STOCKS

News


నష్టాల్లో మెటల్‌ షేర్లు..హిందుస్తాన్‌ కాపర్‌ 5% డౌన్‌

Thursday 21st November 2019
Markets_main1574327899.png-29760

హాంగ్‌కాంగ్‌లో ఉద్రిక్తతలు నెలకొనడంతో యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గురువారం సెషన్‌లో మెటల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మధ్యాహ్నం 2.37 సమయానికి 1.24 శాతం నష్టపోయి 2,493.60 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హిందుస్థాన్‌  కాపర్‌ 5.18 శాతం, సెయిల్‌ 3.30 శాతం, కోల్‌ ఇండియా 2.19 శాతం, టాటా స్టీల్‌ 1.83 శాతం, జిందాల్‌ స్టీల్‌ 1.53 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 1.52 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 1.07 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 0.94 శాతం, వేదాంత 0.81 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ 0.31 శాతం, వెల్‌స్పన్‌ కార్ప్‌ 0.29 శాతం, రత్నమని మెటల్స్‌ అండ్‌ టూబ్స్‌ 0.01 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 1.13 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 0.59 శాతం,  మొయిల్‌ 0.14 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి.You may be interested

టీవీ నెట్‌వర్క్ 18 కొనుగోలుకు సోనీ ఆసక్తి..?

Thursday 21st November 2019

ముఖేశ్‌ అంబానీ నియంత్రణలోని టెలివిజన్‌ వ్యాపారంలో వాటాను కొనుగోలు చేసేందుకు జపాన్‌ దిగ్గజం సోనీ కార్ప్ ఆస్తకి చూపుతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ముఖేశ్‌ నేతృత్వంలోని నెట్‌వర్క్ 18 మీడియా ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సోని ప్రయత్నాలను మమ్మురం చేసినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. దక్షిణాసియా దేశాల్లో రోజురోజూకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా సోని ఈ కొనుగోలు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం సోనీ

రికవరీ బాటలో బ్యాంకింగ్‌

Thursday 21st November 2019

-బీఎన్‌పీ పారిబా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం నుంచి మందగమనంలో ఉందని, ఫలితంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో రుణాలివ్వడం తగ్గిందని, కానీ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గడం, బ్యాంకుల నియంత్రణ సామర్ధ్యం పెరగడం, తక్కువ పన్ను రేటు వంటి అంశాల వలన దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ రికవరీకి  సిద్ధంగా ఉందని బీఎన్‌పీ పారిబా పేర్కొంది. బ్యాంకుల డిజిటిల్‌ కార్యక్రమాలు పెరగడం, తక్కువగా శ్రామిక అవసరాలను ఉపయోగిస్తుండడం వంటి కారణాల వలన బ్యాంకుల ఆపరేషనల్‌ సామర్ధ్యం పెరిగిందని,

Most from this category