News


3శాతం పతనమైన వేదాంత, సెయిల్‌

Tuesday 28th January 2020
news_main1580188827.png-31261

చైనాలో మెటల్‌ ఉత్పత్తి తగ్గుముఖం పట్టవచ్చనే అందోళనలతో ప్రపంచ వ్యాప్తంగా మెటల్‌ ధరలు భారీగా దిగివస్తున్నాయి. మెటల్‌ ధరలు తగ్గముఖం పట్టడంతో అటు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లోనూ మెటల్‌ షేర్ల భారీగా నష్టపోయతున్నాయి. ముఖ్యంగా స్టీల్‌ సంబంధింత షేర్లు ఎక్కువగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌ సెషనలో ఏకంగా 2శాతం నష్టాన్ని చవిచూసింది. ఉదయం గం.10:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు 2,709.75తో పోలిస్తే 1.66శాతం నష్టంతో 2,664.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో సెయిల్‌ 3.30శాతం, వేదాంత, వెల్‌స్పన్‌ కార్ప్‌ 2.70 శాతం, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 2శాతాన్ని నవిచూశాయి. జిందాల్‌ స్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, కోల్‌ ఇండియా, నాల్కో, ఎన్‌ఎండీసీ, హిందాల్కో షేర్లు 1శాతం నష్టాన్ని చవిచూశాయి. మెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. ఇదే ఇండెక్స్‌లో ఏపిల్‌ అపోలో షేరు 0.25శాతం నష్టపోగా, రత్నమని మెటల్‌ అండ్‌ ట్యూబ్స్‌ లిమిటెడ్‌ షేర్లు 1శాతం లాభపడింది. 



You may be interested

నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 28th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్లు ఇంటర్‌ గ్లోబ్‌: ఈ కంపెనీ క్యూ3 కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.185 కోట్ల నుంచి రూ.496 కోట్లకు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన  ఆదాయం 25.5 శాతం పెరిగి రూ.9,932 కోట్లకు చేరింది. టొరంటో ఫార్మా: ఈ కంపెనీ నికర లాభం 2 శాతం పెరిగి రూ.251 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 4.1 శాతం పెరిగి రూ.1,966 కోట్లుగా నమోదైంది. మారుతీ సుజుకీ: దేశీయ

యూఎస్‌ఎల్‌, వొకార్డ్‌ జోరు- టొరంట్‌ బోర్లా

Tuesday 28th January 2020

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ స్పిరిట్స్‌, ఫార్మా కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. మరోపక్క ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో హెల్త్‌కేర్‌ కంపెనీ టొరంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి యూఎస్‌ఎల్‌, వొకార్డ్‌ కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. టొరంట్‌ ఫార్మా నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. యూఎస్‌ఎల్‌ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ

Most from this category