్యాండ్ పార్సెల్‌లను కొనుగోలు చేసింది.

AstraZeneca has decided to withdraw Covid-19 vaccine worldwide
కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను రద్దు చేసిన ఆస్ట్రాజెనెకా.. కారణం తెలుసా..

ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా సంస్థ తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్‌ నుంచి తొలగిస్తున్న సంస్థ ప్రకటించింది. కొన్ని వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్‌) కారణంగా చాలా అరుదుగా థ్రోంబోసిస్ అనే అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. టీకా తీసుకున్న వారిలో చాలా అరుదుగా రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్  తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. ఈమేరకు సంస్థ వీటిని ధ్రువపరుస్తూ యూకే కోర్డులో పత్రాలను అందజేసింది. అనంతరం ఆస్ట్రాజెనెకా తన కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.కొత్త కొవిడ్ వేరియంట్‌లతో పోరాడే  వ్యాక్సిన్‌ను ఇకపై సంస్థ తయారు చేయదని, దానికి సంబంధించిన డ్రగ్‌ను సరఫరా చేయదని సంస్థ స్పష్టం చేసింది. ఐరోపాలో సరఫరా చేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్ వాక్స్‌జెవ్రియా మార్కెటింగ్‌ను తొలగిస్తున్నట్లు చెప్పింది. అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని పేర్కొంది. ఇకపై ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరగదని వివరించింది.వ్యాక్సిన్‌ను రూపొందించడానికి గతంలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. యూకే ఆధారిత ఫార్మా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా కొవిషీల్డ్ అందించేందుకు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి. అయితే తాజా నిర్ణయంతో ఒకపై ఆ ఒప్పందాలు రద్దైనట్లు తెలిసింది.ఇదీ చదవండి: సిబ్బంది అనారోగ్యంతో 70కి పైగా విమానాలు రద్దుఅసలేం జరిగిందంటే..యూకేకు చెందిన జామీ స్కాట్ అనే వ్యక్తి 2021లో కొవిషీల్డ్‌ టీకా వేయించుకున్నారు. అప్పటినుంచి నిత్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. పూర్తి వైద్య పరీక్షలు చేసిన అనంతరం తన శరీరంలో రక్తం గడ్డకడుతుందని వైద్యులు గుర్తించారు. అయితే టీకా వేయించినప్పటి నుంచి ఈ సమస్య ఉండడంతో తన అనారోగ్యానికి అదే కారణమని అనుమానం వ్యక్తంచేశారు. మరిన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత తన పరిస్థితికి టీకానే కారణమని నిర్థారణ అయింది. తాను థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ బారిన పడినట్లు తేలింది. దాంతో యూకే కోర్టులో దావా వేశారు. తాజాగా కంపెనీ వివరణ ఇస్తూ చాలా అరుదుగా ఇలాంటి వాటికి అవకాశం ఉందని అంగీకరించింది.

Kitex Twenty20 contested in Lok Sabha election at Ernakulam and Chalakudy
KITEX Group: ‘ట్వంటీ20 పార్టీ.. తప్పుడు నిర్ణయాలతోనే ఇబ్బంది’

కేరళలో కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబు ఎం జాకబ్ ‘ట్వంటీ 20’ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఫేజ్‌2 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎర్నాకుళం(కొచ్చిన్‌), చలకుడి ఎంపీ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ప్రత్యేకంగా కార్పొరేట్‌ సంస్థను కలిగి ఉన్న ఆ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనడంపట్ల పలు విమర్శలు వెల్లువెత్తాయి.లాభదాయక కంపెనీ కలిగి రాజకీయ పార్టీలు స్థాపించకూడదనే నియమాలు ఎక్కడా లేవు. కానీ ఒకవేళ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిస్తే నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ కంపెనీలకు లాభాలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటేనే ఇబ్బంది అని విశ్లేషకులు చెబుతున్నారు. లెఫ్ట్‌ పార్టీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో కార్పొరేట్లపై పక్కా నిబంధనలు అమలు చేస్తారనే అభిప్రాయం ఉంది. కానీ కంపెనీలు రాయితీలు, కొన్ని ఇతర వెసులుబాట్లు కోరుకుంటాయి. ‍ప్రభుత్వం కొన్ని నియమాల్లో సడలింపు ఇవ్వాలనుకుంటాయి.2022లో పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ ఏర్పాటుకు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో ట్వంటీ 20 పొత్తు కుదుర్చుకుంది. అయితే ఇటీవల ఆ పొత్తుకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. పార్టీ చీఫ్‌ జాకబ్‌ గతంలో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సుమారు రూ.25 కోట్ల విలువైన ఎలక్టోరల్‌బాండ్లను కొనుగోలు చేశారు. అయితే ఈ అంశంపై ఆయన వివరణ ఇస్తూ..తమను బలవంతంగా ఎన్నికల బాండ్లు కొనేలా కొందరు ప్రేరేపించినట్లు చెప్పారు. అయితే పార్టీలకు విరాళాలు ఇచ్చినా వారినుంచి ఎలాంటి ‍ప్రయోజనం పొందలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్క ఓటు విలువ ఎంతంటే..రాజకీయ ప్రచార సమయంలో జాకబ్ కేరళ సీఎం పినరయి విజయన్ పనితీరును తీవ్రంగా విమర్శించారు. కేరళలో పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం లేదని ఆరోపించారు. గతంలో కైటెక్స్‌ ఫ్యాక్టరీ కేరళలో నిర్మించాలని ప్రతిపాదించారు. తరువాత దాన్ని తెలంగాణలో ప్రారంభించబోతున్నట్లు అప్పటి భారాస ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. కొచ్చిన్‌లోని కిజకంబాలంలో కైటెక్స్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోంది.

gold price today rate may 8
బంగారం స్పీడ్‌కు బ్రేక్‌.. కొనుగోలుదారులకు ఊరట!

దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈరోజు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. మూడు రోజులుగా వరసగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్‌ పడింది. ఈరోజు (మే 8) బంగారం ధరలు స్వల్పంగా తగ్గి పసిడి ప్రియులకు కాస్త ఉపశమనం కలిగించాయి.హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి  రూ.66,250 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం కూడా రూ.100 తగ్గి రూ. 72,270 లకు దిగొచ్చింది.ఇతర ప్రధాన నగరాల్లో..➤ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,400 లకు, 24 క్యారెట్ల పసిడి రూ.100 దిగొచ్చి రూ.72,420 లకు చేరింది. ➤ ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 వద్ద, 24 క్యారెట్ల స్వర్ణం రూ.100 క్షీణించి రూ.72,270 వద్దకు తగ్గింది.➤ బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,250 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,270 లకు దిగొచ్చింది.➤ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.66,300 ల​కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి రూ.72,330 లకు దిగొచ్చింది.

goutham adani said that all are utilize their vote
అందరూ పోలింగ్‌లో పాల్గొనాలి: అదానీ

ఆసియా కుబేరుల్లో ఒకరైన గౌతమ్‌ అదానీ కుటుంబ సమేతంగా అహ్మదాబాద్‌లో మంగళవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటుహక్కు కలిగి ఉన్న పౌరులందరూ పోలింగ్‌లో తప్పక పాల్గొనాలని ఆయన తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఓటింగ్‌ శాతం పెంచేలా ప్రకటనలు, సెలబ్రిటీ యాడ్స్‌..వంటి చాలా కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే.అదానీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌గా గౌతమ్‌ అదానీ వ్యవహరిస్తున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ రూ.3.5లక్షల కోట్లుగా ఉంది. గౌతమ్‌ అదానీ ఎంటర్‌ప్రైజ్‌ బిజినెస్‌తోపాలు పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఎలక్ట్రిక్‌ పవర్‌, మైనింగ్‌, పునరుత్పాదక ఇందనం, ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌, ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇన్‌ఫ్రా..వంటి రంగాల్లో కంపెనీలు స్థాపించి విజయవంతంగా వాటిని కొనసాగిస్తున్నారు.

AirIndia Express cancelled more than 70 flights due to a mass sick leave by its senior crew member
ఎయిరిండియా సిబ్బంది సిక్‌ లీవ్‌.. 70కి పైగా విమానాలు రద్దు

విమాన సేవలందిస్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 70కి పైగా సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించింది. సిబ్బంది అనారోగ్యంతో ఉండడమే ఇందుకు కారణమని చెప్పింది. రద్దైన విమానాల్లో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి. దాంతో ఉన్న సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని పౌర విమానయాన అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.సిబ్బంది అనారోగ్యంగా ఉన్నారని దాంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత సంస్థ తన ‘ఎక్స్‌’ ప్లాట్‌ఫామ్‌ వేదికగా స్పందించింది. ‘మా క్యాబిన్ సిబ్బందిలోని ఒక విభాగానికి చెందిన ఉద్యోగులు చివరి నిమిషంలో ఏకకాలంలో అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ఈ మేరకు మూకుమ్మడిగా ‘సిక్‌లీవ్‌’ దరఖాస్తులు అందాయి. దాంతో మంగళవారం రాత్రి నుంచి కొన్నివిమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరికొన్నింటిని రద్దు చేశాం. ఈ సంఘటనకు గల కారణాలను అర్థం చేసుకోవడానికి మేము సిబ్బందితో మాట్లాడుతున్నాం. ఊహించని పరిణామం వల్ల ప్రయాణికులకు అంతరాయం కలిగిస్తే క్షమాపణలు కోరుతున్నాం. ఇకపై చేసే ప్రయాణాలకు సంబంధించి సదరు సర్వీసు అందుబాటులో ఉందో లేదో సరిచూసుకోవాలి కోరుతున్నాం’ అని తెలిపింది.ఇదీ  చదవండి: ట్రేడింగ్‌ వేళల పెంపునకు నో చెప్పిన సెబీరద్దు అయిన విమానసర్వీసుల టికెట్‌ డబ్బులు వాపసు చేస్తామని.. లేదంటే మరోతేదీకి రీషెడ్యుల్‌ చేసుకునే వీలుందని కంపెనీ పేర్కొంది. More than 70 international and domestic flights of Air India Express from Tuesday night till Wednesday morning have been cancelled after the senior crew member of the airline went on mass 'sick leave'. Civil Aviation authorities are looking into the issue: Aviation Sources— ANI (@ANI) May 8, 2024

Stock Market Rally On Today Opening
నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:28 సమయానికి నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 22,249కు చేరింది. సెన్సెక్స్‌ 213 పాయింట్లు తగ్గి 73,301 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 105.4 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 82.98 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.45 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 0.13 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.1 శాతం నష్టపోయింది.ప్రాథమిక సైట్‌లో ఏమైనా లోపాలు లేదా అంతరాయాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం(మే 18న) ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు తెలిపాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్‌ ప్రధాన ప్రాథమిక సైట్‌లో.., ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్‌ డిజార్టర్‌ రికవరీ సైట్‌లో ట్రేడింగ్‌ జరగనుంది. అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్‌ ఉత్పత్తులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గరిష్ట పరిమితిని 5 శాతంగా నిర్ణయించాయి. ఎక్స్ఛేంజీలు ఈ తరహా ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను ఈ మార్చి 2న నిర్వహించాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Sebi rejects NSE proposal to extend trading hours for index derivatives
ఎన్ఎ‌స్‌ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ..

ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదనను క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తిరస్కరించింది. స్టాక్‌ ఎక్స్చేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ చేసిన ప్రతిపాదనకు సెబీ తాజాగా నో చెప్పింది. ఈ అంశంపై స్టాక్‌ బ్రోకర్ల నుంచి ఎలాంటి స్పందన లభించకపోవడంతో సెబీ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.దశలవారీగా ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో లావాదేవీలు చేపట్టే వేళలను పెంచలంటూ ఎన్‌ఎస్‌ఈ.. సెబీకి దరఖాస్తు చేసింది. అయితే ఇందుకు స్టాక్‌ బ్రోకర్ల అభిప్రాయాలను కోరినప్పటికీ స్పందన లభించకపోవడంతో సెబీ దరఖాస్తును తిప్పిపంపినట్లు ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. ఫలితంగా ప్రస్తుతానికి ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదన వీగిపోయినట్లేనని తెలియజేసింది.ఇదీ  చదవండి: ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్‌!ప్రపంచ మార్కెట్ల నిరంతర సమాచారం కారణంగా తలెత్తే ఓవర్‌నైట్‌ రిస్క్‌లను తగ్గించుకునేందుకు వీలుగా ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌ వేళల పెంపు ప్రతిపాదనకు తెరతీసింది. రోజువారీ(ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30వరకూ) సెషన్‌ ముగిశాక కమోడిటీ డెరివేటివ్స్‌ తీరులో సాయంత్రం 6–9 గంటల మధ్య ట్రేడింగ్‌కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రతిపాదించినట్లు ఎన్‌ఎస్‌ఈ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ చీఫ్‌ శ్రీరామ్‌ కృష్ణన్‌ పేర్కొన్నారు. తదుపరి స్టాక్‌ బ్రోకర్ల స్పందననుబట్టి క్రమంగా రాత్రి 11.55 వరకూ పొడిగించేందుకు యోచించినట్లు తెలియజేశారు.

కార్పొరేట్

Advertisement

మనీ మంత్ర

View all

Business exchange section

Currency Conversion Rate

Title Rate Date
SVC 90.380364 2024-04-09
MWK 90.380364 2024-04-09
SVC 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19
MWK 88.962966 2024-04-19

Commodities

Name Rate Change Change
Silver 100 gm 8750.00 100.00
Gold 22K 10gm 66050.00 200.00
Gold 24k 10 gm 72050.00 220.00

Egg & Chicken Price

Title Price Quantity
Chicken 390.00 1.00
Egg 3.65 1.00

Stock Action

Name LTP Rate Change%
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 174.7 13.5891
RAMCOSYS:NSE Ramco Systems Ltd 340.9 19.993
SADBHAV:NSE Sadbhav Engineering Ltd 34.85 -9.9483
DANGEE:NSE Dangee Dums Ltd 7.95 -11.6667
EMKAY:NSE Emkay Global Financial Services Ltd 155.75 9.9929
Advertisement