News


మెటల్‌ షేర్లకు మాంద్యం భయాలు

Tuesday 3rd September 2019
Markets_main1567503759.png-28165

అంతర్జాతీయ ఆర్థిక మందగమన భయాలతో మెటల్‌ షేర్లు మంగళవారం భారీ పతనాన్ని చవిచూసాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2.50శాతం మేర కరిగిపోయింది. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,269.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అగ్రరాజ్యాలైన అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన భయాలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ భారీగా క్షీణించింది. అక్కడి నుంచి ప్రతికూల సంకేతాలను అందిపుచ్చుకున్న మెటల్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో భారీగా కరిగిపోయాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒకదశలో ఇండెక్స్‌ 2.64 శాతం క్షీణించి 2229.30 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ కిత్రం ముగింపు(2,289.95)తో పోలిస్తే 2.56శాతం నష్టంతో 2,231.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో షేర్లన్నీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా జిందాల్‌ స్టీల్‌ 5శాతం పతనమైంది. టాటాస్టీల్‌, వేదాంత, నాల్కో షేర్లు 4శాతం నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందాల్కో, ఎన్‌ఎండీసీ షేర్లు 3.50శాతం, మొయిల్‌, ఏపిల్‌అపోలో షేర్లు 3శాతం క్షీణించాయి. జేఎస్‌ఎల్‌ఆర్‌ హిస్సార్‌, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2.50శాతం, సెయిల్‌, కోల్‌ ఇండియా, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 2శాతం నష్టపోగా, వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. 



You may be interested

బేరిష్‌ మార్కెట్లో ఏడాది గరిష్ఠాన్ని తాకిన 15 స్టాకులు

Tuesday 3rd September 2019

ఎన్‌ఎస్‌ఈలో మంగళవారం 15 స్టాకులు మార్కెట్‌ బేరిష్‌ కదలికలను తట్టుకొని​వాటి 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. అబాట్ ఇండియా, బాటా ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ(ఏఎంసీ), హిందుస్తాన్ ఫుడ్స్, ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇన్ఫోసిస్, లిబాస్ డిజైన్స్, మెట్రోపోలిస్ హెల్త్‌కేర్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్‌) షేర్లు వాటి ఏడాది గరిష్ఠాన్ని  తాకిన షేర్లలో ఉన్నాయి.  మధ్యాహ్నా 3.03 సమయానికి నిఫ్టీ

ప్రభుత్వ బ్యాంకులపై ప్రతికూలంగా ఉన్నాం

Tuesday 3rd September 2019

-హెమాంగ్‌జానీ ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం జరిగినప్పటికి ఈ బ్యాం‍కులలో గణనీయమైన మెరుగుదల ఉంటుందని అనుకోవడంలేదని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెమాంగ్‌ జానీ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే... విలీనం తర్వాత మెరుగుదల చూడలేదు.. ప్రభుత్వరంగ బ్యాంకు విలీనాలను ఇది వరకు చూశాం. విలీనం వలన బ్యాంక్‌ల ఆపరేటింగ్‌ లేదా వ్యాపారం పరంగా ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. బ్యాంకుల విలీనంలో ప్రభుత్వానికి స్వంత ప్రాధాన్యతలుండొచ్చు కానీ క్రింది

Most from this category