News


మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Friday 8th February 2019
Markets_main1549619226.png-24092

మార్కెట్లో మిడ్‌సెషన్‌ అనంతరం మెటల్‌ షేర్ల పతనం కొనసాగింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో మొత్తం 15షేర్లకు గానూ 14 షేర్లు నష్టపోగా, ఒక్క నాల్కో షేరు మాత్రం 1.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. క్యూ3 ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ.., సెయిల్‌ షేరు మాత్రం నేటి ట్రేడింగ్‌లో దాదాపు 7శాతం నష్టపోయింది. వేదాంత 5శాతం, వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌ 4శాతం, జిందాల్‌ స్టీల్‌, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ షేర్లు 3శాతం క్షీణించాయి. అలాగే హిందూస్థాన్‌ జింక్‌, కోల్‌ ఇండియా షేర్లు 2శాతం నష్టపోగా, ఎన్‌ఎండీసీ హిందూస్థాన్‌ కాపర్‌, హిందాల్కో షేరు 2శాతం నష్టపోయాయి. అలాగే మెయిల్‌ , ఏపిఎల్‌అపోలో షేర్లు అరశాతం పడిపోయాయి. అయితే నాల్కో షేరు 1.50శాతం లాభంతో ట్రేడ్‌ అవుతుండం విశేషం. మధ్యాహ్న గం.3:00లకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గతముగింపు(2,835.80)తో పోలిస్తే 3శాతానికి పైగా నష్టపోయి 2,746 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ వేదాంత లిమిటెడ్‌ షేరు 5శాతం నష్టపోయి నిఫ్టీ -50 సూచీలో టాప్‌ - 5 లూజర్లలో రెండోస్థానంలో ట్రేడ్‌ అవుతోంది.You may be interested

ఏప్రిల్‌లో మరోమారు రేట్‌కట్‌!

Friday 8th February 2019

గ్లోబల్‌ బ్రోకరేజ్‌ల అంచనా అనూహ్యంగా ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఈ దఫా సమావేశంలో రేట్‌కట్‌ నిర్ణయం ప్రకటించింది. అందరూ కేవలం ఆర్బీఐ ధృక్పథంలో మాత్రమే మార్పు ఉంటుందని భావిస్తున్న సమయాన అనుకోని విధంగా 25 బీపీఎస్‌ రేట్‌ కట్‌ను ప్రకటించింది. ఈ నిర్ణయం మానిటరీ పాలసీ సైకిల్‌లో రివర్సల్‌కు ఆరంభమని ప్రస్తుతం గ్లోబల్‌ బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. వచ్చే ఏప్రిల్‌ సమావేశంలో ఆర్‌బీఐ మరోమారు రేట్లను తగ్గించవచ్చని అంచనా వేశాయి.

ఈ ఏడాది జోడు గుర్రాలివే!

Friday 8th February 2019

కుంజ్‌ బన్సాల్‌ రికమండేషన్‌ బ్యాకింగ్‌రంగంలో వాల్యూషన్లు, ఫండమెంటల్స్‌ పరంగా ఈ ఏడాది యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ దుమ్ముదులుపుతాయని ప్రముఖ అనలిస్టు కుంజ్‌ బన్సాల్‌ అంచనా వేశారు. గతేడాది తాను చెప్పిన జంట స్టాకులు రిలయన్స్‌, టీసీఎస్‌లు సత్తా చూపాయని, ఈ ఏడాది యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు దూసుకుపోతాయని అంచనా వేశారు. క్యు3 ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ ఎఫ్‌ఎంసీజీ రంగంలో మంచి వాల్యూం వృద్ధి కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా పెయింట్స్‌ విక్రయాలు

Most from this category