News


పాజిటివ్‌గా మెటల్‌ షేర్లు..జిందాల్‌ స్టీల్‌ 6% అప్‌

Monday 25th November 2019
Markets_main1574664931.png-29833

అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండడంతో దేశీయ మెటల్‌ షేర్లు సోమవారం సెషన్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నాం 12.13 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.51 శాతం లాభపడి 2,584.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  జిందాల్‌ స్టీల్‌ 5.93 శాతం పెరిగి రూ. 152.70 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 144.20 వద్ద ముగిసిన ఈ షేరు, సోమవారం సెషన్‌లో రూ. 145.15 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. ఈ ఇండెక్స్‌లోని ఇతర షేర్లలో హిందల్కో ఇండస్ట్రీస్‌ 3.86 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 3.44 శాతం, టాటా స్టీల్‌ 3.39 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 2.63 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 2.40 శాతం, సెయిల్‌ 2.33 శాతం, వేదాంత 2.18 శాతం,  హిందుస్థాన్‌  కాపర్‌ 1.00 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 0.99 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 0.81 శాతం, కోల్‌ ఇండియా 0.70 శాతం,    రత్నమని మెటల్స్‌ అండ్‌ టూబ్స్‌ 0.44 శాతం, మొయిల్‌ 0.07 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. కానీ ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ మాత్రం 0.10 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.You may be interested

పీఎస్‌యూ బ్యాంకింగ్‌కు కొనుగోళ్ల మద్దతు

Monday 25th November 2019

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ నేటి మిడ్‌సెషన్‌ కల్లా 1.50శాతం ర్యాలీ చేసింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,562.05 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు ఈ రంగ షేర్ల కొనుగోళ్లకు ఆస్తకి చూపడంతో ఇండెక్స్‌ ఒక దశలో 1.50శాతం లాభపడి 2,595.55స్థాయికి ఎగిసింది. మధ్యాహ్నం 12:15ని.లకు ఇండెక్స్‌

50రోజుల్లో బీపీసీఎల్‌ ఆస్తుల మదింపు!

Monday 25th November 2019

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ విక్రయంలో భాగంగా సంస్థ ఆస్తుల విలువ లెక్కించేందుకు ప్రభుత్వం విలువ మదింపుదారుకు 50 రోజుల కాలపరిమితి విధించింది. దీంతో బీపీసీఎల్‌ వాటా విక్రయ ప్రక్రియలో తొలి అడుగు పడినట్లయింది. విలువ మదింపు పూర్తయ్యాక కొనుగోలుదారుల నుంచి బిడ్స్‌ ఆహ్వానిస్తారు. ఈ నెల 20న బీపీసీఎల్‌తో పాటు ఎస్‌సీఐ, టీహెచ్‌డీసీఐఎల్‌, నీప్కోలను మేనేజ్‌మెంట్‌ నియంత్రణతో సహా కొత్త ఇన్వెస్టర్లకు అమ్మేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం వేసింది. వీటితో

Most from this category