News


స్టీల్‌ ధరల పెంపు? మెటల్‌ షేర్ల మెరుపు

Tuesday 14th January 2020
Markets_main1578975935.png-30913

మెటల్‌ ఇండెక్స్‌ 1.4 శాతం ప్లస్‌
వేదాంతా, సెయిల్‌, టాటా స్టీల్‌ జోరు

వచ్చే నెల నుంచీ స్టీల్‌ ధరలు మరోసారి పెరిగే అవకాశమన్నట్లు పరిశ్రమ వర్గాలు తాజాగా పేర్కొంటున్నాయి. ఇందుకు మెటల్‌కు కనిపిస్తున్న డిమాండుతోపాటు ముడివ్యయాలు పెరగడం కారణంకానున్నట్లు తెలియజేశాయి. వెరసి వరుసగా నాలుగో నెలలోనూ స్టీల్‌ ధరలు పెరిగే వీలున్నట్లు వివరించాయి. గత రెండు నెలలుగా స్టీల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. టన్నుకి రూ. 2,000 వరకూ హెచ్చాయి. స్టీల్‌ ధరల విషయంలో కీలకంగా నిలిచే చైనా నుంచి సరఫరాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో స్టీల్‌కు గిరాకీ బలపడుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. చైనాలో స్టీల్‌ వినియోగం పుంజుకోవడంతో ముడిసరుకుల ధరలు సైతం పెరుగుతున్నట్లు తెలియజేశాయి. ఈ బాటలో జనవరి మొదట్లోనూ దేశీయంగా స్టీల్‌ కంపెనీలు టన్నుకి రూ. 1750 వరకూ ధరలను పెంచిన విషయాన్ని ప్రస్తావించాయి. స్టీల్‌ను అధికంగా వినియోగించే పరిశ్రమలు, డీలర్ల నుంచి డిమాండ్‌ ఊపందుకోవడం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశాయి. 
 

కొనసాగవలసి ఉంది
డిమాండ్‌ మందగించడంతో ఆరు నెలల క్రితం స్టీల్‌ పరిశ్రమ గడ్డురోజులను ఎదుర్కొన్నట్లు ఆర్సెలర్‌ మిట్టల్‌ పేర్కొంది. దీంతో స్టీల్‌ ధరలు క్షీణించినట్లు తెలియజేసింది. ఇటీవల ధరలు పుంజుకోవడం పరిశ్రమకు దీర్ఘకాలికంగా మేలు చేయగలదని అభిప్రాయపడింది. అయితే రికవరీ కొనసాగవలసి ఉన్నట్లు చెబుతోంది. కాగా.. ఇటీవల ముడిఇనుము ధరలు పెరుగుతున్నాయి. జనవరిలో ఎన్‌ఎండీసీ టన్నుకి రూ. 200 చొప్పున పెంచింది. నవంబర్‌లో నమోదైన 96 డాలర్లతో పోలిస్తే ముడిఇనుము ధరలు గత నెలకల్లా 14 శాతం పెరిగి 106 డాలర్లను తాకినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇదే విధంగా కోకింగ్‌ కోల్‌ ధరలు సైతం 134 డాలర్ల నుంచి 145 డాలర్లకు ఎగసినట్లు తెలియజేశారు.

మెటల్‌ షేర్లు అప్‌
స్టీల్‌కు డిమాండ్‌ పుంజుకోవడం, ధరలు మరింత పెరగనున్న అంచనాలతో మంగళవారం ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లు వెలుగులో నిలుస్తున్నాయి. దీంతో మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య కదులుతున్నప్పటికీ.. ఉదయం 9.50 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 1.4 శాతం ఎగసింది. మెటల్‌ కౌంటర్లలో వేదాంతా, సెయిల్‌, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, ఎన్‌ఎండీసీ, నాల్కో, రత్నమణి మెటల్స్‌, హిందుస్తాన్‌ జింక్‌ 3-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర కౌంటర్లలో జిందాల్‌ స్టీల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌ సైతం 0.5 శాతం బలపడి ట్రేడవుతున్నాయి.



You may be interested

వేతన జీవులకు బడ్జెట్లో వరాలు?!

Tuesday 14th January 2020

రాబోయే బడ్జెట్లో ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వేతనజీవులకు రూ. 2.5 లక్షల వరకు 80 కేటగిరీ సేవింగ్స్‌ కింద పన్ను మినహాయింపునకు అవకాశం కల్పించనుందని, 80సీలో కొత్త విభాగం ఏర్పరిచి రూ. 50వేల వరకు ఎన్‌ఎస్‌సీల కొనుగోలుపై పన్ను మినహాయింపును ఇవ్వనుందని తెలిపాయి. దీంతో పాటు పీపీఎఫ్‌ ఇన్వెస్టర్లకు గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ. 2.5 లక్షల వరకు అనుమతించాలని యోచిస్తున్నట్లు

బీఈఈఆర్‌ నిష్పత్తి బాగుంది... సూచీలు ముందుకే!

Tuesday 14th January 2020

ఇండెక్స్‌ కదలికలను సూచించే నిష్పత్తి బీర్‌ నిష్పత్తి(బీఈఈఆర్‌- బాండ్‌ ఎర్నింగ్‌ ఈల్డ్‌ రేషియో) సుముఖంగా ఉన్నందున దేశీయ మార్కెట్లో పాజిటివ్‌ కదలికలే కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో నిఫ్టీలో అధిక పీఈ విలువ మరికొంత కాలం కొనసాగవచ్చంటున్నారు. పదేళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌కు, సూచీల ఎర్నింగ్‌ ఈల్డ్‌కు మధ్య నిష్పత్తిని బీఈఈఆర్‌ అంటారు. బాండ్స్‌ కన్నా ఈక్విటీలు ఇన్వెస్టర్లను ఎంత మేరకు ఆకర్షిస్తాయనే అంశాన్ని ఈ నిష్పత్తి తెలియజేస్తుంది. పదేళ్ల

Most from this category