News


నష్టాల మార్కెట్లో మెటల్‌ షేర్లకు కష్టాలు

Thursday 14th November 2019
Markets_main1573719742.png-29587

3శాతం నష్టపోయిన నాల్కో
మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్‌ ఉత్పత్తిదారు చైనా ఈ అక్టోబర్‌ ఆర్థిక గణాంకాలు ఆశించినస్థాయిలో నమోదుకాకపోవడం, అమెరికాతో మొదటి దశ వాణిజ్య చర్చలు సఫలంపై అనుమానాలు వ్యక్తం కావడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై పడింది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం క్షీణించింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,556.65)తో పోలిస్తే 1.60శాతం నష్టంతో 2,515.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా నాల్కో 3శాతం నష్టపోయింది. వేదాంత 2.50శాతం, హిందాల్కో, కోల్‌ ఇండియా షేర్లు 2శాతం క్షీణించాయి. హిందూస్థాన్‌ కాపర్‌ 1.50శాతం, ఎన్‌ఎండీసీ, జిందాల్‌ స్టీల్‌, ఏపిల్‌ అపోలో, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌ షేర్లు 1శాతం పతనమవగా, సెయిల్‌ షేరు అరశాతం నష్టపోయింది. మరోవైపు నిన్న క్యూ2 ఫలితాలను మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో హిందూస్థాన్‌ జింక్‌ షేరు అరశాతం, మెయిల్‌ అరశాతం, రత్నమణి మెటల్స్‌ అండ్‌ టూబ్స్‌ లిమిటెడ్‌ షేరు 0.10శాతం వరకు క్షీణించాయి. 



You may be interested

తర్వాత తరాలకు అద్భుత పోర్టుఫోలియో అందించండి ఇలా!

Thursday 14th November 2019

మీ రాబోయే తరాలకు ఈక్విటీల్లో మంచి సంపదనందించేందుకు రెండు సులభమార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వీలయినంత తొందరగా పొదుపును ఆరంభించడం, సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌లో క్రమానుగత పెట్టుబడులు మరవకుండా పెట్టడం.. అనే రెండు సూత్రాలు కచ్చితంగా పాటిస్తే తర్వాత తరానికి మంచి సంపదను, అద్భుత పోర్టుఫోలియోను అందించినవారైతారు. కనీసం పది, పదిహేనేళ్లు సిప్‌ను కొనసాగించేలా ప్లాన్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు పెరిగేకొద్దీ వారి అవసరాలు పెరుగుతుంటాయి. అందువల్ల పెట్టుబడికి ముందే

విజిల్‌బ్లోయర్‌ ఫిర్యాదును తిప్పికొట్టిన ఇన్ఫోసిస్‌ లీగల్‌ టీం

Thursday 14th November 2019

   ఇన్ఫోసిస్ సెప్టెంబర్‌లో ఎదుర్కొన్న విజిల్‌బ్లోయర్‌ లేఖను కంపెనీ, పబ్లిక్‌తో పంచుకోలేదనే ఆరోపణలను కంపెనీ లీగల్‌ టీం గురువారం తిప్పికొట్టింది. అంతర్గత విజిల్‌ బ్లోయర్‌ పాలసీ ఆధారంగా కంపెనీ అన్ని నిబంధనల్ని పాటిస్తోందని లీగల్‌ టీంలోని న్యాయవాదులు తెలిపారు. అంతేకాకుండా విజిల్‌ బ్లోయర్‌ ఫిర్యాదులోని అంశాల ఖచ్చితత్వాన్ని పరిశీలించకుండా, ఈ ఫిర్యాదును పబ్లిక్‌కు విడుదల చేస్తే కంపెనీ, మైనార్టీ ఇన్వెస్టర్లు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. కాగా ఇన్ఫోసిస్‌ షేరు అక్టోబర్‌ నెలలో

Most from this category